హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: న్యూమరాలజీ.. వీరికి భవిష్యత్తు అంతా బంగారు మయం.. అనుకోని అదృష్టం..

Numerology: న్యూమరాలజీ.. వీరికి భవిష్యత్తు అంతా బంగారు మయం.. అనుకోని అదృష్టం..

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology : న్యూమరాలజీ ప్రకారం నెలలో వివిధ తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని సంఖ్యల ప్రభావం ఉంటుంది. వీటి ఆధారంగా వ్యక్తులపై పడే ప్రభావాన్ని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 24వ తేదీ బుధవారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

Numerology: న్యూమరాలజీ ప్రకారం నెలలో వివిధ తేదీల్లో పుట్టిన వారిపై కొన్ని సంఖ్యల ప్రభావం ఉంటుంది. వీటి ఆధారంగా వ్యక్తులపై పడే ప్రభావాన్ని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 24వ తేదీ బుధవారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

# నంబర్ (Number) 1

నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది.. సృజనాత్మకత గల స్త్రీలు ఉన్నత గ్రేడ్‌లను ఆస్వాదిస్తారు. భవిష్యత్తులో ఎదగడానికి.. కొత్త అవకాశాలకు అనుగుణంగా మీ ఆలోచనలను రూపొందించడానికి సిద్ధంగా ఉండండి. ప్రాక్టికల్‌గా ఆలోచించండి, భాగస్వామ్యాలను నివారించండి. చట్టపరమైన లేదా అధికారిక సమస్యలను పరిష్కరించగల సామాజిక మద్దతును అందుకుంటారు, కానీ ఆర్థిక సహాయం తీసుకోకుండా దూరంగా ఉంటారు. డిజైనర్లు, క్రీడాకారులు, బిల్డర్లు, రాజకీయ నాయకులు కొత్త ప్రాజెక్ట్‌లను అంగీకరించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి, లేకపోతే పరువు పోతుంది. దయచేసి ఆకర్షణను పెంచుకోవడానికి తోలు ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. సూర్య భగవానుడిని ప్రార్థించి, సూర్య మంత్రాన్ని జపించి ఆశీర్వాదం తీసుకోండి.

మాస్టర్ కలర్: పసుపు మరియు నీలం

లక్కీ డే: ఆదివారం

లక్కీ నంబర్: 3

విరాళాలు: దయచేసి ఆలయాలకు పొద్దుతిరుగుడు విత్తనాలను దానం చేయండి.

# నంబర్ (Number) 2

నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఉదయం పాల నీటితో స్నానం చేయండి. ఇది ఆస్తి, లగ్జరీతో నిండిన సపోర్టివ్ డే. గృహ నిర్మాణాల్లో ఉన్నవారు ఒక సమావేశాన్ని నిర్వహించాలి, అతిథుల పాజిటివ్ ఎనర్జీని స్వాగతించాలి. భాగస్వామ్య సంస్థలు విజయవంతమవుతాయి. ఆఫ్‌లైన్‌లో పని చేయడం ప్రాధాన్యతనిస్తుంది. మీ ప్రేమ భావాలను శాశ్వత రిలేషన్‌షిప్‌గా మార్చే ఒక రొమాంటిక్ డే. వ్యాపార వ్యవహారాలు కొంత జాప్యంతో పూర్తవుతాయి. ప్రయాణాలకు దూరంగా ఉండండి. పంపిణీదారులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, చిల్లర వ్యాపారులు, విద్యావేత్తలు, వైద్యులు, నగల వ్యాపారులు పేపర్లపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మాస్టర్ కలర్: స్కై బ్లూ

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్: 2, 6

విరాళాలు: గుడికి లేదా అవసరమైన వారికి పెరుగు దానం చేయండి.

# నంబర్ (Number) 3

నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. అరటి చెట్టుకు చక్కెర నీటిని అందించండి. మీ సృజనాత్మకత, జ్ఞానం, భౌతిక స్వరూపం వంటివి ఇతరులపై శాశ్వత ఆకర్షణను ఏర్పరుస్తాయి. మీ వ్యక్తిత్వాన్ని అత్యంత ఆకర్షణీయంగా, మనోహరంగా ప్రదర్శించినప్పుడల్లా అదృష్టవంతులు అవుతారు. యోగా శిక్షకులు, విద్యావేత్తలు, మార్కెటింగ్, సేల్స్ పర్సన్స్, డిజైనర్లు, విద్యార్థులు, న్యూస్ యాంకర్లు, రాజకీయ నాయకులు, నటులు, కళాకారులు, గృహిణులు, హోటల్ వ్యాపారులు, రచయితలు ఈరోజు వృత్తిలో విశేష లాభాన్ని పొందుతారు.

మాస్టర్ కలర్: నారింజ, నీలం

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్: 3, 1

విరాళాలు: ఆలయాలకు పసుపు బియ్యం దానం చేయండి.

# నంబర్ (Number) 4

నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. తులసి మొక్కకు నీళ్ళు పోయండి. వ్యవస్థలో భాగంగా మీ పని సంపూర్ణంగా ఉంటుంది. ప్రభుత్వం లేదా దిగ్గజ బ్రాండ్‌లతో పని చేస్తున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రాధాన్యతను ఆనందిస్తారు. కొత్త సోర్స్ లేదా కొత్త ఆలోచనల నుంచి డబ్బు సంపాదించే రోజు ఇది. బ్రోకర్లు, నిర్మాణం, యంత్రాలు, లోహాలు, సాఫ్ట్‌వేర్, ఔషధాలు వంటి వ్యాపారాల్లో ఉన్నవారు ఈరోజు ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి. అద్భుతమైన మనీ మేనేజ్‌మెంట్ మీ జీవితాన్ని తక్కువ నష్టంతో ఎక్కువ లాభాలతో నింపుతుంది. తండ్రిగా గర్వించే అందమైన అనుభవం కూడా నేడు మీ సొంతం.

మాస్టర్ కలర్: నీలం, బూడిద

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్: 9

విరాళాలు: ఆలయాలకు రెండు కొబ్బరికాయలు దానం చేయండి.

# నంబర్ (Number) 5

నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. గణేశుని ఆశీర్వాదం కోసం ఈరోజు పూజలు చేయండి. మీరు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు ఉదయమంతా పచ్చటి ఉపరితలంపై చెప్పులు లేకుండా నడవాలి. కీర్తి, కెరీర్ వృద్ధిని మెరుగుపరచడానికి బలమైన సోషల్ నెట్‌వర్క్ ఈ రోజు మీకు సపోర్ట్ చేస్తుంది. గందరగోళంలో పడకుండా ఉండండి, సొంత సంకల్పంతో ఆస్తి పెట్టుబడిపై ప్రధాన నిర్ణయాలు తీసుకోండి. క్రీడాకారులు, యాత్రికులు ఉత్తమ ఫలితాల కోసం వేచి ఉండాలి. రోజులో ఉత్తమమైన జీవితాన్ని గడపడానికి అతి పని, సోమరితనాన్ని తప్పక నివారించాలి.

మాస్టర్ కలర్: ఆకుపచ్చ, తెలుపు

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్: 5

విరాళాలు: గుడికి లేదా స్నేహితుడికి తులసి మొక్క దానం చేయండి.

# నంబర్ (Number) 6

నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఇంటి నుంచి పని చేయడం అనేది ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచన. రోజు ఫ్లెక్సిబుల్ అవర్స్ మాత్రమే పని చేయాలని కోరుతున్నప్పటికీ, అది నెరవేర్చుకోవడం కష్టం. వృద్ధిని సాధించడం మంచిది. టీమ్ లీడర్‌గా, కమ్యూనిటీ లీడర్‌గా, అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. స్పోర్ట్స్‌మెన్, డిఫెన్స్ అధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు, ఉపాధ్యాయులు, జువెలర్లు, నటులు, జాకీలు, వైద్యులకు ఈ రోజు అదృష్టంగా ఉంటుంది. అందుకే వీరు నైపుణ్యాలను ప్రదర్శించాలి. తల్లిదండ్రులు పిల్లల పనితీరును గౌరవంగా భావిస్తారు, దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు

మాస్టర్ కలర్: నీలం, పసుపు

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్: 6

విరాళాలు: దయచేసి ఆశ్రమాలకు ఉక్కు పాత్రను విరాళంగా ఇవ్వండి.

# నంబర్ (Number) 7

నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఇతరుల సూచనలను స్వాగతించడం అవసరం. మీరు పని చేయడానికి చిన్న టీమ్‌ను ఇష్టపడుతున్నప్పటికీ, ఈ రోజు మీరు తోటివారి అవసరాన్ని పెంచుకుంటారు. మీరు ప్రత్యేకమైన పనితీరుతో బాస్‌ నుంచి గొప్ప అభిప్రాయాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య నమ్మకం, గౌరవంతో పాటు అనుబంధం పెరుగుతుంది. అయితే వైద్యం, ఆధ్యాత్మిక పాఠశాలలు, వ్యవసాయం, ధాన్యాలతో డీల్ చేసే వారికి ఇది గొప్ప రోజు. మీరు ప్రసంగంలో మృదుత్వాన్ని ప్రయోగించినంత కాలం వ్యాపార సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి.

మాస్టర్ కలర్: ఆరెంజ్, బ్లూ

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్: 7

విరాళాలు: దయచేసి ఆశ్రమాలకు పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి విరాళంగా ఇవ్వండి.

# నంబర్ (Number) 8

నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. పొద్దున మేల్కొన్న వెంటనే మీ దుప్పటిని మడవండి. ఎల్లప్పుడూ జంతువులకు సేవ చేయడం మంచిది. బ్రాండ్ ఎంత పెద్దదైతే అంత ఎక్కువ వృద్ధి మీ సొంతం. కొత్త అవకాశం కోసం రిలేషన్స్‌పై శ్రద్ధ వహించాలని గుర్తుంచుకోండి. ఒక సీనియర్ మీకు గైడ్‌గా పనిచేస్తున్నారు, తప్పనిసరిగా వారిని అనుసరించాలి. ఒప్పందాలు లేదా ఇంటర్వ్యూలు ఆలస్యం లేకుండా కొనసాగించాలి. కుటుంబ కార్యక్రమాలకు లేదా స్నేహితుల పార్టీకి హాజరు కావడానికి ఈరోజు సమయం వెచ్చించే అవకాశం ఉంది. సోషల్ నెట్‌వర్క్, లవ్ రిలేషన్స్‌పై నమ్మకాన్ని పెంపొందించడానికి ఈరోజు బెస్డ్ డే. దయచేసి నాన్ వెజ్, లిక్కర్‌ మానుకోండి.

మాస్టర్ కలర్: సీ బ్లూ

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్: 6

విరాళాలు: దయచేసి పశువులకు తాగు నీటిని దానం చేయండి.

 # నంబర్ (Number)9

నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. అంగారక గ్రహం శక్తిని పొందడానికి ఈరోజు మీ ఇంటి సహాయకుడికి ఆహారం ఇవ్వండి, ఎరుపు రంగు మొబైల్ కవర్‌ను తీసుకువెళ్లండి. సమస్యలు అంతం వైపు పయనిస్తున్నందున మీరు ఈరోజు మరింత రిలాక్స్‌గా, సుసంపన్నంగా ఉంటారు. టీచింగ్, లా, కౌన్సెలింగ్, ఫైనాన్స్ రంగానికి చెందిన వారు కొత్త ఎత్తులను చూస్తారు. కళాకారులకు ఈ రోజు పూర్తి ఆశలు ఉంటాయి. ఒక గొప్ప ప్రత్యుత్తరం కోసం ఎదురుచూస్తున్నందున వ్యాపారం లేదా ఉద్యోగంలో అధికారాన్ని పొందడానికి పాత స్నేహితులు లేదా సహచరులను సంప్రదించడానికి ఒక అందమైన రోజు. మీ వివాహ ప్రణాళికను కుటుంబంతో పంచుకోవడానికి ఇది ఒక రోజు, వారి మద్దతు భవిష్యత్తును సులభతరం చేస్తుంది. దయచేసి ఖర్చులను నియంత్రించండి, ఆహారంలో వెజ్ సిట్రస్ ఫుడ్ తీసుకోండి.

మాస్టర్ కలర్: ఎరుపు

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్: 9, 6

విరాళాలు: దయచేసి పేదలకు పుచ్చకాయ దానం చేయండి.

ఆగస్టు 24న జన్మించిన ప్రముఖులు: శివరామ్ రాజు, బీనా దాస్, పూనమ్ యాదవ్, బీజీ ఖేర్, కేజే జార్జ్

First published:

Tags: Astrology, Horoscope, Numerology, Rasi phalalu

ఉత్తమ కథలు