Home /News /astrology /

NEGATIVE ENERGY COMES WITH THIS REASON ALSO RNK

vastu: మీ ఇంటికి నెగిటివ్‌ ఎనర్జీ రావడానికి.. ఇది కూడా కారణం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీది పంచభూతాలను అనుసరించి పాటిస్తే.. ఆ ఇల్లు ఎప్పుడూ పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో విరాజిల్లుతుంది.

ఈ ప్రకృతి పంచభూతాలపై ఆధారపడి ఉంది. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో పాటిస్తాం. అదేవిధంగా బెడ్‌రూం (bedroom) నైరుతి, చిల్ట్రన్‌ రూం వాయువ్యం, అలాగే కిచెన్‌ ఆగ్నేయం (south-east)లో ఉండాలంటారు. అదే పాటిస్తారు.లేకపోతే నెగిటివ్‌ ఎనర్జీ కారణంగా ఆరోగ్య, ఫైనాన్షియల్‌ సమస్యలు (financial problems)  వస్తాయి. అగ్ని దేవుడు ఆగ్నేయానికి అధిపతి కాబట్టి ఈ దిశలోనే స్టవ్‌ పెట్టుపోకాలి. మహిళలు ఎక్కువ సమయంలో కిచెన్‌లోనే గడపాల్సి ఉంటుంది కాబట్టి ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో కూడా ముఖ్యంగా ఆచరించాలి.

ఇక స్టవ్‌ తూర్పు దిశకు నిలబడి వండే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ దిక్కునే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఈ దిక్కునే ఏర్పాటు చేసుకోవాలి. ఇక బియ్యం డబ్బా నుంచి సింక్, సిలిండర్‌కు కూడా దిశలు అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి. సింక్‌ స్టవ్‌కు దగ్గరగా ఉండకూడదు. ఎందుకంటే నీరు, నిప్పు ఒకేదగ్గర ఉండకూడదు. కిచెన్‌లో చాలా సామాన్లు ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ బరువు ఉంటాయి.

ఫ్రిజ్, కిచెన్‌ సామాన్లు నైరుతి దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఈ కొన్ని నియమాలు కచ్ఛితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక కిచెన్‌లో నెగిటివ్‌ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే.. మనం తిన్న ప్లేట్లను సింకులో పెట్టేస్తాం. ఎక్కువ సామాన్లు పోగు చేయకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్‌ చేసుకోవాలి. లేకపోతే, బయట వాష్‌ ఏరియాలో పెట్టుకోవాలి. దీంతో పాచి వాసన కూడా వస్తుంది. మరొటి ట్యాప్‌ లీకే జీ కూడా ఫైనాన్షియల్‌ లాస్‌కు దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: అమావాస్యలోపు ఈ ఒక్క పనిచేయకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!



దాన్ని అలాగే వదిలేయకుండా.. వెంటనే రీపెయిర్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే..మనకు తెలియకుండనే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మనకు తెలియకున్న నిపుణుల సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా కిచెన్‌లో దేవుడి పటాలను ఏర్పాటు చేసుకుంటే.. దానికి కర్టెన్‌ వేసుకోవాలి. ఎక్కువ విగ్రహాలు పెట్టుకోకుండా కేవలం కొన్ని పటాలను మాత్రమే పెట్టుకోవాలి. పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసుకోకపోవడమే మేలు. ఎందుకంటే ఈ బీజీ లైఫ్‌లో ప్రతిరోజూ పూజ చేసుకోనివారు చిన్న విగ్రహాలను పెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి: మీ బ్యాంక్‌ బ్యాలన్స్‌ పెరగాలంటే.. ఈ ఒక్క పని చాలు!


లేకపోతే నెగిటివ్‌ ఎనర్జీకి ఆస్కారం ఉంటుంది. ఇక ఎప్పుడు పూజ మందిరం చాలా శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒకసారి దీపం పెట్టుకుంటే పాజిటివ్‌ ఎనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఇంటిని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి రాడానికి అవకాశం ఉంటుంది. ఈ పంచభూతాలకు అనుకూలంగా ప్రతీది ఫాలో అయితే ఏ బాధలు రావు. ఇంట్లో డబ్బును దాచుకునే ప్రదేశం కూడా నీట్‌గా ఉండాలి. గజిబిజిగా ఉండకుండా చూసుకోవాలి.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు