Home /News /astrology /

NUMEROLOGY INCOME WILL NOT CHANGE FOR THESE ZODIAC SIGNS THESE NUMBERS ALSO THEY WILL REACH THE GOAL AUGUST 19TH GH PJN TA

Numerology:న్యూమరాలజీ.. ఈ రాశుల వారికీ ఆదాయానికీ తిరుగుండదు.. లక్ష్యాన్ని చేరుకుంటారు..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology:న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 19వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 19వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 :
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. రోజులో ఉదయం చాలా నెమ్మదిగా ఉన్నప్పటికీ, మిగిలిన రోజు సానుకూల శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. అన్ని అసైన్‌మెంట్‌లను సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. మీ సంబంధ నైపుణ్యాలు అద్భుతంగా పని చేస్తాయి కాబట్టి డబ్బు సంపాదించడం లేదా లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది. విజయాన్ని సాధించడానికి సూర్య భగవానుడు, చంద్రుడు ఆశీర్వాదం తీసుకోవాలని గుర్తుంచుకోండి. రొమాన్స్‌ జీవితాన్ని మధురమైన భావోద్వేగాలతో నింపుతుంది. క్రీడాకారులు విజయంతో ఇంటికి వస్తారు. ఆఫీసులో కృత్రిమ పొద్దుతిరుగుడు పువ్వులను తప్పనిసరిగా ఉంచాలి.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: ఆదివారం, శుక్రవారం
లక్కీ నంబర్‌: 1, 9
దానాలు: సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దానం చేయాలి

#Number 2 :
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన రోజు. ఈ రోజు మొదటి సగ భాగంలో మీ హృదయం అమాయకత్వం, ఆప్యాయతతో నిండిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొనే భావోద్వేగ సమయం. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించే రోజు. మీ పిల్లలతో గడపడానికి కూడా ఇది మంచి రోజు. పెట్టుబడిపై రాబడి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు లిక్విడ్స్‌, ఎలక్ట్రానిక్, ధాన్యాలు, ఆభరణాలు, రసాయనాలు, మందులు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో ఉంటే లాభాన్ని పొందడానికి ప్రత్యేక అవకాశం ఉంది.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: యాచకులకు పాలు దానం చేయాలి

#Number 3 :
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. గొప్ప జ్ఞానం, ప్రతిభను ఉంది, ఈ రోజు సమాజం నుంచి బహుమతులు, గౌరవాన్ని పొందాలి. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. అభద్రతా భావం వేడుకకు ఆటంకం కలిగిస్తుంది. వ్యాపార ఒప్పందాలలో రాతపూర్వక సమాచార మార్పిడిపై మాత్రమే ఆధారపడాలి. ఈరోజు మీరు రాజకీయాలలో లేదా ప్రభుత్వ అధికారిగా ఉంటే ప్రత్యేకంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పరీక్ష రాసే ముందు గురు మంత్రాన్ని పఠించాలి. బృహస్పతి గ్రహం శక్తిని పెంచడానికి తప్పనిసరిగా పసుపు రంగు భోజనం వండాలి, మొత్తం కుటుంబానికి వడ్డించాలి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: ఆలయాలకు పసుపు అందజేయాలి

#Number 4 :
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోండి. ఓరల్‌ కమ్యునికేషన్‌ ప్రారంభించడానికి, మైలురాయిని చేరుకోవడానికి సరైన రోజు. ప్రభుత్వ ఆదేశాలను ఛేదించడంలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి. ఎక్కువ సమయం మీటింగులు, ప్రెజెంటేషన్లలోనే గడపాలి. చట్టపరమైన కేసులను డీల్ చేస్తే ఇతరుల సలహాలతో జాగ్రత్తగా ఉండండి. మీ మనసు చేసే సూచనలు వినండి. వ్యక్తిగత సంబంధాలలో భావోద్వేగ మలుపులు ఉంటాయి. వ్యాయామంలో కొంత సమయం గడపండి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: జంతువులకు ఆహారం అందజేయాలి

#Number 5 :
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. గత జ్ఞాపకాలను విస్మరించండి, లేకుంటే ప్రస్తుత సంబంధాన్ని కూడా కోల్పోతారు. ఈరోజు కొత్త స్థానం, స్థలం, ఒప్పందాలు లేదా నాయకత్వాన్ని అందించే అవకాశం ఉంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మానసికంగా మోసం చేసే అవకాశం ఉంది, వారితో జాగ్రత్తగా ఉండండి. ఇంటర్వ్యూ ప్లాన్‌లను ఒక రోజు వాయిదా వేయండి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మీటింగ్‌లలో అదృష్టం కలిసి వస్తుంది. దయచేసి ఈ రోజు పార్టీలు, నాన్ వెజ్ మానుకోండి. అలాగే రొమాంటిక్‌ రిలేషన్‌ శాశ్వతంగా పరిణతి చెందుతుంది. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. క్రీడల్లో విజయం పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: వృద్ధాశ్రమాలకు మొక్కలు అందజేయాలి

#Number 6 :
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది.
ఇది మీ సిక్త్ సెన్స్‌ ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన రోజు. ప్రజలందరినీ విశ్వసించాలనే మీ ఆలోచన మీ వ్యక్తిత్వ బలహీనత. కాబట్టి భాగస్వాములను ఎన్నుకోవడంలో ఆచరణాత్మకంగా, తెలివిగా ఉండండి. మీరు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల సపోర్ట్‌ను పొందడం ఆశీర్వాదమే అయినా.. అందరి బాధ్యతలను తీసుకోకుండా ఉండాలి. భాగస్వామితో గడపడానికి, కార్యాలయంలో ప్రదర్శనలు ఇవ్వడానికి సమయం. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవడానికి మీకు తగినంత అదృష్టం ఉంటుంది. వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడానికి లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. రొమాన్స్‌ మీ రోజును అందంగా మారుస్తుంది.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆలయాలకు సిల్వర్‌ కాయిన్‌ దానం చేయాలి

#Number 7 :
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజు మీరు మీ సలహాలను తోటివారికి తెలియజేయాలి. ఈ రోజు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది, కానీ అధిక లాభాలతో ముగుస్తుంది. డబ్బు లావాదేవీలు, చట్టపరమైన పత్రాలను పునఃపరిశీలించేటప్పుడు తెలివిని ఉపయోగించాలి. వ్యాపారంలో బాధ్యతల భారం ఉంటుంది. ఈ రోజు పెద్దలతో సమయం గడపడం, వారి సలహాలను పాటించడం అవసరం. ఆపోజిట్‌ జెండర్‌ సూచనలను అంగీకరించండి. సాఫ్ట్‌వేర్, రక్షణ, బంగారం, పెట్రోల్, పానీయాలు, సౌందర్య సాధనాలకు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ పరిశీలించడం మంచిది. శివాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. చిన్న బ్రాండ్‌లతో కొలాబరేట్‌ కావడానికి అనుకూలమైన రోజు.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆలయాలకు పసుపు రంగు వస్త్రం అందజేయాలి

#Number 8 :
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు మీలో అన్‌ నేచురలర్‌ శక్తి ఉంటుంది, ఆ శక్తిని విజయాన్ని గుర్తించడానికి ఉపయోగించండి. మీరు చాలా మందికి నాయకుడిగా, మార్గదర్శిగా ఉంటారు. కానీ కఠినంగా ఉండకూడదని గుర్తుంచుకోండి. చట్టపరమైన కేసులు ప్రభావవంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా పరిష్కారమవుతాయి. డబ్బును పెంచుకోవడంలో మీ భాగస్వామి సపోర్ట్‌ చేస్తారు. విదేశాలకు ప్రయత్నించే విద్యార్థులు తప్పనిసరిగా ఈ రోజు అధిక ఫీజులు చెల్లించాలి, ఎందుకంటే ఇది వారి కలలను నెరవేర్చడంలో వారికి సహాయపడుతుంది. మీరు కష్టపడి పని చేస్తారు కాబట్టి మీ నిర్ణయాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. క్రీడల్లో ఆటగాళ్లు శ్రమతో ఆకాశాన్ని తాకుతారు. ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేయాలి. దానధర్మం నేడు తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: అవసరంలోని వారికి ఆయిల్‌ దానం చేయాలి

#Number 9 :
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీ ప్రతిభను ఈ రోజు ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. స్త్రీలు అభివృద్ధిని పెంచడానికి ఉన్నతాధికారులతో కనెక్ట్ అయ్యే రోజు. అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని గుర్తుంచుకోండి. వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు సజావుగా సాగుతాయి. సౌరశక్తి, ప్రభుత్వం, బోధన, గ్లామర్, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు ప్రజాదరణ పొందుతారు. యువకులు ఈరోజు కొన్ని కొత్త స్థానాలను అందుకుంటారు. ఈరోజు మీరు ఏమి చేసినా అది సరైన నిర్ణయంగా కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు తప్పనిసరిగా ఈ రోజును ఉపయోగించుకోవాలి. క్రీడాకారుల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు. వైద్యులు, సర్జన్లు కీర్తిని అందుకుంటారు. మహిళలు ఫిట్‌గా, కూల్ మైండ్‌తో ఉండటానికి శారీరక వ్యాయామం చేయాలి.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, రెడ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఆలయాలకు కుంకుమ అందజేయాలి

ఆగస్టు 19వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
సత్య నాదెళ్ల, సుధా మూర్తి, బిల్ క్లింటన్, నందనా సేన్, గోవింద్ నిహలాని, విజయ్ కుమార్
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Numerology

తదుపరి వార్తలు