హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2022: రెండోరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

Navaratri 2022: రెండోరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 మంగళవారం 27 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 మంగళవారం 27 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.

నవరాత్రులు (Navaratri) దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 మంగళ వారం 27 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత (Durga maata) పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.

ఇది కూడా చదవండి: నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

2వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ విదియ..

27వ తేదీ రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. అమ్మకు లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. బంగారు రంగు పాజిటివ్‌ ఎనర్జి తీసుకువస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని చిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని ద్వార సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు.

ఇది కూడా చదవండి: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మక ప్రత్యేకత ఇదే..

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి..

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు