• Home
 • »
 • News
 • »
 • astrology
 • »
 • MONTHLY HOROSCOPE TODAY OCTOBER2020 HOROSCOPE RAASI PHALALU ASTRO PREDICTIONS IN TELUGU SK

Monthly horoscope: అక్టోబరు రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు..?

ప్రతీకాత్మక చిత్రం

Horoscope | 12 రాశుల వారికి ఈ నెల (అక్టోబరు 1 నుంచి అక్టోబరు 31 వరకు) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • Share this:
  అక్టోబర్‌ 1 నుంచి 31, 2020 వరకు రాశిఫలాలు:

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఈ నెలంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం కొనుగోలుకు అగ్రీమెంట్ చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటి నిర్వహణ విషయంలో సతీమణితో విభేదించడం సమంజసం కాదు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నష్టపోతారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుటుంది. దూరపు బంధువుకు సంబంధించి దుర్వార్త వింటారు.
  సంతానం కలిగే అవకాశముంది.

  వృషభం (కృ త్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

  ఈ నెలంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంది. ఇతర స్త్రీతో
  పరిచయం పెంచుకోవడం ఇంటికి, ఒంటికి మంచిది కాదు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.


  మిధునం (మృ గశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

  అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీదు ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా
  పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు సన్నిహితుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సంతాన నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు అందుతుంది. కుటుంబంలో బాధ్యత పెరుగుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు సామాజిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు.

  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

  ఈ నెలలో బంధువులతో కీడు ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి ఉన్న వారిలో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సాహిత్యం మీద ఇష్టం పెంచుకుంటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు సన్నిహితులో, ఎవరు శత్రువులో తెలుసుకొని మెలగండి. మీకు రహస్య శత్రువులు తయారవుతారు. ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పు, చేర్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు
  ఇంటికి వచ్చి రెండు రోజులుండే సూచనున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది.

  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

  ఆశించిన పనున్నీ దాదాపు పూర్తవుతాయి. సుఖ సంతోషాల్లో మునిగి తేలుతారు. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కలిసి విహార యాత్రకు వెళతారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. భార్య తరపు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. పమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ, వ్యవసాయ, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

  కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

  గ్రహాల సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందున ఈ నెల మిశ్రమ ఫలితాలు, అనుభవాలు ఎదురవుతాయి. వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. విదేశా నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్యమధ్యలో అనారోగ్య సమస్యలు రావచ్చు. తరచూ శివార్చన చేయండి. సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా
  సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారు మెప్పు పొందుతారు. సహోద్యోగులో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు.

  తులా (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

  ఈ నెల అన్ని విధాలా అనుకూంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్లకు చాలా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పు చోటు చేసుకుంటాయి. సన్నిహితులకు పార్టీ ఇస్తారు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళిక వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. సన్నిహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థు పురోగతి చెందుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారుకు, ల
  అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారంలో గెలవచ్చు.

  వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

  ఈ నెల అన్ని విధాలా అనుకూంగా ఉంది. చిన్న చిన్న సమస్యను భూతద్దంలో చూడడం, అతిగా ఆలోచించడం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. జీవితంలో పైరి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నిస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు బాగుంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక రంగాల్లో ఉన్న వారికి అనుకూల సమయం.
  ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

  ధనస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1)
  శని కారణంగా ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తుంటాయి. ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే
  సూచనలున్నాయి. మీ తల్లితండ్లరు నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యం తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి . శ్రమ మీద పను పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది.

  మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

  శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిరగడం వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. గత 23 నుంచి రాహు, కేతువు అనుకూలంగా మారినందు వలన ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణుకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణుకు ఉన్నత పదవు భించే అవకాశం ఉంది. ఇళ్ల స్థలం కొనుగోలు చేసే అవకాశముంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్లు, గోపురాలను సందర్శిస్తారు.

  కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  శని ఉన్నప్పటికీ, రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ
  సూచనలున్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూమైన సమాచారం అందుతుంది. అప్పు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో
  ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)

  ఈ నెల అన్ని విధాలా అనుకూంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ప్రేమలో ఉన్న వారు పురోగతి సాధించే అవకాశముంది. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాలో ఉన్నవారికి సమయం అనుకూంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.
  Published by:Shiva Kumar Addula
  First published: