Dussehra 2020: ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా కొనసాగుతున్న దసరా మహోత్సవాలు

శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు నేడు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సిరిసంపదలు , సంతానం , సౌభాగ్యం , ధైర్యసాహసాలు , విజయాలకు ఈ తల్లి అధిష్టాన దేవత.

news18
Updated: October 23, 2020, 10:09 AM IST
Dussehra 2020: ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా కొనసాగుతున్న దసరా మహోత్సవాలు
  • News18
  • Last Updated: October 23, 2020, 10:09 AM IST
  • Share this:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు నేడు శ్రీమహా లక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సిరిసంపదలు , సంతానం , సౌభాగ్యం , ధైర్యసాహసాలు , విజయాలకు ఈ తల్లి అధిష్టాన దేవత. సకల లోకాలకు ఈమె ఐశ్వర్యప్రదాత. ఇరువైపులా గజ రాజులు సేవిస్తుండగా, రెండు చేతులతో కమలాలు ధరించి , అభయ , వరద ముద్రలతో , మహాలక్ష్మీ స్వరూపంతో ఈ తల్లి దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు లైన్లలో బారులు తీరారు. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మీ అమ్మ వారు.. అమితమైన పరాక్రమంతో డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి సమస్త లోకాలకు శాంతి చేకూర్చింది.

అన్ని సౌఖ్యాలతో జీవించడానికి అవసరమయ్యే ప్రతి అంశమూ ఆ దేవిస్వరూపమే. దీనికి మహిళలు ప్రతీకలుగా నిలుస్తారని ప్రతీతి.

andhrapradesh, vijayawada news, indrakeeladri, dusshera in indrakeeledri, bejawada kanakdurga, durgamma, indrakeeladri news
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవం... (File)


బిడ్డలకు జ్ఞానాన్ని బోధిస్తూ విద్యాలక్ష్మిగా, ఇంటిల్లిపాదికీ భోజనం పెడుతూ ధాన్యలక్ష్మిగా, కష్టాల్లో భర్తకి ధైర్యం చెబుతూ ధైర్యలక్ష్మిగా, కుటుంబం పేరు నిలిపేలా సంతానాన్ని తీర్చిదిద్దుతూ సంతానలక్ష్మిగా, భర్త సాధించే విజయానికి మూలకారణంగా ఉంటూ విజయలక్ష్మిగా… అన్ని రూపాల్లో తానే అయి సంసారాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యతను మహిళలకు లక్ష్మీదేవి అలంకారాలు గుర్తు చేస్తాయి.

andhrapradesh, vijayawada news, indrakeeladri, dusshera in indrakeeledri, bejawada kanakdurga, durgamma, indrakeeladri news
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం


తన ఓర్పు, నేర్పుతో ఈ విజయాలన్నీ సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది వీటి అంతరార్థం. లోకస్థితికారిణిగా.. ధన, ధ్యాన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజ లక్ష్మీలుగా వరాలు ప్రసా దించే అష్టలక్ష్మీ సమష్టిరూపమైన అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ మహాలక్ష్మీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీ మహా లక్ష్మీ స్వరూపంలో అమ్మవారిని దర్శించటం వల్ల భక్తులందరికీ ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 10:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading