Lucky Zodiac Signs: అదృష్టం అంటే వీరిదే.. పది రోజుల తరువాత ఈ 4 రాశుల వారికి వద్దంటే డబ్బు.. ఐశ్వర్యం
Lucky Zodiac Signs: అదృష్టం అంటే వీరిదే.. పది రోజుల తరువాత ఈ 4 రాశుల వారికి వద్దంటే డబ్బు.. ఐశ్వర్యం
మరో పది రోజుల్లో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు
Lucky Zodiac Signs: వచ్చే పది రోజుల్లో అదృష్టం అంటే వీరిదే.. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, రాశి పరివర్తనానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఏదో ఒక రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఆ ప్రభావం వివిధ రాశులపై వేర్వేరు ఫలితాలు చూపిస్తుంది. ఈ నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని అద్భుత ఫలితాలు వస్తాయి.
Lucky Zodiac Signs: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం దాదాపు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంటాయి. కొన్ని రాశుల వారిపై మంచి ఫలితాలు చూపిస్తే.. మరికొన్ని రాశులపై చెడు ప్రభావం చూపిస్తుంది. అలాగే రాబోయే పది రోజుల్లో ఈ నాలుగు రాశులకు మాత్రం వద్దంటే వచ్చి అదృష్టం వస్తుంది అంటున్నారు.
మరో పది రోజుల తరువాత ఈ 4 రాశులకు వద్దు అంటే.. డబ్బు.. ఐశ్వర్యం వస్తుంది అని పండితులు చెబుతున్నారు. హిందూమతం జ్యోతిష్యం ప్రకారం బుధుడి గోచారం ప్రభావం కీలకంగా ఉంటుంది. మార్చ్ 16వ తేదీన అంటే మరో పదిరోజుల్లో బుధుడు మీన రాశిలో ప్రవేశిస్తుండటం కొన్ని రాశులకు అదృష్టం తోడుగా నిలవనుంది. ముఖ్యంగా అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు.
బుధుడిని బుద్ధి, ధన వ్యాపారాలకు కారకుడిగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. బుధుడు 23 రోజుల్లో రాశి మారుతుంటాడు. బుధుడు ఎప్పుడు గోచారం చేసినా బుద్ధి, వ్యాపారం, ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈసారి బుధ గ్రహం మార్చ్ 16 వతేదీన గోచారం చేయనుండటం, మీన రాశిలో ప్రవేశిస్తోంది.
ఓ వైపు బుద గ్రహం మీనరాశిలో ప్రవేశిస్తుంటే.. గురు గ్రహం అప్పటికే మీన రాశిలో ఉండటం కారణంగా బుధ, గురు గ్రహాల యుతి ఏర్పడుతుంది. ఈ గ్రహ స్థితి కారణంగా కొన్ని రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది. ఏయే రాశులకు లాభదాయకమో తెలుసా..? అందులో మీ రాశి కూడా ఉందా..?
మిధున రాశి: బుధుడి గోచారంతో అత్యంత ఎక్కువగా లాభపడేది ఈ రాశి జాతకులే.. మిధున రాశికి అధిపతి బుధుడు.. అందుకే ఈ జాతకం వారి కెరీర్, ఆర్ధిక పరిస్థితి గణనీయంగా లాభపడుతుంది అంటున్నారు. వృత్తి జీవితానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు.
మేష రాశి: ఇక మేష రాశి వారికి కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి. బుధ గ్రహం గోచారంతో మేషరాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. ఈ జాతకుల కెరీర్‌లో వృద్ధి సాధిస్తారు. కీలక విజయాలు దక్కుతాయి. అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఊహించని ధనలాభం కలుగుతుంది. ఏవైనా కొత్త పనులు చేపడితే సక్సెస్ అవుతాయి.
వృశ్చిక రాశి: బుధుడి రాశి పరివర్తనం ప్రభావం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం వరిస్తుంది అంటున్నారు. వృత్తి జీవితంలో లాభాలు ఆర్జిస్తారు. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చెడిన పనులు కూడా పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితానికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. లేకపోతే నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది.
కర్కాటక రాశి: ఇక కర్కాటక రాశికి బుధుడి అస్తమించడం గోచారం ప్రభావంతో కెరీర్‌పరంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటున్నారు. ముఖ్యంగా ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణాల యోగం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. పెట్టుబడులు ఆలోచించి తీసుకోవాలి.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.