హోమ్ /వార్తలు /astrology /

Vastu tips: కొత్తగా పెళ్లి చేసుకున్నారా? బెడ్‌రూమ్‌‌లోని మంచం విషయంలో ఈ వాస్తు టిప్స్ పాటించండి..

Vastu tips: కొత్తగా పెళ్లి చేసుకున్నారా? బెడ్‌రూమ్‌‌లోని మంచం విషయంలో ఈ వాస్తు టిప్స్ పాటించండి..

కొత్తగా పెళ్లయిన జంట తమ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. వారు తమ జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు బెడ్‌రూమ్‌ను వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలి. పడకగదిలో ఉంచిన అన్ని వస్తువులు కూడా వాస్తుకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం.

కొత్తగా పెళ్లయిన జంట తమ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. వారు తమ జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు బెడ్‌రూమ్‌ను వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలి. పడకగదిలో ఉంచిన అన్ని వస్తువులు కూడా వాస్తుకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం.

కొత్తగా పెళ్లయిన జంట తమ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. వారు తమ జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు బెడ్‌రూమ్‌ను వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలి. పడకగదిలో ఉంచిన అన్ని వస్తువులు కూడా వాస్తుకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం.

ఇంకా చదవండి ...

    మన దేశంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు దోషాల వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చాలామంది నమ్ముతుంటారు. వాస్తుశాస్త్ర నిపుణుల ప్రకారం, కొత్తగా పెళ్లయిన జంట తమ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. వారు తమ జీవితాన్ని కలిసి ప్రారంభించేముందు బెడ్‌రూమ్‌ను వాస్తుకు అనుగుణంగా డెకరేట్ చేసుకోవాలి. పడకగదిలో ఉంచిన అన్ని వస్తువులు కూడా వాస్తుకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం. బెడ్‌రూమ్‌లో ఎలాంటి వాస్తు దోషాలు లేనట్లయితే.. దంపతుల బంధం మరింత ధృఢమవుతుందని, కుటుంబానికి మంచి జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి కొత్తగా పెళ్లయిన జంట తమ బెడ్‌రూమ్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం.

    * బెడ్‌రూమ్‌ డైరెక్షన్

    వాస్తు ప్రకారం, నూతన వధూవరుల బెడ్‌రూమ్‌ ఆగ్నేయ దిశ (south-east direction)లో ఉండాలి. ఇది భవనం పైఅంతస్తులో ఉండాలి. ఒకవేళ నూతన దంపతుల బెడ్‌రూమ్‌ ఆగ్నేయ దిశలో లేకపోతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడు వధువు తల గది దక్షిణ దిశకు.. పాదాలు ఉత్తర దిశకు ఎదురుగా ఉండేలా ఆమె బెడ్ ఏర్పాటు చేయాలి. అలా చేస్తే వాస్తు దోషం పోతుంది. వధువు పాదాలు బెడ్‌రూమ్‌ ఎంట్రన్స్ లేదా గది తలుపు వైపు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. ఇలా వధువు బెడ్ ని ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే.. ఆమె తల తూర్పు దిశకు ఎదురుగా ఉండేలా మంచాన్ని ఉంచొచ్చు. అయితే గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు నిద్రించే దిశను మార్చుకోవాల్సి ఉంటుంది.

    * మంచం ఎలా ఉండాలి?

    మెటల్‌తో తయారు చేసిన మంచం కోల్డ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అయితే చెక్కతో చేసిన మంచానికి వార్మ్ ఎనర్జీ (warm energy) ఉంటుంది. నూతన వధూవరులకు వార్మ్ ఎనర్జీ అవసరం కాబట్టి చెక్క మంచాన్ని బెడ్‌రూమ్‌లో ఉంచాలి. ఇది కాకుండా, మంచానికి పెట్టె ఉన్నట్లయితే అందులో వ్యర్థాలను వేయకూడదు. అలాగే పదునైన వస్తువును ఉంచకూడదు. ఇది మాత్రమే కాదు పరుపు లేదా మాట్ట్రెస్ కూడా సింగిల్ ఉండాలి.

    * అద్దం ఎలా ఉంచాలి?

    అద్దం మన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువులను రెండు మార్లు చూపించి శక్తిని వ్యాప్తి చేయడం అద్దానికి ఉన్న ప్రధాన లక్షణం. అందువల్ల, అద్దం సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. మీరు నిద్రిస్తున్నప్పుడు అద్దంలో కనిపించకుండా ఉండాలంటే.. అద్దం ఎప్పుడూ మంచానికి కాస్త దూరంగా పక్కన వైపు ఉండాలి. ఎదురుగా ఎప్పుడు అద్దాన్ని ఏర్పాటు చేయకూడదు.

    * బెడ్‌రూమ్‌ని ఎలా అలంకరించాలి?

    చాలా మంది గదిని డెకరేట్ చేయడానికి ఫొటో ఫ్రేమ్‌లను ఉపయోగిస్తారు. నూతన దంపతులు కూడా హ్యాపీనెస్ ని పెంచే ఫొటోలను గదిలో ఉంచాలి. అయితే మీ బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ దేవుడి చిత్రపటాలను, ఒంటరి మానవుల చిత్రాలను లేదా అడవి జంతువుల ఫొటోలను ఉంచకూడదు. దంపతులు తమ ఫొటోలతో బెడ్‌రూమ్‌ని అలంకరించుకోవచ్చు.

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    * బెడ్‌రూమ్‌ గోడ రంగు ఎలా ఉండాలి?

    మీ బెడ్‌రూమ్‌ గోడలపై మీకు ఇష్టమైన రంగును మాత్రమే పెయింట్ చేయించండి. వీలైతే, బెడ్‌రూమ్‌లో సాధ్యమైన చోట ఎరుపు రంగు ఉండేలా జాగ్రత్త పడండి. ఎరుపు రంగు శక్తిని పెంపొందిస్తుంది. ఎరుపు రంగు కొత్తగా పెళ్లయిన జంట మధ్య బంధాన్ని మనోహరంగా మార్చుతుంది. వారి మధ్య ప్రేమను బాగా పెంచుతుంది. అలాగని ఎరుపు రంగును ఎక్కువగా ఉపయోగించకూడదు. గర్భం దాల్చడానికి ప్లాన్ చేసినప్పుడు ఎరుపు రంగు సమస్యలను సృష్టిస్తుందని నమ్ముతారు. ఎరుపు రంగును ఎక్కువగా ఉపయోగించడం వల్ల దంపతుల మధ్య గొడవలు లేదా తగాదాలు తలెత్తవచ్చు.

    First published:

    ఉత్తమ కథలు