హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Nag Panchami 2022: నాగ పంచమిని ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Nag Panchami 2022: నాగ పంచమిని ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?

నాగుల పంచమి (ప్రతీకాత్మక చిత్రం)

నాగుల పంచమి (ప్రతీకాత్మక చిత్రం)

Nag Panchami: శాస్త్రాల ప్రకారం.. నాగ పంచమి నాడు ఉపవాసం చేయాలి. అలాగే నాగ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.

    హిందూ సంప్రదాయాల్లో నాగ పంచమి (Nag Panchami) పండగకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్ల పంచమిని నాగుల పంచమిగా జరుపుకుంటారు. ఈసారి ఆగస్టు 2న నాగ పంచమి వచ్చింది. నాగ పంచమి రోజు మహిళలు నాగ దేవత ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. పుట్టలో పాలు పోస్తుంటారు. నాగ పంచమి ప్రాముఖ్యతను అనేక గ్రంథాల్లో కూడా వివరించారు. జ్యోతిష్యం దృష్ట్యా కూడా ఈ రోజులకు ఎంతో ప్రత్యేకత ఉంది. నాగ పంచమి రోజున పూజలు చేస్తే.. కాలసర్ప దోషం (Kala Sarpa Dosha) తొలగిపోతుందని పురాణాల్లో చెప్పారు. జాతకంలో కాల సర్ప దోషం, రాహు దోషాలు ఉన్న వారు.. నాగపంచమి రోజున శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేస్తారు. శివుడికి అభిషేకం చేసిన తర్వాత.. నాగదేవతను పూజిస్తే.. జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. మరి నాగ పంచమి పండగ చరిత్ర ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

    Shiva temples : విదేశాలలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు

    పురాణాల ప్రకారం.. నాగ పంచమి కథ కృష్ణుడితో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి బంతి ఆట ఆడుకుంటుండగా .. బంతి నదిలో పడింది. ఐతే ఆ నదిలో కాళీయ నాగ్ ఉంటాడు. ఆ విషయం తెలియక శ్రీకృష్ణుడు బంతి కోసం నదిలోకి దూకుతాడు. నదిలోకి వచ్చిన కృష్ణుడిపై కాళీయ నాగు దాడి చేస్తుంది. కానీ శ్రీకృష్ణుడు దానిని ఎదుర్కొని.. గట్టి గుణపాఠం చెబుతాడు. ఆ తర్వాత కాళీయ నాగు శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్పింది. ఇకపై ఎవరికీ హాని చేయబోనని హామీ ఇస్తుంది. కాళీయ నాగుపై కృష్ణుడు సాధించిన విజయాన్ని నాగ పంచమిగా జరుపుకుంటారు.

    ఈ మొక్క అన్ని వాస్తుదోషాలకు సరైన పరిష్కారం.. నాటడానికి సరైన దిశను తెలుసుకోండి

    స్కంద పురాణంలో నాగ పంచమి విశిష్టతను పరమ శివుడు కూడా వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఓ వరం కోరుకోమని అడుగుతాడట. తాము ఉద్బవించిన పంచమి రోజు నాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ఆదిశేషుడు కోరుకుంటాడ. ఆదిశేషుని కోరికని మన్నించిన విష్ణుదేవుడు... శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారట. అప్పటి నుంచీ శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమిని నాగుల పంచమిగా జరుపుకుంటున్నారు.

    నాగుల పంచమి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు?

    శాస్త్రాల ప్రకారం.. నాగ పంచమి నాడు ఉపవాసం చేయాలి. అలాగే నాగ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటి వెలుపల పాము చిత్రపటాన్ని ఉంచితే ఆ కుటుంబంపై నాగ దేవత ఆశీర్వాదం ఉంటుంది. నాగ పంచమి రోజున సూది దారం ఉపయోగించకూడదు. ఇనుప పాత్రలలో ఆహారాన్ని వండకూడదు. అలా చేస్తే అశుభాలు కలుగుతాయట. పాములను చంపకూడదు. ఎక్కడైనా పాము కనిపిస్తే వదిలివేయాలి తప్ప.. ఎలాంటి ఇబ్బది కలిగించకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో రాహువు, కేతువులు అశుభంగా ఉంటే.. పాములను పూజించాలి. ఈ రోజున నాగదేవతకు పాలు నైవేద్యంగా పెట్టేటప్పుడు ఇత్తడి పాత్రలను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల రాహు, కేతువుల దోషాలు తొలగిపోతాయి.

    (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Nag Panchami 2022

    ఉత్తమ కథలు