హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: న్యూమరాలజీ : ఈరోజు డబ్బు శక్తిని ఉపయోగించండి..

Numerology: న్యూమరాలజీ : ఈరోజు డబ్బు శక్తిని ఉపయోగించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 1వ తేదీ సోమవారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 1వ తేదీ సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మార్కెటింగ్ కార్యకలాపాలలో, వ్యాపారం కోసం బడ్జెట్‌లో సమయాన్ని వెచ్చిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో అభివృద్ధి, లగ్జరీ పొందవచ్చు. ఈ రోజు మీకు ఏదైనా సవాలును స్వీకరించడానికి అవసరమైన శక్తి, ఉత్సాహం ఉంటాయి. కాబట్టి వ్యాపారంలో రిస్క్ తీసుకోండి. ఈ రోజు దంపతుల మధ్య సమస్య ఏర్పడుతుంది, కాబట్టి క్షమించడం ఉత్తమ పరిష్కారం. విజయం సాధించాలంటే సూర్య భగవానుడి ఆశీర్వాదం తీసుకోవాలని గుర్తుంచుకోండి. పేదలకు పసుపు రంగు భోజనం పంపిణీ చేయండి. చుట్టూ ఉన్న చాలా మంది ప్రజలు మీ విజయాన్ని చూసి అసూయ పడుతున్నారు, సాయంత్రం పాల నీటితో స్నానం చేయాలి. క్రీడాకారులు విజయాన్ని ఆస్వాదిస్తారు. మీరు ఈరోజు మీ ఆటలో ఒక ప్రత్యేక నాయకుడిని కలుస్తారు.

మాస్టర్‌ కలర్‌: క్రీమ్‌

లక్కీ డే: ఆదివారం, శుక్రవారం

లక్కీ నంబర్‌: 1

దానాలు: ఆశ్రమాలకు చక్కెర దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో చేసే కమిట్‌మెంట్స్‌తో నిండిన రోజు. ప్రేమలో ఉన్నవారు ఫీలింగ్స్‌ను సీరియస్‌ కమిట్‌మెంట్స్‌గా మార్చుకోవడానికి అనువైన రోజు. మీరు పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కూడా అనుభవిస్తారు. కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి, స్పోర్ట్స్ టోర్నమెంట్‌లకు హాజరు కావడానికి కూడా ఇది గొప్ప రోజు. కానీ పెట్టుబడిపై రాబడి యావరేజ్‌గా కనిపిస్తోంది. సౌందర్య సాధనాలు, లిక్విడ్స్‌, ఎలక్ట్రానిక్, మందులు, ఎగుమతి దిగుమతులు, సోలార్ ఎనర్జీ, వ్యవసాయం, రసాయనాల వ్యాపారులు లాభాన్ని పొందే అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: క్రీమ్‌, స్కై బ్లూ

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

దానాలు: యాచకులకు, పశువులకు తాగునీరు అందజేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ఇంట్లో తులసి మొక్కను ఉంచి సాయంత్రం దీపం వెలిగించండి. మీ వ్యక్తిత్వంలోని సృజనాత్మక భాగాన్ని ప్రదర్శించడానికి ఈ రోజు చాలా అదృష్టవంతులు. విద్యార్థులకు విజయవంతమైన రోజు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. కానీ మీ గురువుకు కృతజ్ఞతలు చెప్పడం గుర్తుంచుకోండి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ఇది ఒక గొప్ప రోజు. మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేయడానికి అనువైన రోజు. పాత కోచ్ సహాయంతో క్రీడాకారులు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రాజకీయాల్లో లేదా ప్రభుత్వ అధికారులు మాస్ దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పరీక్ష రాసే ముందు తప్పనిసరిగా గురు మంత్రాన్ని జపించాలి. స్త్రీలు సాయంత్రం పూట గురువుకు దీపారాధన చేయాలి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 1

దానాలు: యాచకులకు అరటి పండ్లు దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. పరిసరాలలో ఎల్లప్పుడూ పచ్చని మొక్కలకు నీరు పెట్టండి. మీరు సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్‌లో సాంకేతిక సంస్థలలో ఉంటే, కొత్త అవకాశాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రోజు హై మేనేజ్‌మెంట్‌ ఉంటుంది, పరిపూర్ణతను సాధిస్తారు. వ్యాయామానికి సమయం కేటాయించండి. ఎక్కువ సమయం ప్లానింగ్‌కు వెచ్చించాలి. సౌరశక్తి, సినిమా డైరెక్షన్, ఆర్ట్ తయారీ, కుకింగ్‌ చేసే వారు ఈ రోజు యంత్రాలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలలో సాఫ్ట్‌ రొమాంటిక్ టర్న్‌ ఉంటుంది. కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. ఈ రోజు కూల్‌గా ఉండటానికి మీ హాబీతో కొంత సమయం గడపండి, పుల్లని పదార్థాలు తినాలి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: జంతువులకు ఆహారం అందజేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. ఉత్తమ బ్రాండ్ ఇమేజ్‌ను కొనసాగించడానికి సీనియర్‌లతో నిజాయితీగా, విశ్వసనీయంగా ఉండే టీమ్ లీడ్ పొజిషన్ మీకు అందుతుంది. సమూహాలలో పనిచేసే వారికి ఈ రోజు నాయకత్వ దినోత్సవం. అన్ని విషయాలను హీరోలా గెలుస్తారు. మీ ఫ్రీడమ్‌ను అన్‌ఫెయిర్‌గా ఉపయోగించకుండా జాగ్రత్త వహించండి. మీ సహచరులు,పరిచయస్తులతో జాగ్రత్త వహించండి. మీ రహస్యాలను వారితో పంచుకోవద్దు. స్సెషల్‌ అప్రైజల్‌ కోసం గ్లామర్, మీడియా, ఫారెన్‌ కమొడిటీస్‌, క్రీడలలో ఉన్న స్నేహితులు, బంధువులతో పొలైట్‌, ప్రాక్టికల్‌గా ఉండాలి. పురుషులు గ్రీన్‌, స్త్రీలు బ్లూ కలర్‌ ధరిస్తే మంచిది. దయచేసి ప్రయాణాన్ని నివారించండి. ఈ రోజు సాధారణ ఆహారాన్ని స్వీకరించండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: ఆలయాలకు కొబ్బరి కాయలు అందజేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. మిమ్మల్ని ఇల్లు లేదా కార్యాలయంలోని పెద్దలు అణచివేస్తున్నట్లు భావిస్తారు. ఇది పూర్తిగా తాత్కాలికంగా ఉంటుంది. మీరు సవాళ్లను, అవకాశాలను అంగీకరించాలి. ఈ రోజు మీరు సంపన్నం, ఉత్తమ భాగస్వామిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. తల్లిదండ్రులు పిల్లలను చూసి గర్వపడతారు. మీరు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల సపోర్ట్‌ను కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. బాధ్యతలను నెరవేర్చడానికి, కార్యాలయంలో ప్రదర్శనలు ఇవ్వడానికి సమయాన్ని వెచ్చిస్తారు. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవడానికి మీకు తగినంత అదృష్టం ఉంటుంది. లగ్జరీ వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, బట్టలు, వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడం లేదా చిన్న ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. ప్రమోషన్లు లేదా కొత్త వర్క్ ఆఫర్ కోసం వైద్యులు దరఖాస్తు చేసుకోవాలి. భాగస్వాముల్లో ఎవరో ఒకరి ఆధిపత్యం కారణంగా రొమాంటిక్‌ రిలేషన్‌ దెబ్బతింటుంది.

మాస్టర్‌ కలర్‌: బీజ్‌

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: పేదలకు గోధుమ దానం చేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఎల్లప్పుడూ బ్యాగ్‌లో రాగి లేదా వెండి నాణేన్ని ఉంచండి. ఒక రోజుపాటు డబ్బు లావాదేవీలను నివారించండి. అయితే ముందుగా పత్రాలను ప్రాసెస్ చేయవచ్చు. హెల్త్‌ చెకప్‌ సూచనలు పాటించాలి. ఈ రోజు త్యాగాలు, పరిస్థితులతో రాజీలను కోరుతుంది. ఆపోజిట్‌ జెండర్‌ సూచనలను అంగీకరించడం మేలు. న్యాయవాది సలహా తీసుకోవడం డబ్బును సరైన మార్గంలో ఆదా చేయడంలో సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. మ్యారేజ్‌ ప్రపోజల్స్‌పరిశీలించడం మంచిది. శివాలయాన్ని సందర్శించడం, పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: ఆలయానికి పసుపు వస్త్రం దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. బిజినెస్‌ మాడిఫై చేయడానికి ఈరోజు డబ్బు శక్తిని ఉపయోగించండి. చట్టపరమైన కేసులు శక్తివంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపార ఒప్పందాలను ఛేదించడానికి నేడు నెట్‌వర్కింగ్ కీలకం. మీ భాగస్వామిని మీ డబ్బు నేపథ్యంతో ఆకట్టుకుంటారు. విదేశాలకు ప్రయత్నించే విద్యార్థులు తప్పనిసరిగా ఈ రోజు అధిక ఫీజులు చెల్లించాలి, ఎందుకంటే ఇది వారి కలలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుంది. మీరు జ్ఞానంతో నిర్ణయాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. క్రీడాకారులు తమ శ్రమతో ఆకాశం అంత ఎత్తు ఎదుగుతారు. ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేయాలి. దానధర్మం నేడు తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: స్థానికులకు పాదరక్షలు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. అంగారక గ్రహం స్వచ్ఛమైన శక్తిని పొందడానికి ఆరెంజ్‌ లేదా రెడ్‌ కలర్‌ దుస్తులు ధరించాలి. పిల్లల భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒక అందమైన రోజు. ప్రభుత్వ టెండర్లు, ఒప్పందాలు సజావుగా పూర్తవుతాయి. గ్లామర్, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యారంగంలో ఉన్న వ్యక్తులు ప్రజాదరణ పొందుతారు. భవిష్యత్ రాజకీయ నాయకులు ఈ రోజు కొన్ని కొత్త స్థానాలను పొందుతారు. పబ్లిక్ స్పీచ్, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు ఈ రోజును తప్పక ఉపయోగించాలి. సంగీత విద్వాంసుల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు. వైద్యులు, సర్జన్లు బహుమతులు అందుకుంటారు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, రెడ్‌

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: ఎర్ర కందిపప్పును దానం చేయాలి

ఆగస్టు 1వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : మీనా కుమారి, సునీల్ ఛెత్రి, తాప్సీ పన్ను, కృష్ణ, గురిందర్ సింగ్, ఢిల్లీ గణేష్

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు