Home /News /astrology /

NUMEROLOGY PREDICTIONS IN 24MAY 2022 THE PEOPLE WHO HAVE THIS RADIX NUMBER SHOULD DONATE CLOTHE TO ORPHANAGES PJN GH SK

Numerology Today: అనాథాశ్రమాలకు దుస్తులు దానం చేస్తే.. వీరికి తిరుగుండదు.. మే 24 న్యూమరాలజీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Numerology Today: న్యూమరాలజీ ప్రకారం మే 24వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. అనుకున్న పనులు జరుగుతాయి. మరికొందరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. నేడు ఎవరికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology: మే 24 న్యూమరాలజీ. పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 24వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్నవారు ఓ వ్యక్తి సాయంతో చట్టపరమైన, అధికారిక సమస్యల నుంచి బయటపడతారు. మరికొందరు ఆఫీసులో సీనియర్‌లతో వాదనలు పెట్టుకోకపోవడం మంచిది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి.. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

నంబర్‌ 1:
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీరు ఈ రోజు మీ వ్యక్తిత్వం, జీవిత మార్గం మధ్య తిరుగుతారు, కాబట్టి మీ ప్రణాళికలకు వ్యతిరేకంగా జీవితాన్ని గడుపుతారు. బలమైన నేపథ్యం ద్వారా చట్టపరమైన లేదా అధికారిక సమస్యల నుంచి బయటపడేసేందుకు మీకు సహాయపడే వ్యక్తిని కలుసుకుంటారు. నటీనటులు కొత్త ఆఫర్‌లను తిరస్కరించాలి, లేకుంటే మోసపోతారు. దయచేసి ఆకర్షణను పెంచడానికి లెదర్ ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా ఉండండి. సూర్యభగవానుడి ఆశీర్వాదం తీసుకోండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ, ఎల్లో
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 3
దానాలు: ఆశ్రమాలకు కుంకుమ పువ్వు మిఠాయిలు అందజేయాలి

నంబర్‌ 2:
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. పరిశ్రమలో మీ బ్రాండ్, నిజాయతీకి ఉన్న పేరుతో న్యాయపరమైన దావాలు గెలుస్తారు. ఈ రోజు జీవితంలో సంతృప్తిని తీసుకురావడానికి కుటుంబంలో బాధ్యత వహించాలి. వ్యాపారపరమైన హామీలు సజావుగా నెరవేరుతాయి. పెద్ద కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకునే సమయం. వాదనలు మానుకోండి. రాజకీయ నాయకులు, చిల్లర వ్యాపారులు, విద్యావేత్తలు, వైద్యులు, నగల వ్యాపారులు పత్రాలపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2, 6
దానాలు: ఆలయాలకు, స్థానికులకు వెండి నాణేలు దానం చేయాలి

Zodiac Signs: ఈ 6 రాశులవారితో తేడా వస్తే ఇక అంతే సంగతులు... భాగస్వాములూ జర జాగ్రత్త..

నంబర్‌ 3:
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడానికి ఇది మంచి రోజు. ఈ రోజు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది, ఆనందించండి, విశ్రాంతి తీసుకోండి. మీ మార్గంలో కొత్త రిలేషన్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది కానీ ప్రస్తుత సమయం సహనం, సానుకూలతను కోరుతుందని గుర్తుంచుకోండి. సంగీతకారులు, డిజైనర్లు, విద్యార్థులు, న్యూస్ యాంకర్లు, రాజకీయ నాయకులు, నటులు, ఆర్టిస్ట్, గృహిణులు, హోటల్ వ్యాపారులు, రచయితలు వ్యక్తిగత జీవితంలో ప్రత్యేక విషయాలను ప్రకటించే అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: అవసరంలో ఉన్న వారికి పసుపు దానం చేయాలి

నంబర్‌ 4:
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. పూర్తి హృదయంతో కొత్త అవకాశాన్ని స్వాగతించేందుకు సిద్ధం అవ్వాలి. దుప్పట్లు దానం చేయడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి. నిర్మాణం, యంత్రాలు, లోహాలు, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారు, బ్రోకర్లు ఈరోజు ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి. అద్భుతమైన ఆధ్యాత్మికత ఈ రోజు మీ జీవితాన్ని నింపుతుంది, గర్వించదగిన తల్లిదండ్రులు అనే అందమైన అనుభూతిని కూడా అందిస్తుంది. రోజు చివరిలో విజయాన్ని అందజేస్తుంది. క్రీడాకారులు సవాలును స్వీకరించాలి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: అనాథాశ్రమాలకు వస్త్రాలు దానం చేయాలి

నంబర్‌ 5:
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. కుటుంబం, స్నేహితులు, బాస్, సహోద్యోగులు, ఆక్వాటైన్‌ల సపోర్ట్‌ లభిస్తుంది. రోజు గడిచేకొద్దీ మీరు గందరగోళానికి గురవుతారు, కాబట్టి ఆస్తి పెట్టుబడిపై ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సమావేశాలలో అదృష్టాన్ని పెంచుకోవడానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించండి.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పనిచేసేవారికి పచ్చని విత్తనాలు దానం చేయాలి

Astrology: దేవగురు అనుగ్రహం.. ఈ రాశుల వారు ఎంతో లక్కీ.. రాబోయే 7 నెలలు గోల్డెన్ టైమ్

నంబర్‌ 6:
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. న్యాయం కోసం మీ నిరీక్షణ త్వరలో ముగుస్తుంది. మీరే తప్ప మరేదీ మీకు శాంతిని కలిగించదని గుర్తుంచుకోండి. జ్యువెలర్స్, నటీనటులు, జాకీలు, వైద్యులు నైపుణ్యాలను ప్రదర్శించడానికి వెళతారు. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రులు మార్గనిర్దేశం చేయవచ్చు, అది వారి జీవితానికి అనుకూలంగా ఉంటుంది.

మాస్టర్‌ కలర్‌: బ్లూ, సీ గ్రీన్‌
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆశ్రమాలకు స్టీల్‌ వెస్సెల్‌ దానం చేయాలి

నంబర్‌ 7:
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. మీ గతం నుండి విరామం తీసుకోండి, ప్రతీకార భావాన్ని మరచిపోవడం నేర్చుకోండి. నొప్పి కారణాన్ని తొలగించడం ఇప్పుడు అవసరం. దయచేసి పని ప్రదేశంలో బాస్ లేదా పెద్దలతో వాదనలు పెట్టుకోకండి. వైద్యం, ఆధ్యాత్మిక పాఠశాలలు, వ్యవసాయం, ధాన్యాలలో పనిచేసే వారికి ఇది గొప్ప రోజు. మీరు ఎమోషనల్‌గా ఉండనంత కాలం వ్యాపార సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: కుంకుమ పువ్వు పాలు ఆలయాలకు దానం చేయాలి

నంబర్‌ 8:
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. మీ మొండితనాన్ని పక్కన పెట్టండి, వ్యాపారంలో ముందుకు సాగండి, ఎందుకంటే మార్గంలో చాలా అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమ తగ్గుతుంది. మీతో ఒక సీనియర్ గైడ్‌గా పనిచేస్తున్నారు, తప్పనిసరిగా అతనిని అనుసరించాలి. భోజనానికి ముందు వ్యాపారంలో లావాదేవీలు విజయవంతమవుతాయి. కుటుంబం తో గడపడం ఈరోజు తప్పనిసరి. ఈరోజు ప్రయాణాలు మానుకోండి.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పశువులకు పచ్చని ధాన్యాలు పెట్టాలి.

Vastu Tips For Money: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ 5 మొక్కలను పెంచకండి..ఇలా చేస్తే డబ్బే డబ్బు

నంబర్‌ 9:
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీరు వెన్నుపోటుతో బాధపడే పరిస్థితి ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. టీచింగ్, లా, కౌన్సెలింగ్, ఫైనాన్స్ రంగాల వారు కొత్త అవకాశాలను అందుకుంటారు. కళాకారులకు ఈ రోజు ఆశలు చిగురిస్తాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అధికారాన్ని పొందడానికి పాత స్నేహితులు లేదా సహచరులను సంప్రదించడానికి ఒక అందమైన రోజు. ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజును ప్రారంభించండి.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9, 6
దానాలు: మహిళలకు ఆరెంజ్‌ కలర్‌ వస్త్రాలు దానం చేయాలి

మే 24వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
రాజేష్ రోషన్, అనితా ఫాడియా, ఆర్య బబ్బర్, శిరీష్ కుదర్, రాజ్‌దీప్ సర్దేశాయి, కాజీ నజ్రుల్ ఇస్లాం.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Future Prediction, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు