విజయదశమి Dussehra దేశవ్యాప్తంగా అందరు హిందువులు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే పండుగ. ఈ రోజుల్లో ముఖ్యంగా అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో, నవదుర్గలు మనకు ఆశీర్వదిస్తారు.
దేవినవరాత్రుల్లో రెండో రోజు అలంకరణ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి. ఈరోజు అమ్మవారిని తుమ్మిపూలతో అలంకరించాలి. పాయసాన్ని నైవేద్యంగా అందించాలి. అలాగే ఈరోజు దేవికి లేతగులాబీ రంగు చీరను కట్టించాలి. బాలాత్రిపుర సుందరీదేవిని పూజించడం వల్ల సద్బుద్ధి, కార్యాసిద్ధి కలుగుతుంది. ఈ రోజు రవికలను దానం చేయడం చాలా మంచిది. దేవీ నవరాత్రుల్లో రెండో రోజు పటించాల్సిన మంత్రం..
ఐం క్లీం సౌ సౌక్లీం ఐం నమః
తరువాత అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ కుంకుమ పూజ చేస్తే.. చాలా మంచిది. మనస్సు అమ్మవారి మీద పెట్టాలి. అమ్మవారి ప్రవచనాలు ఎన్నో అందుబాటులో ఉంటాయి. వాటిని పటించవచ్చు. ఈ విధంగా అమ్మవారి నవరాత్రులు చేసుకంటే మీ జీవితం ఎంతో ఆనందంతోపాటు ఏ సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ అమ్మవారిని కరుణ మీపై ఉంటుంది. శరన్నవరాత్రుల్లో రెండో రోజు దుర్గమ్మ durga బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది.
త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి. అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే.. మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపురసుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందీదేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపుర సుందీదేవి భక్తుల పూజలందుకుంటోంది.
ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పాయసం నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణం చెయ్యాలి.
దేవిశరన్నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలిచినట్లుగా నిర్వహిస్తాం.
దేవిశరన్నవరాత్రులు అక్టోబర్ 7 నుంచి ఆశ్వియుజ శుద్ధ నవమి వరకు జరుపుకుంటాం.
ఒకేరోజు అమ్మవారిని రెండు అలంకారాలు చేసేది 11వ తేదీనాడు వస్తోంది. ఆశ్వియుజ శుద్ధ పంచమినాడు పూజిస్తాం. విజయ దశమి 15 వ తేదీన నిర్వహిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri