Home /News /astrology /

MONEY ASTROLOGY TODAY MONEY MANTRA FOR 4TH AUGUST THESE ZODIAC SIGNS SHOULD BE CAREFUL IN MONEY MATTERS GH BMK SRD

Money Astrology: ధన జ్యోతిష్యం.. అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 4వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 4వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం : వ్యాపారంలో ఈరోజు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు ఆర్థిక పరిస్థితుల గురించి మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తాయి. అప్పు ఇవ్వడం మానుకోండి.

* వృషభం : ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మంచి మూలధనాన్ని ఏర్పాటు చేసుకోగలరు. పూర్వీకుల ఆస్తిని దుర్వినియోగం చేయడం వల్ల నష్టాలు వస్తాయి. కుటుంబ ఖర్చులు స్థిరంగా ఉంటాయి.

* మిథునం : మీ వ్యాపారం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఈరోజు నష్టాలను చవిచూస్తాయి. ఆఫీస్‌లో మీ హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యుడు మిమ్మల్ని లాభాల వైపు నడిపిస్తారు. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి వస్తుంది.

* కర్కాటకం : మీకు విలువైన ఆస్తి వస్తుంది. భాగస్వామ్యాలు నష్టాలకు దారి తీస్తాయి. ప్రైవేట్ వ్యాపారాలు ఈరోజు బాగా సాగుతాయి. సన్నిహితులు ఎవరైనా మీకు ఆర్థికంగా నష్టాన్ని ఏర్పరచవచ్చు.

* సింహం : రోజువారీ ఆదాయం తగ్గుతుంది. ఆదాయ వనరులకు ఆటంకం ఏర్పడుతుంది. ఉద్యోగం ద్వారా మీ సంపాదన పెరుగుతుంది. గృహ ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుడి కారణంగా వ్యాపారంలో నష్టం రావచ్చు.

* కన్య : మీరు ఆఫీస్‌లో ఈరోజు అదనపు డబ్బు సంపాదిస్తారు. వ్యాపారంలో మూలధనం వృద్ధి చెందుతుంది. మంచి లాభాలు వస్తాయి. స్నేహితుడికి డబ్బు అప్పుగా ఇవ్వాల్సి రావచ్చు. వాహనం కొనుగోలుపై ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి సంబంధిత పనులు లాభిస్తాయి.

* తుల : ఆర్థిక పరంగా ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. కంపెనీలో ఆర్థిక సహాయాన్ని పొందుతారు. ప్రయాణాలకు ఖర్చు చేయవలసి రావచ్చు. పూర్వీకుల ఆస్తి మీకు లాభాలను తెస్తుంది.

* వృశ్చికం : ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈరోజు వ్యాపారం పురోగమిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు నష్టాలకు దారి తీస్తాయి. కుటుంబ సభ్యులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.

* ధనుస్సు : ఈరోజు ఊహించని విధంగా డబ్బు బాగా సంపాదిస్తారు. ప్రభుత్వ పథకం మీకు లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటి మరమ్మతులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

* మకరం : ఈ రోజు స్థిరాస్తి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అనవసర విషయాలకు కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవచ్చు. ఈరోజు నుంచి రోజువారీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

* కుంభం : రియల్ ఎస్టేట్ నుంచి లాభపడతారు. మాతృ కుటుంబం మిమ్మల్ని డబ్బు వైపు నడిపిస్తుంది. చిన్నచిన్న అప్పులు తీర్చుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

* మీనం : కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పు త్వరలో తిరిగి చెల్లించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆదాయం ఈరోజు బాగా ఉండదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Money, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు