హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Astro Tips : ఇంట్లోని పూజ గదిలో ఈ నాలుగు అస్సలు ఉండకూడదు..ఉంటే దేవుడికి కోపం వచ్చి..

Astro Tips : ఇంట్లోని పూజ గదిలో ఈ నాలుగు అస్సలు ఉండకూడదు..ఉంటే దేవుడికి కోపం వచ్చి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Puja room at home : ప్రతి ఇంటి పూజ గది(Pooja Room) ఆ ఇంట్లో అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పూజగది నుండే ప్రవహిస్తుంది.

  Puja room at home : ప్రతి ఇంటి పూజ గది(Pooja Room) ఆ ఇంట్లో అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పూజగది నుండే ప్రవహిస్తుంది. ఇంటి పూజ గది అంటే ఇంట్లోని వారికి ఐశ్వర్యం, సంతోషం తలుపులు తెరిచే ప్రదేశం, కానీ ఒక్కోసారి ఆలోచించకుండా కొన్నింటిని పూజగదిలో ఉంచుతాం. వాటివల్ల మీకు తెలియకుండానే మీరు. దేవుడికి కోపం తెప్పిస్తుంటారు. ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పూజగదిలో ఏమి ఉంచాలి, ఏమి చేయకూడదు? దీనిని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  విగ్రహాలను జాగ్రత్తగా చూసుకోండి

  మీరు చాలా మంది వ్యక్తుల ఇళ్లలో దేవుడి గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను ఉంచడం చూసి ఉంటారు, కానీ మత గ్రంధాలలో అది తప్పుగా పరిగణించబడింది. పూజగదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలు ఉంచడం శ్రేయస్కరం కాదంట., పూజించే దేవుడు తప్ప పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉంచకూడదంట

   రౌద్ర రూపం  ఉంచవద్దు

  పూజగదిలో శివుడు సౌమ్యంగా ఉన్న విగ్రహం లేదా పటం ఉంచాలి. పూజగదిలో భగవంతుని ఉగ్రరూపం ఉండకూడదని గుర్తుంచుకోవాలి. ఒక చిత్రంలో ఏదైనా దేవత లేదా దేవడు కోపంతో కనిపిస్తే, అది ఇంట్లో అసమ్మతికి కారణమవుతుందని నమ్ముతారు. అంతే కాకుండా నటరాజ రూపంలో ఉన్న హనుమంతుడు, భోలేనాథ్ పటాలను కూడా ఇంట్లో ఉంచకూడదు.

  Smile Policy : స్మైల్ పాలసీ..ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నవ్వుతూ పనిచేయాలి

  విరిగినవి ఉంచవద్దు

  విరిగిన దేవుడి విగ్రహాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచితే వెంటనే నిమజ్జనం చేయాలి. గుడిలో గాని ఇంటిలోపల గాని విరిగిన లేదా పగిలిన దేవుడి విగ్రహం లేదా పటం ఉండకూడదని గుర్తుంచుకోవాలి. విరిగిన లేదా పగిలిన విగ్రహాలు ఇంటికి అశుభం అని నమ్ముతారు. విరిగిన విగ్రహాన్ని పూజించడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి.

  పూర్వీకుల ఫొటోల పటాలు

  పూజగదిలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచడం హిందూ మతంలో నిషేధించబడినప్పటికీ, చాలా మంది తమ పూర్వీకుల చిత్రాలను దేవుడి గదిలో ఉంచడం చాలాసార్లు చూసే ఉంటారు. అలా చేయడం హానికరం. దేవుడి గుడిలో పూర్వీకుల చిత్రపటాన్ని ఉంచడం వల్ల ఇంటి శ్రేయస్సు, ఆనందానికి ఆటంకం కలుగుతుంది.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Astrology, Home tips

  ఉత్తమ కథలు