హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: పుట్టిన తేదీలో ఈ అంకెలు లేకపోతే ఆర్థిక కష్టాలు తప్పవు.. బయట పడాలంటే ఇలా చేయండి

Numerology: పుట్టిన తేదీలో ఈ అంకెలు లేకపోతే ఆర్థిక కష్టాలు తప్పవు.. బయట పడాలంటే ఇలా చేయండి

Numerology: పుట్టిన తేదీలోని అంకెల ప్రభావం జీవితంలోని చాలా అంశాలపై ఉంటుందని  నిపుణులు చెబుతున్నారు. కొన్ని నంబర్‌ల కలయిక కొన్ని సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు జీవితంలో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న వాళ్లు.. ఆర్థిక స్థిరత్వం  పొందాలంటే వారికి ఏ నంబర్‌లు అనుకూలమో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Numerology:  పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పుట్టిన తేదీలోని అంకెల ప్రభావం జీవితంలోని చాలా అంశాలపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నంబర్‌ల కలయిక కొన్ని సమస్యలను దూరం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు జీవితంలో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న వాళ్లు.. ఆర్థిక స్థిరత్వం(Financial Stability) పొందాలంటే వారికి ఏ నంబర్‌లు అనుకూలమో తెలుసుకుందాం.

2023 Astro Updates : 2023 ఈ ఐదు రాశుల వారికి అదృష్ట సంవత్సరం

* జీవితంలో ఆర్థిక స్థిరత్వం కోసం

జీవితంలో ఎక్కువ మందికి వచ్చే సంస్థలు ఆర్థిక పరమైనవి. అవసరాలను తీర్చుకోవడంతో మొదలై.. అప్పుల్లో కూరుకుపోతారు. చాలా మంది ఆర్థిక సంక్షోభంతో విసిగిపోయి, ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారు పుట్టిన తేదీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 4, 5, 6, 8వ అంకెలు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి.

Shani Gochar 2023 : కొత్త సంవత్సరంలో 4 రాశుల వారికి అపారమైన సంపద

* 5వ అంకె అత్యంత కీలకం

నంబర్‌ 4 జీవితంలో కష్టపడి పనిచేయడం, స్టిస్టమేటిక్‌ అప్రోచ్‌ను సూచిస్తుంది. ఈ అంకె ప్రభావంతో లక్ష్యంపైనే దృష్టి పెడతారు. అదే విధంగా నంబర్‌ 5 స్థిరత్వం, అదృష్టం, ఆకర్షణ, పెరుగుదల, అభివృద్ధిని ఇస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం గా మార్చే శక్తిని అందజేస్తుంది. న్యూమరాలజీ గ్రిడ్‌లోని ఇతర అన్ని ఇళ్లకు 5 డ్రైవర్‌లాంటిది. 5వ అంకె లేకుండా, ఒక లక్ష్యంతో స్థిరపడడంలో, శక్తులను ఒకే మార్గంలో ఉపయోగించడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు గొప్ప, స్థిరమైన కెరీర్ వృద్ధిని పొందాలంటే కనీసం ఒక్క 5ని అయినా కలిగి ఉండాలి. ఇది మిమ్మల్ని సరైన వైఖరితో సరైన దిశలో నడిపిస్తుంది. 5వ అంకెకు తగిన శక్తి ఉంటే వాళ్లు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోరు, అనవసరంగా డబ్బు ఖర్చు చేయరు. కష్టపడి సంపాదించిన డబ్బును కూడా ఆదా చేసేలా చేస్తుంది.

కొత్త ఏడాదిలో అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారికి సంవత్సరం పొడువునా సంపదే సంపద!

* నంబర్‌ 8 అనేక విషయాలు నేర్పుతుంది

6వ అంకె అనేది ఆర్థిక భద్రతతో కూడిన కొత్త ఆదాయ మార్గాలను తీసుకువచ్చే సంఖ్య. ఇది అవకాశాల సంఖ్య. జీవితంలో అవకాశాలు మాత్రమే కాకుండా శ్రేయస్సును తీసుకొస్తుంది. ఇది మొత్తం వ్యాపార నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం ద్వారా గొప్ప పరిచయాలకు అవకాశం ఇస్తుంది. నంబర్‌ 8 పరిస్థితిని విశ్లేషించి, తదనుగుణంగా ప్రవర్తించే జ్ఞానం, మెచ్యూరిటీని ఇస్తుంది. 8 మిమ్మల్ని ఎప్పటికప్పుడు గొప్ప న్యాయనిర్ణేతగా చేస్తుంది. ఇది ఒక నిర్దిష్ట వ్యయం అవసరాన్ని అర్థం చేసుకోవడానికి, ఖర్చు ఉండకుండా డబ్బును ఆదా చేయడానికి అంతర్దృష్టిని ఇస్తుంది. ఇది జీవితంలోని వివిధ దశల ద్వారా అనేక విషయాలను నేర్చుకునేలా చేస్తుంది. కష్టం, డబ్బు విలువను అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ కలిగిస్తుంది.

* ఇవి పాటిస్తే శుభం

మీ పుట్టిన తేదీలో పైన పేర్కొన్న అంకెలు లేకపోతే.. మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే.. ఆ అంకెలను మీ మొబైల్ నంబర్‌లో ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరు ఆ నంబర్‌ల శక్తిని పొందగలుగుతారు. జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందేందుకు ఈ అంకెల ప్రభావం ఎంతో అవసరం. అదృష్ట రంగులుగా ఎల్లో, గ్రీన్‌ ఉన్నాయి. అదృష్ట అంకెగా 5ను భావించాలి. దయచేసి ఆకు కూరలను పశువులకు లేదా పేదలకు దానం చేయండి. ఆఫీస్‌ టేబుల్ మీద క్రిస్టల్ లోటస్ ఉంచితే మంచిది.

First published:

Tags: Horoscope, Numerology

ఉత్తమ కథలు