Home /News /astrology /

NUMEROLOGY SUDDEN LUCK FOR THESE NUMBERS PLANNED GOALS WILL BE FULFILLED AUGUST 14 GH PJN TA

Numerology: న్యూమరాలజీ.. వీరికి ఆకస్మిక అదృష్టం.. అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology: న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 14వ తేదీ ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 14వ తేదీ ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 :
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. సూర్య భగవానుడి అపారమైన శక్తి, ఆశీర్వాదాలు ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. మీ ఆకర్షణ శక్తి నాయకుడిగా కొనసాగుతుంది, గుడ్డిగా విశ్వసించే అనుచరులను మారుస్తుంది. మీరు వ్యాపార విభాగాన్ని స్థాపించడానికి లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు ఇండిపెండెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వ్యక్తిగతంగా కూడా భావోద్వేగాలు అదృష్టాన్ని, అనుగ్రహాన్ని ఆనందిస్తున్నట్లు అనిపిస్తుంది. మీరు ప్రియమైన వారి నుంచి ప్రశంసలు, ప్రపోజల్స్‌, రివార్డులు లేదా సపోర్ట్‌ అందుకుంటారు. కాబట్టి నవ్వడానికి ఒక అందమైన రోజు. సోలార్ వ్యాపారం, ఆభరణాలు, ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్, మెటల్, ధాన్యాలు, సౌందర్య సాధనాలు, వస్త్రాల వ్యాపారం లాభాలను అందుకుంటుంది.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌, ఎల్లో
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1, 5
దానాలు: ఆలయాలకు సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌ అందజేయాలి

#Number 2 :
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మీ అదృష్టం సరిగా లేనందున కూల్‌గా ఉండటానికి ప్రయత్నించండి, కమ్యూనికేట్ చేయకుండా ఉండండి. పిల్లలు తమ ఆత్మవిశ్వాసాన్ని ఆనందిస్తారు. తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూల సమయం. హై రొమాన్స్‌ రిలేషన్‌ను బలపరుస్తుంది. ముఖ్యమైన సమావేశాలు లేదా ఇంటర్వ్యూలలో సీ గ్రీన్ కలర్‌ వస్త్రాలు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది. భవిష్యత్తులో సహాయం కోసం పాత స్నేహితులతో గడపాలి. న్యాయవాదులు, నటులు ప్రత్యేక విజయాన్ని ఆస్వాదిస్తారు.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2, 6
దానాలు: పేదలకు సాల్ట్‌ దానం చేయాలి

#Number 3 :
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. రోజు ప్రారంభించడానికి ఒక ముక్క బెల్లం తినండి. మీ గుర్తింపు, ప్రమోషన్ రెండూ వృత్తి జీవితంలో కొత్త అభివృద్ధికి హామీ ఇస్తున్నాయి. మీరు కమ్యూనికేట్ చేస్తే ఈ రోజు సంబంధం వికసిస్తుంది, కాబట్టి మౌనంగా ఉండకూడదు. సృజనాత్మక వ్యక్తులు పెట్టుబడి, రాబడి అందుకునే ఉత్తమ సమయం. వెంచర్ తెరవాలనే ఆలోచన ఈ రోజు విజయవంతంగా సాగుతుంది. విద్యావేత్తలు, హోటల్ వ్యాపారులు, సంగీతకారులు, రాజకీయ నాయకులు ప్రమోషన్లు, పబ్లిసిటీ పొందుతారు. వ్యాపారవేత్తలు భోజనం తర్వాత క్లైంట్స్‌ని కలవాలి.

మాస్టర్‌ కలర్‌: బ్రౌన్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: ఆశ్రమాలకు ఎల్లో రైస్‌ దానం చేయాలి

#Number 4 :
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. మీరు మీ రిజర్వ్డ్ స్వభావాన్ని బ్రేక్‌ చేయాలి. భావోద్వేగాలను పంచుకోవడానికి హృదయపూర్వకంగా ఉండాలి. ఆఫీసులో అనుకూలమైన కదలిక సాధ్యమవుతుంది, అది స్థిరంగా, దీర్ఘకాలం కొనసాగుతుంది. మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయండి, అదృష్టం దాని పాత్రను పోషించనివ్వండి. రోజు గందరగోళంగా, లక్ష్యం లేనిదిగా అనిపించినప్పటికీ, సాయంత్రం ఆలస్యంగా ఫలితాలు మీకు అనుకూలంగా మారడం చూడవచ్చు. యువకులు ప్రేమ భావాలను పంచుకోవాలి, స్నేహం లేదా సంబంధాలను దుర్వినియోగం చేయకుండా ఉండాలి. దయచేసి నాన్ వెజ్ లేదా లిక్కర్ మానుకోండి.

