హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology:ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం.. డబ్బే డబ్బు..

Money Astrology:ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ అనుకోని అదృష్టం.. డబ్బే డబ్బు..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 30వ తేదీ మంగళవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్‌డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 30వ తేదీ మంగళవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం

అపరిచితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తుల సలహాతో పెట్టుబడి పెట్టకండి లేదంటే నష్టపోతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో విభేదాలు ఉండవచ్చు. ఇంట్లో శుభ కార్యాలపై చర్చలు జరుగుతాయి.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: తెలుపు

పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

* వృషభం

ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. పని, ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివాదాలు ఈరోజు పరిష్కారమవుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించవచ్చు. ఆస్తి విషయంలో కుటుంబీకులు, చుట్టుపక్కల వారు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు.

అదృష్ట సంఖ్య: 0

అదృష్ట రంగు: నలుపు

పరిహారం: మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.

* మిథునం

ఆర్థిక పరంగా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు రోజంతా లాభాల కోసం అవకాశాలను పొందుతారు. అలాగే ఈరోజు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబంలో శాంతి, స్థిరత్వాన్ని ఆనందించండి.

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట రంగు: లైట్ బ్లూ

పరిహారం: సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా 7 సార్లు పఠించండి.

* కర్కాటకం

ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకండి; నష్టపోయే అవకాశం ఉంది. కొందరు తమ కోసం కొంత డబ్బు ఏర్పాటు చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబంలో ఆందోళన వాతావరణం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట రంగు: ఎరుపు

పరిహారం: బంధీగా ఉన్న పక్షులను విడిపించండి.

* సింహం

ఈ రోజు భాగస్వామ్యంతో చేసే వ్యాపారం చాలా లాభిస్తుంది. రోజువారీ ఇంటి పనులను నిర్వహించేందుకు ఈరోజు మీకు సువర్ణావకాశం ఉంది. ఈ రోజు మీ పిల్లల విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: ఫిరౌజీ

పరిహారం: గణేశుడికి లడ్డూలు సమర్పించండి.

* కన్య

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాతావరణ మార్పు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వ్యాపార పరంగా ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. తొందరపాటు పనులు మానుకోండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట రంగు: ఊదా

* తుల

ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది, రిస్క్ తీసుకోవడం వల్ల లాభాలు వస్తాయి. ఓర్పు, మీ మృదువైన ప్రవర్తనతో సమస్యలను సరిదిద్దవచ్చు. ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే అవకాశం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: తల్లికి ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి.

* వృశ్చికం

ముఖ్యమైన నిర్ణయాలను పెండింగ్‌లో ఉంచవద్దు. శ్రేయోభిలాషుల సలహాలను గౌరవించండి. ఆర్థిక విషయాలలో క్రియాశీలకంగా ఉండండి. సామరస్యంగా పని చేస్తే ఊహించని లాభాలు పొందవచ్చు. బడ్జెట్‌ ప్రకారం ఖర్చు చేయాలి.

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట రంగు: గ్రే

పరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించండి.

* ధనుస్సు

అదృష్టం బలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ముందుకు సాగుతారు. లాభాలు, ధన ప్రభావం పెరుగుతుంది. బెస్ట్ బ్యాలెన్స్ మీ సొంతం. మెరుగైన లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటాయి. సహోద్యోగులు మిత్రులుగా ఉంటారు. రిస్క్ తీసుకోవడం పెరుగుతుంది. పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తారు.

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట రంగు: లేత ఎరుపు

పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

* మకరం

కృషి, అంకితభావంతో ఆఫీస్‌లో మీ స్థానాన్ని కాపాడుకుంటారు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: నీలం

పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయ సమర్పించండి.

* కుంభం

ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు దయచేసి మీ ప్రియమైన వారిని సంప్రదించండి. తొందరగా ఎవరినీ నమ్మవద్దు లేదంటే నష్టపోతారు. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి.

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రాన్ని నైవేద్యంగా పెట్టండి.

* మీనం

పెద్ద ప్రయత్నంతో పరిశ్రమ, వ్యాపారాలు బలపడతాయి. ప్రియమైన వారితో, ఉన్నతాధికారులతో సమావేశం కావచ్చు. ఇంట్లో కుటుంబం మద్దతు ఉంటుంది. భూమి నిర్మాణ విషయాల నుంచి ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: ఎరుపు

పరిహారం: చిన్న అమ్మాయిలకు ఖీర్ తినిపించండి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Money Astrology, Zodiac signs

ఉత్తమ కథలు