హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (జులై 16) న్యూమరాలజీ : అందమైన అనుభూతిని ఆనందిస్తారు..

Numerology: (జులై 16) న్యూమరాలజీ : అందమైన అనుభూతిని ఆనందిస్తారు..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం జులై 16వ తేదీ శనివారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 16వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీకు నమ్మకమైన వ్యక్తితో భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోండి, లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫైనాన్స్ విషయంలో శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఖాతాలను తెరవండి, స్టేట్‌మెంట్‌లను పునఃపరిశీలించండి. కన్వర్జేషన్‌లు, హీలింగ్‌ సెషన్స్‌, ప్రభుత్వ ఒప్పందాలపై సంతకం చేయడం, స్పాన్సర్ ఈవెంట్‌లలో చొరవ తీసుకోవడంలో ఈ రోజు గడపాలి. టోర్నమెంట్‌లను ఆడండి. మీ బలమైన నేపథ్యం ద్వారా చట్టపరమైన లేదా అధికారిక సమస్యలను పరిష్కరించడానికి మీరు స్నేహితులు లేదా బంధువులకు సపోర్ట్‌ చేయాలి. దయచేసి ఆకర్షణను పెంచుకోవడానికి తోలు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి.

మాస్టర్‌ కలర్‌: బీజ్‌

లక్కీ డే: ఆదివారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: ఆశ్రమాలకు గోధుమలు దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. మీ సహాయ వైఖరి మీకు ఇబ్బందిని కలిగిస్తుంది, కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వ్యక్తిగత సమస్యలను విస్మరించి, వృద్ధి వేగాన్ని పెంచుకోవడానికి కెరీర్‌ మార్గంలో దృష్టి కేంద్రీకరించాలి. మీ డ్రీమ్‌ ఎమోషన్స్‌ వాస్తవంగా మార్చుకోవడానికి కష్టమైన రోజు కాబట్టి వేచి ఉండటమే ఉత్తమం. వ్యాపార బాధ్యతల్లో ఈరోజు సరైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చిన్న కంపెనీతో భాగస్వామ్యం చేసుకునే సమయం. భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం మానుకోండి. రాజకీయ నాయకులు పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ, క్రీమ్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2, 6

దానాలు: ఆశ్రమాలకు, పేదలకు చక్కెర దానం చేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. మీ పూర్వీకులు, ఉపాధ్యాయులు, గురువులు, పెద్దలు, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు ఎంచుకున్న రంగంలో ఒక ఐకాన్ లాగా విజయం సాధిస్తారు. ఈ రోజు వేదికపై మీ ప్రెజన్స్‌ మనోహరంగా ఉంటుంది. రంగస్థల కళాకారులు తప్పనిసరిగా కార్యాలయంలో కొత్త ప్రారంభం కావాలి. మీ మార్గంలో కొత్త రిలేషన్‌ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, న్యాయవాదులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సంగీతకారులు, డిజైనర్లు, విద్యార్థులు, న్యూస్ యాంకర్లు, రాజకీయ నాయకులు, నటులు, ఆర్టిస్ట్, గృహిణులు, హోటళ్ల వ్యాపారి, రచయితలు కెరీర్ వృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 1

దానాలు: ఆశ్రమాలకు బుక్స్‌, స్టేషనరీ ఐటమ్స్‌ అందజేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. ప్రాక్టికల్‌గా ఉండండి. ముందుకు సాగడానికి గతాన్ని మరచిపోండి. ఉద్యోగులు పాత, కొత్త అసైన్‌మెంట్‌లతో ఓవర్‌లోడ్‌గా భావిస్తారు. ఆకుపచ్చ, పుల్లని పదార్థాలు తినడంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. నిర్మాణం, యంత్రాలు, లోహాలు, సాఫ్ట్‌వేర్, బ్రోకర్లు వంటి వ్యాపారులు ఈరోజు ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి. అద్భుతమైన వృత్తి జీవితం, గర్వించదగిన తల్లిదండ్రులు అనే అందమైన అనుభూతిని ఆనందిస్తారు.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: పేదలకు ఆయిల్‌ దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. దూకుడును నియంత్రించండి లేకపోతే మీరు మీ స్నేహితుడిని హర్ట్‌ చేసే అవకాశం ఉంది. మీరు అన్ని అవకాశాలు, వనరులను పూర్తిగా ఉపయోగించాలి. మీ గత పనితీరుకు గుర్తింపు లభిస్తుంది, రివార్డ్‌లు అందుతాయి. ఆస్తి లేదా స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల మైన రోజు. డబ్బు ప్రయోజనాలు త్వరలో అందుతాయి. క్రీడాకారులు, యాత్రికులు ఉత్తమ ఫలితం అందుకుంటారు. సమావేశాల్లో అదృష్టాన్ని పెంచుకోవడానికి ఆకుపచ్చ రంగును ధరించండి. శిక్షణ, ప్రయాణం, ఆహారం, క్రీడలు, గ్లామర్ పరిశ్రమకు చెందిన వాళ్లు అన్ని అంశాల్లో ఆనందం పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: పేదలకు తెల్లని పిండి దానం చేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. రిలేషన్‌షిప్‌ బిల్డింగ్‌లో పోరాటం ఉంది. రొమాంటిక్‌ ఫీలింగ్స్‌, ప్రామిసెస్‌ ఈ రోజు మీ మనస్సును శాసిస్తాయి. అయితే మోసం, అపనమ్మకంపై జాగ్రత్త వహించాలి. వ్యాపారం, ఉద్యోగ వృద్ధి అందంగా ఉంటుంది. కానీ వ్యక్తిగత సమస్యలు ఈరోజు మరింత క్లిష్టంగా ఉంటాయి, కాబట్టి వాదనలకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. మీరు అందరినీ సంతోషపెట్టలేరు కాబట్టి మీ భుజంపై ఎక్కువ బాధ్యతలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. హోటల్ వ్యాపారులు, ట్రావెలర్లు, జ్యువెలర్స్, నటీనటులు, జాకీలు, వైద్యులు నైపుణ్యాలను ప్రదర్శించడానికి వెళ్ళాలి. వారి జీవితానికి అనుకూలమైన భవిష్యత్తు కోసం క్రీడలలో కోచ్‌ల గైడెన్స్‌ తీసుకోండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: పిల్లలకు పాలు దానం చేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. పిల్లలు పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. న్యాయవాదులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, క్రీడాకారుడు, CAలకు ఇది కష్టపడే రోజు. మీ నాయకత్వం, విశ్లేషణాత్మక నైపుణ్యం మీ వ్యక్తిత్వ ఆస్తులు. ఈ రోజు డబ్బు నిర్ణయాలకు సంబంధించిన జ్ఞానం, వివేకాన్ని అన్వయిస్తున్నట్లు అనిపిస్తుంది. దయచేసి ఇమేజ్‌కు హాని కలిగించే వివాదాలను ఎదుర్కోవద్దు. లవ్‌ రిలేషన్‌లో పరస్పర నమ్మకాన్ని కాపాడుకోవాలి. గార్మెంట్స్, థియేటర్, టెక్నాలజీ, గవర్నమెంట్ టెండర్లు, రియల్ ఎస్టేట్, స్కూల్స్, ఇంటీరియర్స్, గ్రెయిన్స్‌లో పని చేసే వారికి ఇది గొప్ప రోజు. మీరు ఇంటి నుంచి పనిని అనుసరించనంత కాలం వ్యాపార సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, బ్లూ

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: పేదలకు, పశువులకు వేరుసెనగ గింజలు అందజేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో పడిపోకుండా ఉండండి. స్వల్పకాలిక లక్ష్యం సాధిస్తారు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలను తిరిగి ప్లాన్‌ చేయాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి సమయం. వ్యాపారంలో లావాదేవీలు భోజనానికి ముందు విజయవంతమవుతాయి. కుటుంబ కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రభుత్వ ఒప్పందాలు లేదా ఇంటర్వ్యూలకు తప్పనిసరిగా హాజరు కావాలి. కుటుంబంతో సమయం గడపడం ఈరోజు తప్పనిసరి. దయచేసి లాంగ్ డ్రైవ్‌లను నివారించండి. లవ్‌ రిలేషన్‌ను స్ట్రాంగ్‌ చేయడానికి మధ్యవర్తిత్వ శక్తిని పెంచండి.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: పేదలకు పాదరక్షలు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మాస్ కమ్యూనికేషన్ చేసే వారికి ఇది కష్టమైన రోజు. జనాదరణ అనేది మీ ఉద్యోగం, వ్యక్తిత్వంలో భాగం, కాబట్టి ఆదరణ పెంచుకోవడానికి ప్రజల్లోనే ఉండండి. మీడియా, క్రీడ, నిర్మాణం, వైద్యం, రాజకీయాలు, గ్లామర్ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కొత్త శిఖరాలను చూస్తారు. విద్య, క్రియేటివ్‌ ఆర్ట్‌లో ప్రతిభ చూపిన వారికి విజయాలు, డబ్బు దక్కుతాయి. వ్యాపారం లేదా ఉద్యోగాన్ని మెరుగుపరచడానికి కుటుంబ కనెక్షన్‌లను సంప్రదించడానికి ఒక అందమైన రోజు వేచి ఉంది. ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజు ప్రారంభించండి.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9, 6

దానాలు: ఇంట్లో పనిచేసే మహిళకు రెడ్‌ శారీ అందజేయాలి

జులై 16వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : ఆమ్నా షరీఫ్, ధన్‌రాజ్ పిళ్లై, పవన్ కుమార్ బన్సల్, పారిస్ లక్ష్మి, అరుణా అసఫ్ అలీ

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు