Monthly Horoscope: మాస ఫలాలు. సెప్టెంబర్ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

Horoscope: మాస ఫలాలు

Monthly Horoscope: 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. జ్యోతిష పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు దిన ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఇంత వరకు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ప్రయోజం పొందుతారు. ఈ నెలంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. గురువు వ్యవ సంచారం కారాణంగా స్థాన చలనానికి అవకాశం ఉంది. తిప్పట ఎక్కువ ఉన్నా, పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. చాలావరకు అప్పులు తీరుస్తారు. పొదుపు చర్యలు కూడా చేపడతారు. వివాహ సంబంధం కుదురుతంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులు, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వృతి, వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారంలో కొద్దిగా ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. వృతి నిపుణులకు పోటీ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానిక లోటు ఉండదు కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇంటిగానీ, స్థలం కానీ కొనాలని ఆలోచిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. అవసరం పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూరం ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్న వారు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉన్న కారణంగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్ధిక లాభం, ఆకస్మిక ధన లాభం, రుణ బాధ నివృత్తి వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయానికి సంబంధఇంచి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్‌లో పెరుగుదల వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అయితే అష్టమ శని కారణాం ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి, మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగం నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. సొంత నిర్ణయాలతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకోండి. హామీ ఉండవద్దు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యాపారంలోనూ, వృత్తిలోనూ శ్రద్ధను, శ్రమను పెంచుకోవాల్సి ఉంటుంది. ఇక శని సంచారం కారణంగా మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అనవసర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించినంతగా పురోగతి కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం అన్న విధాలా బాగుంది.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చక్కబడాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపార ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగుల మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లుగానీ, స్థలంగానీ కొనే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. ఈ నెల చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఉద్యోగ సంస్థలో కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడితే గానీ ప్రయోజంన ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో మరో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    గ్రహ సంచారం, పూర్తిస్థాయిలో అనుకూలంగా లేకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వృతి, వ్యాపార, ఉద్యోగ రంగాలవారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ఆదాయంలోను, లాభాలలోనూ పెరుగుదల, ఎదుగుదల కనిపించవు. సమస్యల పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరితోనూ వాదవివాదాలకు దిగవద్దు. కోర్టు కేసు వాయిదా పడుతుంది. మొత్తం మీద మీకు ఈ నెలంతా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చు. ఆరోగ్యం ఫర్వాలేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానికి సంబంధించి శుభవార్త వింటారు. స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు గానీ, తీర్థయాత్రలకు గానీ ప్రణాళికలు వేసుకుంటారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్నేహితుల్లో ఒకరు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలాగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా బాగా కలిసి వచ్చే సమయం.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగుల కంటే వృతి వ్యాపారాల వారికి అన్ని విధాల బాగుంది. చిన్న వ్యాపారులు కూడా అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మొత్తం మీద ఆర్థిక పురోగతి ఉంటుంది. వృతి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సంతానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్థాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శని సంచారం కారణంగా మధ్య మధ్యలో అనారోగ్య బాధలు, అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. స్వయం ఉపాధివారు ప్రయోజనం పొందుతారు. ఐటీ వారికి సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. అనవసరం పరిచయాలకు దూరంగా ఉండండి.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఈ నెలంతా హాయిగా, ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఇల్లు మారే ఆలోచన చేస్తారు. ఇల్లుగానీ, స్థలంకానీ కొనాలని ప్రయత్నిస్తారు. మొత్తం మీద జీవితం ఒక మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. అనుభవానికి వస్తాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి అనూహ్యంగా సత్ఫలితాలు సాధిస్తారు.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని కార్యరూపంలో పెడితే మున్ముందు సత్ఫలితాలనిస్తాయి. మొత్తం మీద ఈ నెలలో సరికొత్త నిర్ణయాలు, ఆలోచనలతో కార్యశూరులవుతారు. తెగించి కొన్ని మంచి పనులు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తుకు బాట వేస్తాయి. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృతి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటకి వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఇంజినీర్లు, ఐటీ నిపుణులకు బాగుంటుంది. హామీలు ఉండవద్దు.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఈ నెలలో ఆదాయం నిలకడగా ఉంటుంది. దాదాపు ప్రశాంతంగానే గడిచిపోతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అంది కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు వంటివి చోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పెరగడానికి, పలుకుబడి కలిగిన వాళ్లతో పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. ఇక అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నా, తలచిన పనుల్లో కొన్నింటిని పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యుల సహాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. సైన్స్,ఐటీ, విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. వ్యాపార రంగంలో లాభాలకు అవకాశం ఉంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగానే గడిచిపోతుంది. వృతి, వ్యాపారాలను విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారులు అధిక లాభాలను చవి చూసే అవకాశం ఉంది. సంతానం కలుగుతుంది. దూరం ప్రాంతంలో ఉన్న సంతానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనే ఆలోచన పెట్టుకోవద్దు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువులతో అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి సొంత ఊరులోనే ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులుశ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఇంజినీర్లు, వృత్తి నిపుణులను, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏడ్చే రాశులు.. వీరికి కన్నీరు అస్సలు ఆగదు

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    గ్రహ సంచరాం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రావాల్సిన డబ్బు సరైన సమయానికి చేతికి అందుతుంది. రుణ బాధ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యాల మీద భారీగా ఖర్చవుతుంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచింది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ.. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం, ఇంజినీర్లకు, డాక్టర్లకు, ఐటీ నిపుణులకు పని ఒత్తిడి అధికంగా టుంది. వ్యాపారులు, స్వయం ఉపాధివారు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫర్వాలేదు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ది. కోర్టు కేసు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: