Home /News /astrology /

NUMEROLOGY AUGUST 10 HARD TO GET TRUST OF OTHERS FAVORABLE FOR INVESTMENTS TO THESE LUCKY SIGNS GH PJN TA

Numerology: న్యూమరాలజీ.. ఇతరుల విశ్వాసాన్ని పొందడం కష్టం.. పెట్టుబడులకు అనుకూలం..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology: న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 10వ తేదీ బుధవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 10వ తేదీ బుధవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.

#Number 1
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. ఈ రోజు పనిని పూర్తి చేయడానికి మీ విల్‌ పవర్‌ ఉత్తమ పాత్ర పోషిస్తుంది. ఈ రోజు విలాసవంతమైన ప్రయాణం చేస్తూ సమయానికి గమ్యాన్ని చేరుకుంటారు. ఇతరుల విశ్వాసాన్ని పొందడం కష్టం, కాబట్టి మీ కమిట్‌మెంట్స్‌కు పరిమితం అవ్వండి. ఈ రోజు మీరు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. సామాజిక పరిచయాల కారణంగా అధికారాన్ని పొందడం సులభం. విజయం సాధించాలంటే సూర్య భగవానుడు, గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. క్రీడాకారులు వారి కోచ్‌ల కారణంగా విజయంతో ఇంటికి వస్తారు. మీరు ఆటలో ఒక ప్రత్యేక నాయకుడిని కలుస్తారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: ఆదివారం, శుక్రవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పేదలకు పసుపు రంగు ఆహారం దానం చేయాలి

#Number 2
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. నైపుణ్యం పెంపొందించుకోవడానికి, విదేశాల్లో విద్యలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు. సానుకూలంగా ఉండండి, మీ విజయం మీ తోడుగా ఉంది, అన్ని అసైన్‌మెంట్‌లను తీసుకోండి. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించే రోజు. మీ పిల్లలు, బంధువులతో గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. పెట్టుబడిపై రాబడి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు ద్రవపదార్థాలు, విద్య, పుస్తకాలు, ఫైనాన్స్‌లు, ఎలక్ట్రానిక్, మందులు, ఎగుమతి, దిగుమతులు, సౌరశక్తి, వ్యవసాయం, పెట్రోలు, రసాయనాల సంబంధ వ్యాపారాల్లో ఉంటే లాభాన్ని పొందేందుకు సూచనలు కనిపిస్తున్నాయి.

మాస్టర్‌ కలర్‌: వైట్‌, స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: యాచకులకు, పశువులకు తాగునీరు దానం చేయాలి

#Number 3
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. బ్యూటీ ప్రొడక్ట్‌లు, ఫుడ్‌కి సంబంధించిన అవకాశాలను స్వీకరించండి. మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని ప్రజల మధ్య ప్రదర్శించండి, ఇది కీర్తిని పొందేందుకు ఉత్తమ సమయం. ఈ రోజు విద్యార్థులకు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మీ గురువుకు కృతజ్ఞతలు చెప్పడం గుర్తుంచుకోండి. మీ భాగస్వామిని మృదు, మధురమైన మాటల ద్వారా మాత్రమే ఆకట్టుకోవడానికి మంచి సమయం. మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ చేయడానికి అనువైన రోజు. పాత కోచ్ సహాయంతో క్రీడాకారులు విజయాలు అందుకుంటారు. ఈ రోజు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా మాస్ దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. విద్యార్థులు గురు మంత్రాన్ని పఠించి ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. బృహస్పతి గ్రహం శక్తిని పెంచడానికి ఆడవారు పసుపు రంగులో భోజనం వండాలి, మొత్తం కుటుంబానికి వడ్డించాలి.

మాస్టర్‌ కలర్‌: పింక్‌, వయోలెట్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: ఆలయాలకు చందనం దానం చేయాలి

#Number 4
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. వైద్యులు, శాస్త్రవేత్తలకు హార్డవర్క్‌ ఫలితాలను అందించదు. ప్రణాళిక గందరగోళాన్ని క్లియర్ చేస్తుంది. రోజులో హై మ్యానేజ్‌మెంట్‌తో పరిపూర్ణత వస్తుంది. రక్షణ, ప్రాపర్టీ డీలర్లు, హోటళ్ల వ్యాపారులు, తయారీదారులు, టెలికాం వ్యాపారం, ఐటీ ఉద్యోగులు సులభంగా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ రోజు పెట్టుబడి పెట్టిన డబ్బు రాబడి కోసం వేచి ఉండాలి. ఎక్కువ సమయం ప్లానింగ్‌లోనే వెచ్చించాలి. స్టాక్‌తో వ్యవహరిస్తే, సీనియర్ల సలహాలను జాగ్రత్తగా తీసుకోండి. మీ హాబీలతో కొంత సమయం గడపండి, పుల్లని పదార్థాలు తీసుకోండి.

మాస్టర్‌ కలర్‌: గ్రే
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు, పశువులకు నలుపు లేదా నల్లని ధాన్యాలు దానం చేయాలి

#Number 5
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. దంపతుల మధ్య పరస్పర నమ్మకాన్ని కొనసాగించండి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు ఈ రోజు అంతా బాగానే ఉంది. మీ సహచరులు, పరిచయస్తులతో జాగ్రత్త వహించండి. మీ రహస్యాలను వారితో పంచుకోవద్దు. ప్రత్యేక అప్రైజల్స్‌ అందుకోవడానికి గ్లామర్, మీడియా, విదేశీ వస్తువులు, క్రీడలలోని స్నేహితులు, బంధువులతో ప్రాక్టికల్‌గా ఉండండి. సమావేశాలకు ఆక్వా ధరించి హాజరైతే మేలు. దయచేసి ఈరోజు పార్టీలు, నాన్ వెజ్ మానుకోండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. క్రీడల్లో విజయాలను అందుకుంటారు.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పశువులకు తాగునీరు అందజేయాలి

#Number 6
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది.
ఇది మీ వ్యక్తిత్వ సౌందర్యాన్ని పెంచే రోజు, కాబట్టి షాపింగ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. కాస్మెటిక్స్ వ్యాపారంలో సృజనాత్మకతతో అవకాశాన్ని పొందండి. ఉత్తమ భాగస్వామిని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపే రోజు. తల్లిదండ్రులు పిల్లలపై గర్వపడతారు. మీరు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల సపోర్ట్‌ను కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. భాగస్వామితో గడపడానికి, ఆఫీసులో ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి సమయం. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవడానికి మీకు తగినంత అదృష్టం ఉంటుంది. వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడానికి లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోంది. నటన, రాజకీయాలను కెరీర్‌గా భావించే వారు ఈ ఆఫర్‌ను అంగీకరించాలి. ఇది భవిష్యత్తులో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

మాస్టర్‌ కలర్‌: బ్లూ, పింక్‌
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆలయాలకు కొబ్బరి కాయలు దానం చేయాలి

#Number 7
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీ అంతర్ దృష్టి సపోర్ట్‌ చేస్తుంది. రోజు ఉత్కంఠభరితంగా ఉంటుంది, వ్యాపార ఒప్పందాలలో ప్రత్యేకంగా తెలివిని ఉపయోగించాలి. హెల్త్‌ చెకప్‌లు వంటివి సాయంత్రం తర్వాత చేసుకోవాలి. పెద్దలకు సేవ చేయాలి, నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. ఆపోజిట్‌ జెండర్‌ సూచనలు వినండి. న్యాయవాది సలహా తీసుకోవడం డబ్బును సరైన మార్గంలో ఆదా చేయడంలో సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్, రాజకీయాలకు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. వివాహానికి అద్భుతమైన మ్యాచ్ రాబోతోంది. శివాలయంలో నవగ్రహాలను సందర్శించడం, పూజలు చేయడం ద్వారా శ్రేయస్సు పొందేందుకు అనుగ్రహం లభిస్తుంది.

మాస్టర్‌ కలర్‌: పీచ్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆశ్రమాలకు పసుపు రంగు పండ్లు అందజేయాలి

#Number 8
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. యజమానిని ఆకట్టుకోవడానికి అనంతమైన సామర్థ్యం ఉంటుంది. మీరు చివరికి రివార్డ్‌లను అందుకున్నందున ఏ పరిస్థితిలోనైనా పని చేయడానికి ఫ్లెక్సిబుల్‌గా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడ జ్ఞానం, డబ్బు శక్తిని ఉపయోగించండి. చట్టపరమైన కేసులు ప్రభావవంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా పరిష్కారమవుతాయి. వ్యాపార ఒప్పందాలను ఛేదించడానికి ఈరోజు నెట్‌వర్కింగ్ కీలకం. మీ భాగస్వామి మిస్ కమ్యూనికేషన్ కారణంగా ఫిర్యాదు చేస్తారు. విద్యార్థులు పోటీలో పాల్గొనేటప్పుడు ముదురు రంగు వస్త్రాలు ధరించడం మానుకోవాలి. మీ నిర్ణయాలన్నీ పరిపూర్ణంగా ఉంటాయి. ప్రయాణ ప్రణాళికలు వాయిదా వేసుకోవాలి. దానధర్మం నేడు తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: టేల్‌
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: స్థానికులకు పాదరక్షలు దానం చేయాలి

#Number 9
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మాస్ మీడియా ఉద్యోగులు ఈ రోజు తమ పని జీవితాన్ని అభివృద్ధి చేసే నిర్ణయం తీసుకుంటారు. జంటలు భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒక అందమైన రోజు. ప్రభుత్వ టెండర్లు, ఒప్పందాలు సజావుగా జరుగుతాయి. గ్లామర్, ఎయిర్‌లైన్‌లు, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు ప్రజాదరణ పొందుతారు. భవిష్యత్ రాజకీయ నాయకులు ఈ రోజు కొన్ని కొత్త స్థానాలను పొందుతారు. బహిరంగ ప్రసంగం, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలకు ఈ రోజును తప్పక ఉపయోగించాలి. సంగీత విద్వాంసులు, క్రీడాకారుల తల్లిదండ్రులు ఈ రోజు వారి పిల్లల గురించి గర్వపడతారు. వైద్యులు, సర్జన్లు రివార్డులను అందుకుంటారు. ప్రయాణ ప్రణాళికలు విజయాలతో నిండి ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఏదైనా రూపంలో ఎర్ర కందిపప్పు దానం చేయాలి

ఆగస్టు 10వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
వి.వి గిరి, ఫూలన్ దేవి, షబీర్ అహ్లువాలియా, రమేష్‌బాబు ప్రగ్నానంద, ప్రత్యూష బెనర్జీ
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Numerology

తదుపరి వార్తలు