Home /News /astrology /

NUMEROLOGY LUCKY FOR THESE NUMBERS NUMEROLOGY LUCK IS COMING TOGETHER BUT THEY HAVE MONEY AUGUST 12 GH PJN TA

Numerology: న్యూమరాలజీ.. అదృష్టం కలిసొస్తోంది.. వీరికి మాత్రం డబ్బే డబ్బు..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology : న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 12వ తేదీ శుక్రవారం కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology:  పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 12వ తేదీ శుక్రవారం కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో  న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 :

నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీ ప్రొఫైల్‌ను మెరుగుపరిచేందుకు సీనియర్లు, పెద్దల సలహాలను గుడ్డిగా అనుసరించాల్సిన రోజు. శాస్త్రవేత్తలు రిస్కీ డెసిషన్స్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటలు, క్రీడల్లో గెలుపొందే అవకాశం ఉంది. బిజినెస్‌ ఎడ్యుకేషన్‌, కన్‌స్ట్రక్షన్‌ ట్రైనింగ్‌, వ్యవసాయ పుస్తకాలు, మందులు, ఫైనాన్స్ సజావుగా కోలుకుంటాయి. ఉపాధ్యాయులు లేదా కోచ్‌ల నుంచి పిల్లలు ప్రశంసలను అందుకుంటారు.

మాస్టర్‌ కలర్‌: బీజ్‌

లక్కీ డే: ఆదివారం

లక్కీ నంబర్‌: 3

దానాలు: యాచకులకు ఆరెంజెస్‌ దానం చేయాలి

#Number 2 :

నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే, చదువుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్లాన్ చేసుకోండి. పేపర్స్‌పై నాలెడ్జ్‌ను ఇంప్లిమెంట్‌ చేయడానికి అనుకూలమైన రోజు. కాబట్టి తప్పనిసరిగా పోటీకి హాజరు కావాలి. చట్టపరమైన కమిట్‌మెంట్స్‌ సజావుగా నెరవేరుతాయి. మీ గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తిని మీరు కలుస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు సీనియర్ సభ్యులతో సహకరించాలి. ప్రభుత్వ ఒప్పందాలను ఛేదించడానికి మీ గత సంబంధాలను ఉపయోగించుకునే రోజు ఇది. ఎగుమతి దిగుమతి వ్యాపారులు, రాజకీయ నాయకులు కొత్త అవకాశాలను పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ,

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: ఆలయాలకు పాలు లేదా ఆయిల్‌ అందజేయాలి

#Number 3 :

నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. వైద్యులు, శాస్త్రవేత్తలకు ప్రత్యేక రోజు. మీ సోషల్ స్టేటస్‌ను పెంపొందించడానికి చొరవ తీసుకోవాల్సిన రోజు ఇది.గ్రహాలతో కనెక్ట్ అవ్వడానికి ఇంట్లో ఒక చెక్క వస్తువును ఉంచండి. మీ జ్ఞానం, ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రత్యేకంగా విద్యార్థులు, కన్సల్టెంట్లు, పబ్లిక్ ఫిగర్లు, శాస్త్రవేత్తలు, సంగీతకారులు, రచయితలకు అనుకూలంగా మారతాయి. ఈరోజు పెట్టుబ‌డులు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రేమలో ఉన్నవారు లవ్‌ను ఎక్స్‌ప్రెస్‌ చేయడానికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవాలి. ప్రభుత్వ అధికారులు అన్ని వ్యవహారాలలో అదృష్టాన్ని పొందుతారు. మీ రోజు ప్రారంభించే ముందు మీ గురువు నామాన్ని జపించడం, నుదిటిపై చందనాన్ని ధరించడం మర్చిపోవద్దు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 1

దానాలు: ఫీమేల్‌ హెల్పర్‌కు కుంకుమ అందజేయాలి.

#Number 4 :

నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏది జరిగినా అదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదల ఉంటోంది. ఆ ధోరణిలో ఉండటం మానేయండి. ఆహారంలో క్రమశిక్షణను అనుసరించండి. ఈ రోజు సమయపాలనలో పరిపూర్ణత అవసరం, కాబట్టి అపాయింట్‌మెంట్‌లకు బాగా సిద్ధం చేయండి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా రాజకీయాలు, వినోద పరిశ్రమల వారికి ప్రయాణానికి అనుకూలమైన రోజు. నిర్మాణం, వైద్యం, ఐటీ, హార్డ్‌వేర్, వ్యవసాయ రంగాల్లో సానుకూల మార్పులు వస్తాయి. మార్కెటింగ్‌లో పనిచేసే వారు నెలాఖరున తమ లక్ష్యాలను చేధించే అవకాశం ఉంది. దయచేసి ఈరోజు నాన్ వెజ్ తినడం మానుకోండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: యాచకులకు దుప్పట్లు దానం చేయాలి.

#Number  5:

నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మొండితనాన్ని విడిచిపెట్టి, ఇతర సూచనలను గౌరవించాలని గుర్తుంచుకోండి. గత పనితీరుకు ఈ రోజు గుర్తింపు, ప్రయోజనాలను అందుకుంటారు. చట్టపరమైన సమస్యలను పరిష్కరించడంలో స్నేహితుడు సహాయం చేస్తాడు. బ్యాంకర్లు, మీడియా నిపుణులు ప్రత్యేక అదృష్టాన్ని ఆస్వాదించే సూచనలు కనిపిస్తున్నాయి. సేల్స్, ముఖ్యంగా క్రీడలలో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు తమ అకడమిక్ అచీవ్‌మెంట్స్‌ ఆనందిస్తారు.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: పచ్చని ఆకు కూరగాయలు దానం చేయాలి.

#Number 6 :

నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం, కొత్త ఇల్లు కోసం అన్వేషించడానికి, ఆడిషన్‌లకు హాజరు కావడానికి, ప్రెజెంటేషన్‌లు ఇవ్వడానికి ఆభరణాలు కొనడానికి, మాస్ మీడియాను ఎదుర్కోవడానికి, విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి అనువైన రోజు. కుటుంబ కార్యక్రమాలలో గడపడానికి మంచి రోజు. వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి, పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి అస్సెట్స్‌ కోసం చూస్తున్న వారు మంచి ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోగలుగుతారు. నటులు, మీడియా కుర్రాళ్ళు విజయాలను అందుకుంటారు.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ,

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: పేదలకు చక్కెర దానం చేయాలి

#Number 7 : 

నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. మీరు యావరేజ్‌ ఇంటెలిజెంట్‌ పర్సన్‌ కంటే ఎక్కువ కాబట్టి ఉన్నత చదువుల కోసం వెళ్లండి. వృత్తి నిపుణులు నైపుణ్యం పెంచుకోవాలి. మీ జీవిత భాగస్వాములు మీకు సపోర్ట్‌ ఇవ్వాలని కోరుకుంటారు. రిలేషన్‌ బావుంటుంది. ఆపోజిట్‌ జెండర్‌ ఈ రోజు మీకు అదృష్టాన్ని పెంచుతారు. గురు మంత్రం, కేతు మంత్రం పఠించాలి. మృదు ప్రసంగం, విరాళాలు ఈరోజు అన్ని విషయాలను గెలుస్తాయి. రాజకీయ నాయకులకు బహిరంగ సభలకు హాజరు కావడానికి, పార్టీ సీనియర్లను ఆకట్టుకోవడానికి ఒక అందమైన రోజు.ః

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: పేదలకు పచ్చని ఆకుకూరగాయలు లేదా పండ్లు దానం చేయాలి

#Number 8 :

నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. నిన్నటి ఒత్తిడిని వదిలించుకోవడానికి పాల నీటి స్నానం చేయండి. విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ మీ బలమైన సోషల్‌ ఇమేజ్‌ సహాయంతో రోజు చివరి నాటికి మీకు రివార్డు లభిస్తుంది. మీరు ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పొందేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తారు. సెమినార్‌లు నిర్వహించేటప్పుడు వైద్యులు ప్రశంసలు అందుకుంటారు. ప్రజాప్రతినిధులు సాయంత్రం నాటికి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: యాచకులకు పుల్లని ఆహార పదార్థాలు అందజేయాలి

#Number 9 :నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. రోజు గందరగోళం, అసహనంతో నిండి ఉంటుంది. కానీ ఆకస్మిక డబ్బు లేదా విజయం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మంచి రోజు కాబట్టి క్రీడాకారులు, కౌన్సిలర్లు, వైద్యులు, నృత్యకారులు, నటులు, విద్యార్థులు డాక్యుమెంటేషన్‌లో ఒక అడుగు ముందుకు వేయాలి. నటులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, హోటల్ వ్యాపారులు భారీ అదృష్టాన్ని ఆస్వాదించే సూచనలు ఉన్నాయి.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌,

బ్లూలక్కీ డే: మంగళవారం,

లక్కీ నంబర్‌: 3, 9

దానాలు: ఇంట్లో పనిచేసేవారికి, యాచకులకు దానిమ్మ పండ్లు దానం చేయాలి.

ఆగస్టు 12వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..విక్రమ్ సారాభాయ్, సారా అలీ ఖాన్, తేజీ బచ్చన్, సీతారామ్‌ యేచూరి, డాక్టర్ నరేష్ ట్రెహాన్, కృష్ణ ముఖర్జీ
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Numerology

తదుపరి వార్తలు