Home /News /astrology /

MONEY ASTROLOGY TODAY MONEY MANTRA FOR 5TH AUGUST THESE ZODIAC SIGNS HAVE A GOOD DAY AND THEIR LUCK BRINGS MONEY FLOW GH BMK SRD

Money Astrology: ధన జ్యోతిష్యం: ఈ రోజు వీరి అదృష్టం సంపదను తీసుకువస్తుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 5వ తేదీ శుక్రవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 5వ తేదీ శుక్రవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం : కష్టపడి పని చేయడం వల్ల మీకు డబ్బు రూపంలో ప్రతిఫలం లభిస్తుంది. గృహ ఖర్చులు పెరుగుతాయి. మీరు ఈరోజు స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇవ్వవలసి రావచ్చు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి సంతృప్తికరంగా ఉండదు.

* వృషభం : ఈ రోజు ఆదాయం పెరుగుతుంది. మీరు ఎక్కడి నుంచైనా బోనస్‌ను ఆశించవచ్చు. సుదూర పర్యటనకు సంబంధించిన ప్రణాళికతో డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాపారస్తులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

* మిథునం : వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు. ఆర్థికాభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సహకార, భాగస్వామ్య వ్యాపారాలు బాగా సాగుతాయి.

* కర్కాటకం : రోజువారీ బడ్జెట్ ఈరోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మంచి స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపార మూలధనం కోసం మీ ప్రణాళికలు బహుశా ఈ రోజు అమలు కావచ్చు. ప్రైవేట్ వ్యాపారాలు అంతగా సాగవు. రోజువారీ ఆదాయం దెబ్బతింటుంది.

* సింహం : వ్యాపారాల్లో ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఒక స్నేహితుడు అకస్మాత్తుగా మిమ్మల్ని డబ్బు అడగవచ్చు. మీ కెరీర్‌లో ఆర్థిక వృద్ధిని ఆశించవచ్చు. అన్నయ్య లేదా తండ్రి మీకు ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి.

* కన్య : డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక అపరిచితుడు ఆర్థిక నష్టాలకు దారి తీయవచ్చు. ప్రభుత్వ పథకం చాలా మంచి లాభాలను తీసుకురావడానికి మీకు సహాయం చేస్తుంది. రోజువారీ ఆర్థిక ఆదాయం దెబ్బతింటుంది. గృహ ఖర్చులు స్థిరంగా ఉంటాయి.

* తుల : వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకండి. భాగస్వామ్య వ్యాపారాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పూర్వీకుల ఆస్తి ఈరోజు అదృష్టం, సంపదను తెస్తుంది. మీరు ప్రభుత్వ సంబంధిత పనుల్లో నష్టాలను భరిస్తారు.

* వృశ్చికం : వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీ వల్ల పాత అప్పులు తీరుతాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒక మతపరమైన కార్యక్రమం కారణంగా మీకు డబ్బు ఖర్చు అవుతుంది. రోజువారీ ఆదాయం దెబ్బతింటుంది.

* ధనుస్సు : ఆదాయం బాగా పెరుగుతుంది. స్వల్ప పెట్టుబడులు పెట్టవచ్చు. కుటుంబ ఆదాయం కూడా ఈరోజు పెరుగుతుంది. కార్యాలయంలో ఆర్థికంగా నష్టాలు తప్పవు. అయితే మీకు జీతంలో ఇంక్రిమెంటేషన్ లభిస్తుంది. రోజువారీ ఆర్థిక ఆదాయం దెబ్బతింటుంది.

* మకరం : వ్యాపారంలో ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి. గృహ ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు సంపదను సృష్టిస్తారు. మీరు స్నేహితుడికి అప్పుగా ఇచ్చిన డబ్బు ఈ రోజు తిరిగి వస్తుంది.

* కుంభం : పెట్టుబడులకు వినియోగించే ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ ఖర్చులు చాలా స్థిరంగా ఉంటాయి. బ్యాంకులో నిలిచిపోయిన డబ్బు అలాగే ఉంటుంది. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది.

* మీనం : ఈరోజు మతపరమైన కార్యక్రమాలకు పెద్ద ఖర్చు అవుతుంది. స్నేహితుడితో కలిసి ప్రయాణం చేయడం వల్ల మీ డబ్బు చాలా వృథా అవుతుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రోజువారీ జీవితంలో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope, Money, Zodiac signs

తదుపరి వార్తలు