హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: (జులై 10) న్యూమరాలజీ : మీ ప్రయత్నాలకు గుర్తింపు దక్కుతుంది..

Numerology: (జులై 10) న్యూమరాలజీ : మీ ప్రయత్నాలకు గుర్తింపు దక్కుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూమరాలజీ ప్రకారం జులై 10 ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 10 ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1: (నెలలో 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు) కెరీర్‌లో కొత్త ప్రారంభం మీకోసం ఎదురుచూస్తోంది. విలాసవంతమైన ప్రయాణం చేస్తూ, సమయానికి గమ్యాన్ని చేరుకునే రోజు ఇది. ఈ రోజు మీరు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదించడం లేదా లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. ఎందుకంటే మీ జ్ఞానం, నెట్‌వర్కింగ్ అద్భుతంగా పని చేస్తుంది. విజయం సాధించాలంటే సూర్య భగవానుడు, గురువు ఆశీస్సులు తీసుకోవాలని గుర్తుంచుకోండి. స్పోర్ట్స్ స్టార్ట్స్ తమ కోచ్‌ల వల్ల విజయంతో ఇంటికి వస్తారు. ఈరోజు ఆటలో ఒక స్పెషల్ లీడర్‌ను కలుస్తారు. ఆడవారు వంటల ద్వారా కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి.

మాస్టర్ కలర్స్: పసుపు, నారింజ

లక్కీ డే: ఆదివారం, గురువారం

లక్కీ నంబర్‌: 3

విరాళాలు: సన్‌ఫ్లవర్ ఆయిల్ దానం చేయండి.

#Number 2: (నెలలో 2వ, 11వ, 20వ, 29వ తేదీలలో జన్మించినవారు) విజయం మీ తోడు ఉంది.. ఆశావాదంతో అసైన్‌మెంట్‌లను తీసుకోండి. వర్క్, పర్సనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ సాధించడానికి నేడు మంచి రోజు. అవకతవకలు ఎదుర్కోవచ్చు. మీ పిల్లలు, బంధువులతో గడపడానికి ఇది గొప్ప రోజు. పెట్టుబడిపై రాబడి ఎక్కువగా కనిపిస్తోంది. ద్రవపదార్థాలు, విద్య, పుస్తకాలు, ఫైనాన్స్‌లు, ఎలక్ట్రానిక్, మందులు, ఎగుమతి దిగుమతులు, సౌరశక్తి, వ్యవసాయం, పెట్రోలు, రసాయనాల వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందే అవకాశం ఉంది.

మాస్టర్ కలర్స్: బ్లూ, ఆరెంజ్

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

విరాళాలు: బిచ్చగాళ్లకు, పశువులకు తాగునీటిని దానం చేయండి.

#Number 3: (నెలలో 3, 12వ, 22, 30వ తేదీలలో జన్మించిన వ్యక్తులు) మీ సృజనాత్మక నైపుణ్యాలను, జ్ఞానాన్ని ప్రదర్శించండి, కీర్తిని పొందేందుకు ఉత్తమ సమయం. విద్యార్థులు, క్రీడాకారులకు ఈ రోజు విజయవంతమైనది. మీ ప్రయత్నాలకు గుర్తింపు దక్కుతుంది. కానీ మీ గురువుకు కృతజ్ఞతలు చెప్పడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు, కానీ మృదువైన, మధురమైన మాటల ద్వారా మాత్రమే ఇది సాధ్యం. పెళ్లి కోసం మీ లవ్ ప్రపోజ్ చేయడానికి అనువైన రోజు. పాత కోచ్ సహాయంతో క్రీడాకారులకు విజయం సొంతమవుతుంది. రాజకీయాల్లో ఉన్నవారు లేదా ప్రభుత్వ అధికారి అయితే.. ఈ రోజు మీరు ప్రత్యేకంగా మాస్ దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పరీక్ష రాసే ముందు, ఇంటర్వ్యూలకు వెళ్లేముందు తప్పనిసరిగా గురు మంత్రాన్ని జపించాలి. బృహస్పతి గ్రహం శక్తిని పెంచడానికి ఆడవారు పసుపు రంగులో భోజనం వండి, మొత్తం కుటుంబానికి వడ్డించాలి.