మాస్టర్‌ కలర్‌: టేల్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు వెజ్‌, పుల్లని ఆహార పదార్థాలు అందజేయాలి

#Number 5 :
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. ఆఫీస్ టేబుల్‌పై క్రిస్టల్‌ లోటస్‌ ఉంచండి. అదృష్ట చక్రం మీ లక్ష్య సాధన వైపు మళ్లుతోంది. ఈరోజు ఆధిపత్యాన్ని గుర్తుంచుకోండి, ఆకస్మిక అదృష్టం, కెరీర్‌లో మెరుగైన వృద్ధి, రెండింటినీ అనుభవించవచ్చు. సంబంధాలను ఆస్వాదించడానికి, షాపింగ్ చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, స్టాక్‌ను కొనుగోలు చేయడానికి, మ్యాచ్‌లు ఆడటానికి, పోటీని ఎదుర్కోవడానికి అనుకూలమైన ఒక రోజు. మీరు అన్ని సౌకర్యాలతో ఈరోజు చిన్న ప్రయాణానికి వెళతారు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు కావలసినదాన్ని షాపింగ్ చేయండి, అది పెద్దదైనా లేదా చిన్నదైనా సరే, అన్నీ అందంగా మారుతాయి. స్టాక్ లేదా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలి. ప్రమోషన్, అప్రైజల్‌ కోసం ఒక రోజు ఉంది. మీరు ప్రత్యేక స్నేహితుడిని లేదా గైడ్‌ని కూడా కలుస్తారు.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పచ్చని మొక్కలు దానం చేయాలి

#Number 6 :
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది.
రొమాంటిక్‌ ఫీలింగ్స్‌ను రియాలిటీగా మార్చే రోజు, వైవాహిక జీవితం ఈ రోజు జంటల మధ్య మరింత నమ్మకాన్ని, బలమైన బంధాన్ని పొందుతుంది. ఈ రోజు అన్ని లక్ష్యాలు నెరవేరుతాయి. మీరు విజేతగా మీ గుర్తింపును సృష్టిస్తారు. రాజకీయ నాయకులు ఫీల్డ్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. గృహిణులు మీ కుటుంబం ద్వారా గౌరవం, ఆప్యాయత పొందుతారు. ప్రభుత్వ అధికారులు
కొత్త ప్రొఫైల్, ప్రమోషన్ ఆనందిస్తారు. ఆర్టిస్ట్ మాస్‌ని మెప్పించగలడు. ఆస్తి ఒప్పందాలు సులభంగా నెరవేరుతాయి. పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6, 2
దానాలు: ఇంట్లో పనిచేసే వారికి కాస్మటిక్‌ ఐటమ్స్‌ దానం చేయాలి

#Number 7 :
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. అనారోగ్య ప్రభావాలను నియంత్రించడానికి కనీసం రోజుకు ఒక్కసారైనా సోపు గింజలను తినండి. మీ మెచ్యూరిటీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రేమ, ఆప్యాయత మీ మాటలను విని ఆచరిస్తుంది. రోజును ప్రారంభించడానికి పూర్వీకుల ఆశీర్వాదం తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ రోజు పసుపు పప్పులు దానం చేయండి. దిగ్గజాల కంటే చిన్న బ్రాండ్లు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. ఈరోజు మీరు తీసుకున్న ఏ నిర్ణయాలనైనా గుడ్డిగా అనుసరించాలి, ఎందుకంటే మీరు ఈ రోజు మీ తోటివారిని విశ్వసిస్తారు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: కాపర్‌ వెసెల్స్‌ దానం చేయాలి

#Number 8 :
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. మీ శక్తి, ప్రతిభకు అనంతమైన హద్దులు ఉన్నాయి, అది మిమ్మల్ని ఈ రోజు గొప్ప నాయకుడిగా చేస్తుంది. గతంలో మీరు చేసిన కృషి ఈ రోజు ఎలాంటి కష్టాల నుంచి అయినా బయటపడటానికి మీకు సహాయం చేస్తుంది. పశువులకు దానధర్మాలు చేయడానికి ఇది ఒక అందమైన రోజు. దంపతుల మధ్య ప్రేమ సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. వైద్యులు, ఔషధ విక్రేతలు, ఇంజనీర్లు, తయారీదారులు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది ఉత్తమ రోజు. ఒత్తిడి కారణంగా శారీరక దృఢత్వం దెబ్బతింటుంది, కాబట్టి నిద్రకు ముందు యోగా చేయండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పశువులకు తాగునీరు దానం చేయాలి

#Number 9 :
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీ నంబర్ మానవత్వానికి చెందినది, ఇది మరచిపోకూడదు. మీ వస్తువులు, సెల్ఫ్‌ ఇమేజ్‌ని జాగ్రత్తగా చూసుకోవడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎందుకంటే రెండూ ఇప్పటికే తెలిసిన వ్యక్తి వల్ల దెబ్బతినే అవకాశం ఉంది. స్టాక్‌లలో మినహా వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనువైన రోజు. యువకులు తమ భాగస్వాములను ఆకట్టుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సామూహికంగా మాట్లాడటం, ఈవెంట్‌కు హాజరవడం, పార్టీని నిర్వహించడం, ఆభరణాలు షాపింగ్ చేయడం, కౌన్సెలింగ్, క్రీడలు వంటి వాటిని ఆస్వాదించడానికి ఈ రోజు యావరేజ్‌గా ఉంటుంది.

మాస్టర్‌ కలర్‌: బ్రౌన్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9, 6
దానాలు: బాలికకు రెడ్‌ హ్యాండ్‌ కట్ఛీఫ్‌ దానం చేయాలి

ఆగస్టు 14వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
కులదీప్ నాయర్, జానీ లీవర్, దీనా వాడియా, సునిధి చౌహా, మోహిత్ రైనా, ఆజం ఖాన్
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు