Home /News /astrology /

NUMEROLOGY PREDICTIONS 14TH MAY 2022 THE PEOPLE WHO BORN ON THESE DATES WILL GET LUCK TODAY PJN GH SK

Numerology Today: మీ పుట్టిన రోజు ఇదేనా? ఈ రోజు మీ అదృష్టం మామూలుగా ఉండదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Astrology Today: న్యూమరాలజీ ప్రకారం వివిధ తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని నంబర్ల ప్రభావం ఉంటుంది. మే 14వ తేదీ శనివారం నాడు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నేటి సంఖ్యాశాస్త్ర ఫలాల్లో తెలుసుకుందాం.

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం:. +91 90526 47890)

Numerology: మే 14 న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్రం ప్రకారం..  వివిధ తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని నంబర్ల ప్రభావం ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మే 14వ తేదీ శనివారం నాడు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

నంబర్ 1: నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీరు ఒక నాయకుడిగా ఉంటారు. మీ అనుచరులు వ్యాపార నిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మీ హృదయం చెప్పేది వినండి, ముందుకు సాగండి. మీరు వ్యాపారాన్ని స్థాపించడానికి లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు నమ్మకంతో, స్వతంత్రంగా ఉంటారు. వ్యక్తిగతంగా కూడా భావోద్వేగాలతో అదృష్టాన్ని, అనుగ్రహాన్ని పొందగలరు. ప్రియమైన వారి నుంచి ప్రశంసలు, ప్రతిపాదనలు, రివార్డులు లేదా మద్దతు అందుకుంటారు. కాబట్టి మీకు నేడు చిరునవ్వుతో కూడిన అందమైన రోజు. సోలార్ వ్యాపారం, ఆభరణాలు, ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్, మెటల్, ధాన్యాలు, సౌందర్య సాధనాలు, బట్టల వ్యాపారంలో ఉన్నవారు లాభాలను అందుకుంటారు.

మాస్టర్ కలర్: గ్రీన్, యెల్లో
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1, 5
విరాళాలు: గుడికి పొద్దుతిరుగుడు విత్తనాలను దానం చేయండి

నంబర్ 2: నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. మగవారు మహిళా వ్యాపార భాగస్వాముల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా ఈరోజు మోసం లేదా దొంగతనాలకు దూరంగా ఉండాలి. పిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అయితే వారి ఫలితాలకు ఇంకా ఆలస్యం ఉంటుంది. ఎక్కువ రొమాంటిక్ ఫీలింగ్ జంటల సంబంధాన్ని బలపరుస్తుంది. ముఖ్యమైన సమావేశాలు లేదా ఇంటర్వ్యూలలో సీ గ్రీన్ కలర్ ధరించడం వల్ల అదృష్టం లభిస్తుంది. భవిష్యత్తులో సహాయం కోసం పాత స్నేహితులతో సమయం గడపండి. న్యాయవాదులు, నటులు విజయాన్ని ఆస్వాదిస్తారు.

మాస్టర్ కలర్‌: సీ గ్రీన్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2, 6
విరాళాలు: పేదలకు ఉప్పు దానం చేయండి

నంబర్ 3: నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. మీ సోషల్ గ్రూప్, రిలేటివ్స్ సర్కిల్‌లో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. మీరు కమ్యూనికేట్ చేయకపోతే ఈ రోజు రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది, కాబట్టి మౌనంగా ఉండకూడదు. సృజనాత్మక వ్యక్తులు పెట్టుబడి, రాబడి కోసం బెస్ట్ టైమ్‌ పొందుతారు. వెంచర్ ఓపెన్ చేయాలనే ఆలోచన ఈరోజు విజయవంతంగా సాగుతుంది. విద్యావేత్తలు, హోటల్ వ్యాపారులు, మ్యుజిషియన్స్, రాజకీయ నాయకులు.. ప్రమోషన్లు, ప్రచారంతో సంతృప్తి చెందుతారు. వ్యాపారవేత్తలు భోజనం తర్వాత ఖాతాదారులను కలవడం మంచిది.

మాస్టర్ కలర్‌: బ్రౌన్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
విరాళాలు: ఆశ్రమాలకు పసుపు బియ్యం దానం చేయండి

మరికొద్దిరోజుల్లోనే హనుమాన్ జయంతి.. ఈ 4 రాశుల వారిపై ఆంజనేయుడి ప్రత్యేక అనుగ్రహం

నంబర్ 4: నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. మీకు నేడు అదృష్టం కలుగుతుంది. తద్వారా స్థిరంగా, దీర్ఘకాలం ఉండేలా ప్లాన్‌లను అమలు చేయడానికి మంచి రోజు. మార్కెటింగ్ వ్యూహాలను కొనసాగిస్తూ అదృష్టం పాత్రను పోషించనివ్వండి. ఈ రోజు గందరగోళంగా, లక్ష్యం లేనిదిగా అనిపించినప్పటికీ, సాయంత్రం వరకు ఆలస్యంగా ఫలితాలు మీకు అనుకూలంగా మారడం చూడవచ్చు. ప్రేమ భావాలను పంచుకోవడానికి, స్నేహం లేదా సంబంధాలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు యువకులు ప్రయత్నించాలి. నాన్ వెజ్ లేదా లిక్కర్ మానుకోండి.

మాస్టర్ కలర్‌: టీల్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
విరాళాలు: పేదలకు సిట్రస్ వెజ్ ఫుడ్ దానం చేయండి

నంబర్ 5: నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. ఈ రోజు కోపం, ఆధిపత్యాన్ని నియంత్రించుకోండి. ఆకస్మిక అదృష్టం, కెరీర్‌లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. రిలేషన్‌షిప్స్ ఆస్వాదించడానికి, షాపింగ్ చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, స్టాక్‌ కొనుగోలు చేయడానికి, మ్యాచ్‌లు ఆడటానికి, పోటీ ఎదుర్కోవడానికి నేడు ఒక మంచి రోజు. అన్ని సౌకర్యాలతో ఈరోజు చిన్న ప్రయాణానికి వెళతారు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీకు కావలసినదాని కోసం షాపింగ్ చేయండి, అది పెద్దదైనా లేదా చిన్నదైనా సరే, అన్నీ అందంగా ఉంటాయి. స్టాక్ లేదా ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలి. ప్రమోషన్, అప్రైజల్ లభించవచ్చు. మీరు స్పెషల్ ఫ్రెండ్‌ను లేదా గైడ్‌ను కూడా కలుస్తారు.

మాస్టర్ కలర్‌: సీ గ్రీన్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
విరాళాలు: ఆకుపచ్చ మొక్కలను దానం చేయండి

నంబర్ 6: నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మీరు వాటిని ఆనందిస్తారు. ఈ రోజు అన్ని లక్ష్యాలను చేధిస్తారు. విజేతగా గుర్తింపును సృష్టిస్తారు. రాజకీయ నాయకులు గోల్స్ కొట్టడానికి, ఫీల్డ్‌లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. గృహిణులు కుటుంబం ద్వారా గౌరవం, ఆప్యాయత పొందుతారు. ప్రభుత్వ అధికారులకు మంచి రోజు. ఆర్టిస్ట్ మాస్‌ని మెప్పించగలరు. ఆస్తి ఒప్పందాలు సులభంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి.

మాస్టర్ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6, 2
విరాళాలు: పిల్లలకు బ్లూ పెన్సిల్స్ లేదా పెన్ను దానం చేయండి

Zodiac Signs : ఈ రాశుల అమ్మాయిలు ఎక్కువ కాలం రిలేషన్ లో ఉండలేరు...!

నంబర్ 7: నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలలో పురుషులకు స్త్రీలు, స్త్రీకు పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. మీ చుట్టూ ఉన్న ప్రేమ, ఆప్యాయత.. ఈ రోజు మీ కలలన్నింటినీ నెరవేరుస్తుంది. ఈ రోజును ప్రారంభించడానికి పూర్వీకుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు పసుపు రంగు పప్పులను దానం చేయండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా గుడ్డిగా అనుసరించాలి.

మాస్టర్ కలర్‌: ఆరెంజ్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
విరాళాలు: రాగి పాత్ర దానం చేయండి

నంబర్ 8: నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, గతంలో చేసిన కృషి ఈ రోజు ఎలాంటి కష్టం నుంచి అయినా బయట పడేస్తుంది. పశువులకు దానధర్మాలు చేయడానికి ఇది ఒక మంచి రోజు. దంపతుల మధ్య ప్రేమ, సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. వైద్యులు, ఔషధ విక్రేతలు, ఇంజనీర్లు, తయారీదారులు మానిటరీ బెనిఫిట్స్ పొందుతారు. యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. ఒత్తిడి కారణంగా శారీరక దృఢత్వం దెబ్బతింటుంది, కాబట్టి నిద్రకు ముందు యోగా చేయండి.

మాస్టర్ కలర్‌: బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6

నంబర్ 9: నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. దాతృత్వం ఇంట్లోనే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోండి. స్టాక్‌లలో మినహా వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి అనువైన రోజు. అలాగే యువకులు తమ భాగస్వాములను ఆకట్టుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సామూహికంగా మాట్లాడటం, ఈవెంట్‌కు హాజరవడం, పార్టీ నిర్వహించడం, ఆభరణాలు షాపింగ్ చేయడం, కౌన్సెలింగ్ లేదా క్రీడలు ఆడటం వంటి వాటిని ఆస్వాదించడానికి నేడు మంచి రోజు.

మాస్టర్ కలర్‌: బ్రౌన్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9, 6
విరాళాలు: బాలికలకు రెడ్ ఖర్చీఫ్ దానం చేయండి

Tulasi Puja: తులసిని నిత్యం ఇలా పూజించండి.. మీ కోరికలన్నీ నెరవేరి.. కష్టాల నుంచి విముక్తి

మే 14న జన్మించిన ప్రముఖులు: మానుషి చిల్లర్, ప్రణవ్ మిస్త్రీ, శంభాజీ, వహీదా రెహ్మాన్, బాబ్ వూల్మర్.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Future Prediction, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు