హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (జులై 11) న్యూమరాలజీ : సంపద, అదృష్టం రెండూ ఈ రోజు వర్షిస్తాయి..

Numerology: (జులై 11) న్యూమరాలజీ : సంపద, అదృష్టం రెండూ ఈ రోజు వర్షిస్తాయి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం జులై 11 సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 11 సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1: (నెలలో 1, 10, 19, 28వ తేదీల్లో పుట్టిన వారు) కొత్త స్నేహితుడితో కొత్త పర్సనల్ లైఫ్ ప్రారంభం కావచ్చు. అగ్రిమెంట్ కుదుర్చుకోవడం, మెంటార్ మార్గదర్శకత్వం తీసుకోవడం, భాగస్వామ్యాన్ని నిర్మించడం, కొత్త రిలేషన్స్ ఏర్పరచుకోవడం లేదా ఇంటర్వ్యూకు సిద్ధపడడం వంటివన్నీ మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ రోజు మీరు ఒక టీమ్‌గా పని చేయడానికి మరింత నేర్చుకోవాలి. విజయం సాధించడానికి ఆఫీసులో మీ సీనియర్లు, జూనియర్లతో చేతులు కలపండి. వ్యక్తిగత జీవితంలో ఈ రోజు డిప్లమాటిక్‌గా ఉండాలి. కొత్త పెట్టుబడి కోసం మీ జ్ఞానాన్ని వినియోగించాలి. సూర్య భగవానుని ఆరాధించాలని గుర్తుంచుకోవాలి.

మాస్టర్ కలర్స్: క్రీమ్, స్కై బ్లూ

లక్కీ డే: ఆదివారం

లక్కీ నంబర్‌: 1

విరాళాలు: అరటిపండ్లు దానం చేయండి

#Number 2 : (నెలలో 2, 11వ, 20, 29వ తేదీలలో జన్మించినవారు) మీ అనంతమైన శక్తి మిమ్మల్ని అందరికీ ఇష్టమైనదిగా చేస్తుంది. సంగీతంతో ప్రారంభించి, భాగస్వామితో షాపింగ్‌ను ఆస్వాదించడానికి ఇది ఒక అందమైన రోజు. కాంట్రాక్ట్ లేదా టెండర్లతో డీల్ చేయడానికి ఇది ఉత్తమమైన రోజు. ఆఫీస్‌లో ప్రత్యర్థులను ఓడించడానికి డిప్లమాటిక్ కన్వర్జేషన్ అవసరం. ప్రియమైనవారితో ఎమోషనల్ టైమ్ గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. ఈ రోజు మీ కలలు వాస్తవంగా మారడం అవాస్తవంగా అనిపిస్తోంది కాబట్టి, ఓపిక పట్టండి. తెల్లని దుస్తులు ధరించడంతో పాటు శివునికి, చంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

మాస్టర్ కలర్స్: తెలుపు

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

విరాళాలు: పేదలకు తెల్లటి స్వీట్లను దానం చేయండి

#Number 3 : (నెలలో 3, 12, 22, 30వ తేదీలలో జన్మించినవారు) పాత ఆస్తిని అధిక ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న రోజు ఇది. చట్టపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రోజు మౌఖిక లేదా రాతపూర్వక సంభాషణ ద్వారా సెల్ప్ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండండి. ఆనందాన్ని మరచిపోయి, రోజును ఉత్తమంగా గడపడానికి మీ హృదయంతో మాట్లాడండి. మీ స్నేహితులను కలుసుకోవడానికి, ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు. మీరు డ్యాన్స్, వంట, డిజైనింగ్, యాక్టింగ్, టీచింగ్ లేదా ఆడిటింగ్‌లో ఉంటే ప్రతిభను ప్రదర్శించే సమయం. ఫైనాన్స్, ప్రభుత్వ పరీక్షలతో డీల్ చేసే విద్యార్థులు ఈరోజు మంచి మార్కులను ఆస్వాదించవచ్చు.

మాస్టర్ కలర్స్: పీచ్

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 9

విరాళాలు: గుడికి పచ్చి అరటిపళ్లు అందజేయండి.

#Number 4: (నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు) దూకుడును కంట్రోల్ చేసుకోండి. జీవితంలో ముందుకు సాగడానికి గతాన్ని మర్చిపోండి. ఈరోజు బిజినెస్ ప్లాన్లతో నిండి ఉంటుంది. క్లయింట్లు లేదా కస్టమర్‌ల సమావేశాలు అద్భుతంగా ఉంటాయి, ప్రశంసలు లభిస్తాయి. ఎక్కువ సమయం కౌన్సెలింగ్‌కే వెచ్చించాలి. ప్రయాణాలు లేదా యంత్రాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ రిలేషన్స్ కూడా సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పచ్చని పరిసరాలు ఉన్న ప్రదేశానికి ప్రయాణం చేయండి.

మాస్టర్ కలర్స్: స్కై బ్లూ

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

విరాళాలు: పేదలకు పచ్చి ధాన్యాలను దానం చేయండి.

#Number 5: (నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించినవారు) వ్యక్తిగత జీవితంలో మానసికంగా ఆలోచించాలి. ప్రసంగంలో మృదుత్వాన్ని కొనసాగించండి లేకపోతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. స్వాతంత్రాన్ని ప్రేమించడం అనేది నైతిక పరిమితులను అధిగమించకుండా చూసుకోండి. మీటింగ్స్‌లో సీ గ్రీన్ ధరించడం లాభదాయకం. ఇంటర్వ్యూలు, ప్రపోజల్స్ కోసం ఆనందంగా బయటకు వెళ్లండి. అలాగే ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి. ప్రయాణ ప్రియులు విదేశీ పర్యటనలను అన్వేషించవచ్చు. ఈరోజు ఆహారం, పానీయాలలో క్రమశిక్షణ తప్పనిసరి.

మాస్టర్ కలర్స్: సీ గ్రీన్

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

విరాళాలు: పేదలకు వైట్ ఖర్చీఫ్ దానం చేయండి

#Number 6 : (నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు) సంపద, అదృష్టం రెండూ ఈ రోజు వర్షిస్తాయి. నేడు కమిట్‌మెంట్స్ పూర్తి చేసే రోజు. పిల్లలు, వృద్ధుల మద్దతును కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. ఉపాధ్యాయులు, గృహిణులు, గ్లామర్, శిక్షణ, ఎగుమతి దిగుమతి, వస్త్రం, రియల్ ఎస్టేట్, లగ్జరీ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో ప్రత్యేక అదృష్టాన్ని ఆస్వాదించండి. నగలు, ఇల్లు, బట్టలు లేదా ఉపకరణాలు కొనుగోలు చేయడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. సాయంత్రం రొమాంటిక్ డేట్ ఆనందంతో నిండిన కలలను తెస్తుంది.

మాస్టర్ కలర్స్: ఆక్వా

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

విరాళాలు: గుడికి పెరుగు దానం చేయండి.

#Number 7 : (నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించినవారు) ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఇంటి నుంచి పని చేయడం మంచిది. ఈరోజు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు వ్యాపారంలో బాధ్యతలను తగ్గిస్తాయి. విజయం కోసం భాగస్వామి లేదా క్లయింట్‌లతో కలిసి రిస్క్ తీసుకోవాలి. లాయర్ల సూచనలను అంగీకరించడానికి ప్రయత్నించండి. మ్యారేజ్ ప్రపోజల్స్ కార్యరూపం దాల్చుతాయి. శివాలయాన్ని సందర్శించడం, అభిషేకం చేయడం.. విజయానికి అవసరమైన నెప్ట్యూన్ గ్రహాన్ని బలపరుస్తుంది.

మాస్టర్ కలర్స్: సీ గ్రీన్

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

విరాళాలు: దయచేసి పేదలకు నూనె దానం చేయండి.

#Number 8 : (నెలలో 8, 17, 25 తేదీలలో జన్మించిన వారు) చుట్టుపక్కల ప్రజలందరి నుంచి శుభాకాంక్షలు, బ్లెస్సింగ్స్ స్వీకరిస్తారు. అనువైన వైఖరిని కలిగి ఉండాలి, ఆకస్మికతను నివారించాలి. ప్రభుత్వ కనెక్షన్‌ల శక్తిని ఉపయోగించండి. మనీ సెటిల్‌మెంట్, డిప్లమాటిక్ అప్రోచ్ ద్వారా చట్టపరమైన కేసులు పరిష్కారమవుతాయి. అయితే వ్యాపార ఒప్పందాలను ఛేదించడానికి ఈ రోజు మీ అంతర దృష్టి సహాయపడుతుంది. మీ భాగస్వామి విజయంతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అనేక లావాదేవీలతో రోజంతా బిజీగా ఉంటారు, అందువల్ల రోజు అధిక మొత్తం సంతృప్తితో ముగుస్తుంది. నేడు పశువులకు దానధర్మం తప్పనిసరి.

మాస్టర్ కలర్: సీ బ్లూ

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 6

విరాళాలు: అవసరమైన వారికి చెప్పులు దానం చేయండి

#Number 9 : (9,18,27 తేదీలలో జన్మించిన వ్యక్తులు) చిన్న సమస్యలను వదిలేయాలి. రోజులో రెండో సగం మీకు అనుకూలంగా మారుతుంది. పాత వివాదాలను పరిష్కరించడానికి పరస్పర విశ్వాసాన్ని పరిగణించాలి. లీడర్‌షిప్ పొజిషన్స్‌లో ఉన్న వ్యక్తులు తమ అనుచరుల నుంచి మరింత విశ్వాసం, నిజాయితీ పొందుతారు. అదృష్టం కారణంగా వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు సజావుగా జరుగుతాయి. రాజకీయాలు, లిక్విడ్‌లు, మందులు, డిజైనింగ్, మీడియా, ఫైనాన్స్ లేదా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోని వ్యక్తులు భారీ వృద్ధిని నమోదుచేస్తారు. ఇబ్బంది పెట్టేవారు మీకు చాలా దూరం వెళతారు. మాట్లాడటానికి, వివాదాలను ముగించడానికి కొందరు వ్యక్తులు ఇష్టపడతారు. స్పోర్ట్స్‌మెన్ తల్లిదండ్రులు తమ పిల్లల గురించి గర్వపడతారు.

మాస్టర్ కలర్: ఆరెంజ్

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

విరాళాలు: ఆలయాలకు ఎర్రటి వస్త్రాన్ని దానం చేయండి.

జూలై 11న జన్మించిన ప్రముఖులు: అమితవ్ గోష్, బెజన్ దౌవాలా, జుంపా లాహిరి, మానవ్ గోహిల్, సురేష్ ప్రభు

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు