Home /News /astrology /

NUMEROLOGY PREDICTIONS ON 29TH MAY 2022 THE PEOPLE WHO BORN ON THESE DAYS SHOULD WORSHIP LORD SHIV PJN GH SK

Numerology Today: మీ పుట్టిన రోజు ఇదే.. ఇవాళ శివార్చన చేస్తే మీకు తిరుగుండదు.. మే29 న్యూమరాలజీ

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology Today: న్యూమరాలజీ ప్రకారం.. మే 29వ తేదీ ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మరి ఇవాళ ఎవరికి ఎలా ఉందో.. నేటి సంఖ్యాశాస్త్ర ఫలాల్లో తెలుసుకుందాం.

Numerology: మే 29 న్యూమరాలజీ. పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 29వ తేదీ ఆదివారం కొందరికి కలిసి వస్తుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్న వారు సాయంత్రం తర్వాత అసైన్‌మెంట్‌లు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొందరు బంధువుల నమ్మకాన్ని పెంచుకోవడానికి అనుకూల సమయం. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

నంబర్‌ 1:
నెలలో 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీ వ్యక్తిత్వానికి, ఈ రోజు జీవితం సాగే విధానానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఈ రోజు విజ్ఞానాన్ని అందించడం, చిన్న పర్యటనలు లేదా ఇంటర్వ్యూలకు సిద్ధపడటం వంటి వాటితో గడుపుతారు. ఈ రోజు సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రతిఫలాలను పొందడం లేదా కంపెనీలో లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఖాతాదారులు, బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి, వారి నమ్మకాన్ని పొందడానికి ఇది మంచి రోజు.

మాస్టర్‌ కలర్‌: బీజ్‌
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1
దానాలు: పసుపు దానం చేయాలి

నంబర్‌ 2:
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీ సున్నితమైన వైఖరిని నియంత్రించుకోండి. ఈరోజు మీ భవిష్యత్తు ప్రణాళికలు వాస్తవంగా మారుతున్నాయి కాబట్టి సిద్ధంగా ఉండండి. మీ మంచి రోజులు త్వరలో రాబోతున్నాయనే వాస్తవాన్ని తెలుసుకుంటూ సంతోషకరమైన సమయాన్ని గడపండి. ఈ రోజు తెల్లటి దుస్తులు ధరించి ఇంటర్వ్యూ లేదా ఆడిషన్‌లకు హాజరైతే మంచిది. ఉత్తమ పనితీరు కోసం సాయంత్రం ఆలస్యంగా అసైన్‌మెంట్‌లను పూర్తి చేయడానికి ప్రయత్నించండి.

మాస్టర్‌ కలర్‌: పీచ్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: పశువులకు, యాచకులకు తాగునీరు అందించాలి

మిమ్మల్ని ధనవంతులు చేసే పసుపు అవాల రెమిడీ.. ఈరోజే ఇంటికి తెచ్చుకోండి..

నంబర్‌ 3:
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. అయోమయం నుంచి బయటపడే మార్గం వెతకండి. సేల్స్‌లో పనిచేసే అబ్బాయిలు తప్పనిసరిగా బయటకు వెళ్లి పని చేయాలి, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి దూరంగా ఉండాలి. మీ కోచ్‌పై విశ్వాసం ఉంచండి, ఉత్తమ ఫలితం కోసం అతనిని అనుసరించండి. అన్ని అనవసరమైన డ్రామాలను మర్చిపోండి. రోజుని ఉత్తమంగా మార్చుకోవడానికి నిజం మాట్లాడండి. ఆర్థిక రంగానికి చెందిన వ్యక్తులు, శాస్త్రవేత్త, రాజకీయవేత్త, రచయితలు, చిత్రకారులు డబ్బు ప్రయోజనాలను పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: ఆలయాలకు కుంకుమ దానం చేయాలి

నంబర్‌ 4:
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. మీ మనస్సును చల్లగా, ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ రోజు ఎక్కువగా కష్టపడతారు, చాలా నీరు తాగాలి. ఈ రోజు మీరు చాలా గందరగోళం నుంచి బయటపడటం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. క్లయింట్ ప్రెజెంటేషన్‌లు అద్భుతమైన ప్రశంసలు అందుకుంటాయి. ఎక్కువ సమయం కౌన్సెలింగ్, మార్కెటింగ్‌లో వెచ్చించాలి. వ్యక్తిగత సంబంధాలు కూడా గందరగోళం లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: టేల్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు పచ్చని ధాన్యాలు దానం చేయాలి

Vastu Shastra: పూజ గదిలో ఇవి ఉంటే ఆ ఇంటికే సమస్య.. ఏవి ఉండకూడదంటే..

నంబర్‌ 5:
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అంచనా వేయడం, విశ్లేషించడం మానేయండి. భావోద్వేగాలు మీ నిర్ణయాలను అధిగమించకుండా చూసుకోండి. ఆక్వా రంగు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరైతే మేలు. భోజనానికి ముందు ఇంటర్వ్యూలు, ప్రతిపాదనల కోసం బయటకు వెళ్లండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి. ప్రయాణ ప్రియులు విదేశాలకు వెళ్లవచ్చు. ఈరోజు ఆహారం, పానీయాలలో క్రమశిక్షణ తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: అనాథలకు పచ్చని పండ్లు దానం చేయాలి

నంబర్‌ 6:
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఈరోజే మీ ప్లాన్‌లను అమలు చేసేందుకు ప్రయత్నించండి. మీరు కుటుంబం, స్నేహితులు, అనుచరులు, సహోద్యోగుల సపోర్ట్‌ కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకొనేందుకు మీకు తగినంత సామర్థ్యం ఉంది. వాహనాలు, ఇల్లు, యంత్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఇంట్లో పని చేసే వారికి చక్కెర దానం చేయాలి

నంబర్‌ 7:
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ, చట్టం, హస్తకళలు, ఎగుమతి దిగుమతులు, విద్య రంగాలలో ఈరోజు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అంశాలలో ప్రత్యేకంగా పెద్దల సలహాను పాటించడం అవసరం. వివాహ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. శివాలయాన్ని సందర్శించడం, అభిషేకం చేయడం ద్వారా రోజు విజయవంతంగా ముగుస్తుంది.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: కాపర్‌ లేదా వెండిని దానం చేయాలి

నంబర్‌ 8:
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. మీ గత జన్మ మంచి కర్మల సాయంతో ఈ రోజు డబ్బు, అధికారం రెండూ మీ చేతికి వస్తాయి. వ్యక్తులను మీ అనుచరులుగా మార్చడానికి మీ ఉదార ​​వైఖరి, బలమైన బ్రాండ్ ఇమేజ్ సరిపోతుంది. వ్యాపార ఒప్పందాలను చేసుకోవడానికి ఈరోజు కమ్యూనికేషన్ కీలకం. కుటుంబ సంబంధాలు సపోర్ట్‌ చేస్తాయి. శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మెటల్ తయారీదారులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కొత్త పెట్టుబడులలో రిస్క్ తీసుకోవచ్చు.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: అవసరంలో ఉన్న వారికి పాదరక్షలు ఇవ్వండి

ఈ రాశిలో శని అర్ధ శతకం మొదటి దశ ప్రారంభమైంది, జాగ్రత్తగా ఉండండి..

నంబర్‌ 9:
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. కొత్త ప్రదేశానికి మారడం లేదా కొత్త ఉద్యోగాన్ని ఎంచుకోవడం, కొత్త సంబంధాలలో నిమగ్నమవ్వడం, భూములు కొనుగోలు చేయడం, ఉన్నత చదువుల కోసం వెళ్లడం వంటి పనులు చేపట్టడానికి అందమైన రోజు. రాజకీయాలు, మీడియా, యాక్టింగ్, స్పోర్ట్స్, ఫైనాన్స్ లేదా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోని వ్యక్తులు భారీ అభివృద్ధిని చూస్తారు. వ్యాపార భాగస్వాములు లేదా టీమ్‌ సభ్యులు సమీప భవిష్యత్తులో మీకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఆలయాలకు కుంకుమ దానం చేయాలి

29వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే. పంకజ్ కపూర్, గులాబ్ సింగ్ ఠాకూర్, అజాజ్ ఖాన్, T.H వైట్, అనుప్రియ గోయెంకా.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Future Prediction, Numerology

తదుపరి వార్తలు