Home /News /astrology /

NUMEROLOGY MONEY WILL COME TOGETHER SUDDENLY GOOD TIME TO INVESTMENT AUGUST 13 GH PJN TA

Numerology: న్యూమరాలజీ.. ఆకస్మికంగా డబ్బు కలిసి వస్తుంది.. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల సమయం..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology : న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 13వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 13వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 :
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. భవిష్యత్తు వృద్ధి అనుకూలంగా ఉన్నందున వ్యాపారం కోసం ఆస్తులు లేదా క్యాపిటల్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆశాజనకంగా ఉండండి. ఆటలు, క్రీడల్లో అచీవ్‌మెంట్స్‌ డిలే అవుతాయి. వ్యాపార యంత్రాలు, మెటల్, ఇటుకలు, ప్లాస్టిక్, ఫర్నిచర్, పుస్తకాలు, వైద్య పరికరాలు, ఫైనాన్స్ వ్యాపారాలు పూర్తి అంకితభావంతో విజయవంతంగా కొనసాగుతాయి.

మాస్టర్‌ కలర్‌: పీచ్‌
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 3
దానాలు: ఆలయాలకు కుంకుమ దానం చేయాలి

#Number 2 :
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేముందు జాగ్రత్తగా ఉండండి. సమస్యలు పరిమాణంలో పెరుగుతాయి కానీ మీరు సాయంత్రం ఆలస్యంగా పరిష్కారాన్ని పొందగలుగుతారు. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది, గ్యాదరింగ్స్‌ని మానుకోండి. పిల్లలు సీనియర్ సభ్యులకు సహకరించాలి. ప్రశాంతతతో రోజును ప్రారంభించడానికి పాల నీటి స్నానం చేయండి. ఎగుమతి దిగుమతి వ్యాపారం, రాజకీయ నాయకులు కొత్త అవకాశాలను చూస్తారు.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆలయానికి రెండు కొబ్బరి కాయలు దానం చేయాలి

#Number 3 :
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ప్రియమైన వారితో పాత గందరగోళాన్ని క్లియర్ చేయడానికి, ద్వేషాన్ని పరిష్కరించడానికి ఉత్తమ రోజు. కార్యాలయంలో రిక్రూట్‌మెంట్ మీకు స్వాగతం పలుకుతుంది. సంగీత ప్రేమికులు, హస్తకళల కళాకారులు ఎదుగుదలకు ఒక అవకాశం ఉంది. భూమి, అకడమిక్‌ క్లాసెస్‌, విదేశీ ప్రయాణాలు, ఫుడ్‌ బిజినెస్‌లో పెట్టుబడులు ఈరోజు అధిక రాబడిని అందిస్తాయి. ప్రభుత్వ అధికారులు, రక్షణ అధికారులు అన్ని వ్యవహారాలలో గొప్ప అదృష్టాన్ని పొందుతారు. గురు పూజ చేయడం, భోజనంలో పసుపు ఆహార పదార్థాలను చేర్చుకోవడం మర్చిపోవద్దు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: పిల్లలకు అరటి పండ్లు దానం చేయాలి

#Number 4 :
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. స్థిర అభిప్రాయం, పనిని అమలు చేసే సుదీర్ఘ పద్ధతి ఇప్పుడు మీ బలహీనతగా మారవచ్చు. కాబట్టి వెంటనే మీ నిర్వహణ శైలిని మార్చుకోండి. ప్రయాణ ప్రణాళిక విజయవంతం కావచ్చు, కానీ డ్రైవింగ్ చేయకుండా ఉండండి. మెటల్, లిక్విడ్, గ్లామర్, నిర్మాణం లేదా స్టాక్ మార్కెట్ వ్యాపారం నెమ్మదిగా కదలికను ఎదుర్కొంటుంది. సాంకేతిక, వైద్య రంగం సానుకూల మార్పులను చూస్తుంది. విద్యార్థులు, క్రీడా తారలు కెరీర్‌లో కొత్త దిశను ఎదుర్కొంటారు. మార్కెటింగ్‌లో పనిచేసే వ్యక్తులు కష్టపడి పని చేయాలి, లక్ష్యాలపై మాత్రమే దృష్టి పెట్టాలి. దయచేసి ఈరోజు నాన్ వెజ్ తినడం మానుకోండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: యాచకులకు ఆహారం అందజేయాలి

#Number 5 :
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీ పనితీరుకు డబ్బు రివార్డులను అందుకుంటారు. దీంతో మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. మెర్క్యురీ ప్లానెట్ శక్తి కోసం ఆఫీస్ టేబుల్‌పై 5 స్టెప్ బుక్ ప్లాంట్‌ను ఉంచండి. నటులు, మీడియా, జాకీలు, డిజైనర్లు, బ్యాంకర్లు ప్రత్యేక అదృష్టాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది. సేల్స్, ముఖ్యంగా క్రీడలలో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు వారి విద్యా, సాంస్కృతిక విజయాలను కూడా ఆనందిస్తారు.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పేదలకు పచ్చని ధాన్యాలు దానం చేయాలి

#Number 6 :
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. సోషల్‌ నెట్‌వర్క్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది, ఎంత నెట్‌వర్క్‌ బిల్డ్‌ అయితే అన్ని బిజినెస్‌ అవకాశాలు లభిస్తాయి. పచ్చని పరిసరాలలో గడపడానికి మంచి రోజు. కొత్త జాబ్ ఆఫర్ కోసం వేచి ఉంటే, మీరు సానుకూల ఫలితాలను అందుకుంటారు. మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. దీర్ఘకాలికంగా ఫైనాన్స్ ప్లాన్ చేయాలి. నటులు, మీడియా కుర్రాళ్ళు విజయాన్ని ఆస్వాదించేందుకు అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: టేల్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పేదలకు స్టీల్‌ వెసెల్స్‌ దానం చేయాలి

#Number 7 :
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. లోతైన ఆలోచనలో పడటం మానేయండి. ఎక్కువ విశ్లేషించకండి, ఎందుకంటే మీరు సమయానికి కోల్పోతారు. ఖాళీ చేతులతో నిల్చుంటారు. చిన్నచిన్న లేదా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ సమయం తీసుకోకండి, మీ గడువు దాటిపోతుంది. క్రీడలు, విద్యారంగంలో మీ విజయానికి మద్దతుగా శివుడు, మీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. మీ దృఢమైన వైఖరి కారణంగా రిలేషన్‌ దెబ్బతింటుంది. తప్పక గురు మంత్రం జపించండి. రాజకీయ నాయకులకు ప్రసంగం చేయడానికి, పార్టీ సీనియర్లను ఆకట్టుకోవడానికి ఒక అందమైన రోజు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆలయాలకు కుంకుమ దానం చేయాలి

#Number 8 :
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. గందరగోళం, ప్రణాళిక రెండూ మీ రోజును నెమ్మదిగా మారుస్తాయి. ఈరోజు విజయాన్ని రుచి చూడడానికి మీ సంకల్ప శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేచిన వెంటనే మీ దుప్పటిని మడవండి. ఆరోగ్యకరమైన ఆకు పచ్చని కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి. మీరు ఉన్నత స్థాయి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. వైద్యులు చాలా ప్రయత్నాల తర్వాత డబ్బును అందుకుంటారు. ప్రజాప్రతినిధులు సాయంత్రం నాటికి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: యాచకులకు పుల్లని ఆహారపదార్థాలు దానం చేయాలి

#Number 9:
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది.
మీరు ఖర్చుపెట్టే స్వభావాన్ని నియంత్రించాలి. దాతృత్వ కార్యక్రమాలను ఎక్కువగా ప్రారంభించాలి . అలాగే ఆకస్మిక డబ్బు లేదా విజయం అందే అవకాశం ఉంది. వివాహ ప్రపోజల్స్‌, విదేశీ వ్యాపార ఆర్డర్‌లకు అందమైన రోజు. క్రీడాకారులు, విద్యార్థులు అద్భుతమైన రోజుగా డాక్యుమెంటేషన్‌లో ఒక అడుగు ముందుకు వేయాలి. నటులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, హోటల్ వ్యాపారులు భారీ అదృష్టాన్ని అందుకొనే సూచనలు ఉన్నాయి.

మాస్టర్‌ కలర్‌: రెడ్, ఆరెంజ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: ఇంట్లో పనిచేసేవారికి, యాచకులకు రెడ్ కాస్మటిక్స్‌ అందజేయాలి

ఆగస్టు 13వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
అనితా రాజ్, శ్రీదేవి, రొమేష్ చంద్ర దత్, వైజయంతిమాల బాలి, రేణుకా చౌఫరి, అపరా మెహతా
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Numerology

తదుపరి వార్తలు