మాస్టర్ కలర్స్: ఆరెంజ్, రెడ్

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 1

విరాళాలు: గుడికి చందనం విరాళం ఇవ్వండి.

#Number 4: (నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈరోజు అద్భుతమైన ప్రణాళికతో భవిష్యత్తు లక్ష్యాలను, బలాన్ని సెట్ చేసుకోండి. మీ మార్గదర్శకత్వంతో ప్రయోజనం పొందే అనేకమంది వ్యక్తులకు మీరు మార్గనిర్దేశం చేయవచ్చు. రోజు మంచి మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో పర్ఫెక్షన్ సాధిస్తారు. రక్షణ, ప్రాపర్టీ డీలర్లు, హోటళ్ల వ్యాపారులు, తయారీదారులు, టెలికాం వ్యాపారం, ఐటీ ఉద్యోగులు సులభంగా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రోజు పెట్టుబడి పెట్టిన డబ్బుపై రాబడి కోసం వేచి ఉండాలి. ఎక్కువ సమయం ప్లానింగ్‌లోనే వెచ్చించాలి. స్టాక్‌తో వ్యవహరిస్తే, సీనియర్ల సలహాలను జాగ్రత్తగా తీసుకోండి. కూల్‌గా ఉండేందుకు, మీ అభిరుచితో కొంత సమయం గడపడానికి ఆకుపచ్చని రంగులో ఉండే ఆహారం తినడం తప్పనిసరి

మాస్టర్ కలర్స్: బ్రౌన్

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

విరాళాలు: పేదలకు పచ్చి ధాన్యాలను దానం చేయండి

#Number 5: (నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు) గణేశుని ఆశీర్వాదంతో రోజు అనువుగా గడుస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు అన్ని విషయాలు సెట్ అవుతాయి. మీ సహోద్యోగుల పట్ల జాగ్రత్త వహించండి. మీ రహస్యాలను వారితో పంచుకోవద్దు. గ్లామర్, మీడియా, విదేశీ వస్తువులు, క్రీడలలో ఉన్న వ్యక్తులు స్పెషల్ అప్రైజల్ సాధిస్తారు. టీల్ ధరించడం వల్ల మీటింగ్స్‌లో మంచి జరుగుతుంది. దయచేసి ఈరోజు పార్టీలు, నాన్ వెజ్ మానుకోండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. క్రీడల్లో విజయం సాధిస్తారు.

మాస్టర్ కలర్స్: గ్రీన్

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

విరాళాలు: పిల్లలకు పచ్చి ద్రాక్ష దానం చేయండి.

#Number 6 : (నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు) మాస్ మీడియా వ్యాపారం ఈ రోజు గొప్ప అవకాశాలు పొందుతుంది. బెస్ట్ పార్ట్నర్ లభించినందుకు ఈ రోజు మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సంపన్నతను అనుభవించే రోజు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో గర్వపడతారు. కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగుల మద్దతును కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. భాగస్వామితో గడపడానికి, ఆఫీసులో ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి మంచి సమయం. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవచ్చు, అదృష్టం ఉంటుంది. వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడానికి లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. రొమాంటిక్ రిలేషన్స్ సంపన్నంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. యాక్టింగ్, పొలిటికల్ కెరీర్‌లో ఉన్న వారు ఈరోజు ఆఫర్‌ను అంగీకరించాలి, ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఎదుగుదలకు గొప్పదిగా మారుతుంది.

మాస్టర్ కలర్స్: బ్లూ, పీచ్

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

విరాళాలు: అనాథాశ్రమాలకు పాలు దానం చేయండి

#Number 7: (నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈ రోజు ఉత్సాహం, శక్తితో నిండి ఉంటుంది. బిజినెస్ రిలేషన్స్‌లో సోషల్ నెట్‌వర్కింగ్‌ను ప్రత్యేకంగా ఉపయోగించాలి. వైద్య సహాయం చెకప్‌లు వంటివి సాయంత్రం తర్వాత చేయాలి. పెద్దలకు సేవ చేయడం, నిర్ణయాలలో విరామం తీసుకోవడం వంటివి పరిశీలించండి. అపోజిట్ జెండర్ సూచనలను అంగీకరించడాన్ని పరిశీలించండి. లాయర్ సలహా తీసుకోవడం ద్వారా డబ్బును సరైన మార్గంలో ఆదా చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్, రాజకీయాలకు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. మ్యారేజ్‌కు అద్భుతమైన మ్యాచ్ రాబోతోంది. శివాలయాన్ని సందర్శించడం, పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

మాస్టర్ కలర్స్: పసుపు

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

విరాళాలు: దయచేసి పేదలకు లేదా దేవాలయాలకు లోహపు పాత్రను దానం చేయండి.

#Number 8: (నెలలో 8, 17, 25వ తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈ రోజు మీ ఆలోచనలు, చర్యల మధ్య ఘర్షణ ఉంటుంది. స్మూత్ ఎగ్జిట్ కోసం ఈ రోజు జ్ఞానం, డబ్బును ఉపయోగించండి. ప్రభావవంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా చట్టపరమైన కేసులు పరిష్కారమవుతాయి. అయితే వ్యాపార ఒప్పందాల కోసం ఈరోజు నెట్‌వర్కింగ్ కీలకం. మిస్ కమ్యూనికేషన్ కారణంగా మీ భాగస్వామి ఫిర్యాదు చేస్తారు. విద్యార్థులు పోటీలో పాల్గొనే సమయంలో ముదురు రంగులు ధరించడం మానుకోవాలి. అధిక జ్ఞానాన్ని కలిగి ఉన్నందున మీ నిర్ణయాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. స్పోర్ట్స్ స్టార్స్ హార్డ్ వర్క్ ద్వారా విజయం సాధిస్తారు. ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేయాలి. నేడు దానధర్మం తప్పనిసరి.

మాస్టర్ కలర్: గ్రీన్

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 6

విరాళాలు: అవసరమైన వారికి చెప్పులు దానం చేయండి.

#Number 9: (నెలలో 9, 18, 27వ తేదీలలో జన్మించిన వారు) మీరు కళాకారులైతే.. నేడు పెద్ద నిర్ణయాలు తీసుకోవలసిన రోజు. ఇది మీకు అనుకూలంగా మారుతుంది. జంటలు భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒక అందమైన రోజు. ప్రభుత్వ టెండర్లు, ఒప్పందాలు సజావుగా జరుగుతాయి. గ్లామర్, ఎయిర్‌లైన్స్, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యారంగంలో ఉన్న వ్యక్తులు ప్రజాదరణ పొందుతారు. భవిష్యత్తు రాజకీయ నాయకులు ఈ రోజు కొన్ని కొత్త స్థానాలను పొందుతారు. ఈ రోజును బహిరంగ ప్రసంగం, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సంగీత విద్వాంసుల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు. వైద్యులు, సర్జన్లు బహుమతులు అందుకుంటారు. ట్రావెల్ ప్లాన్లు సక్సెస్ అవుతాయి.

మాస్టర్ కలర్: రెడ్

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

విరాళాలు: దానిమ్మపండ్లను ఏ రూపంలోనైనా దానం చేయండి

జూలై 10న జన్మించిన ప్రముఖులు: సునీల్ గవాస్కర్, రాజ్‌నాథ్ సింగ్, పర్వీన్ సుల్తానా, అలోక్ నాథ్, సోఫియా వెర్గారా

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు