Home /News /astrology /

MONEY ASTROLOGY TODAY MONEY MANTRA FOR 3RD AUGUST ACCORDING TO YOUR RASHI ZODIAC SIGN GH BMK MKS

Money Astrology Today: ధన జ్యోతిష్యం : ప్రేమ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆగస్టు 3వ తేదీ బుధవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)
Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 3వ తేదీ బుధవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

* మేషం : విదేశీ పెట్టుబడి ఏదైనా లాభదాయకంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారులు కూడా మంచి లాభాలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది.

* వృషభం : వ్యాపారం బాగా సాగుతుంది. వాణిజ్య సంబంధిత పనులు ఈరోజు నెరవేరుతాయి. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో ప్రయాణం ప్రధానంగా ఉంటుంది. తండ్రి నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు.

* మిథునం : మీరు మల్టినేషనల్‌ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి. ఈరోజు పెట్టిన పెట్టుబ‌డులు మీకు చాలా కాలం మేలు చేస్తాయి. మీరు ఈరోజు సన్నిహిత మిత్రునితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పూర్వీకుల ఆస్తి మీకు సంపదను తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* కర్కాటకం : మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. మెటల్ సంబంధిత వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈరోజు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కుటుంబ ఖర్చులు స్థిరంగా ఉంటాయి. అనవసర ప్రయాణాలు మీ బడ్జెట్‌కు భంగం కలిగిస్తాయి.

* సింహ రాశి : పరిశ్రమ యజమానులకు ఈ రోజు అదృష్టం కలిసిరాదు. మీరు ఈరోజు ఎలాంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టకూడదు. లేదంటే నష్టపోవాల్సి రావచ్చు. మీకు తెలిసిన ఒక మహిళ నుంచి సహాయం పొందవచ్చు. రోజు వారీ ఖర్చులు పెరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

* కన్య రాశి : యంత్రాల వ్యాపారులకు ఇది లాభదాయకమైన రోజు. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందగలుగుతారు. మీరు కార్యాలయంలో ఉద్యోగి అయితే కొత్త వెంచర్ ప్రారంభించాలని మీరు అనుకోవచ్చు. భూమికి సంబంధించిన పనులు ధన నష్టాన్ని కలిగిస్తాయి.

* తుల : మీ వ్యాపారం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు మీ కలల ఇంటిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతాయి. కుటుంబంతో సత్సంబంధాలు తగ్గుతాయి. గృహ ఖర్చులు పెరుగుతాయి.

* వృశ్చికం : ఈరోజు వృశ్చికరాశి వారికి ఆహార సంబంధిత వ్యాపారాలు మంచి లాభాలను ఆర్జిస్తాయి. ఈరోజు స్నేహితుడికి ఆర్థికంగా సహాయం చేయవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు గురించి కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక విబేధాల కారణంగా సన్నిహిత వ్యక్తితో మీ సంబంధం విడిపోవచ్చు.

* ధనుస్సు రాశి : మీరు ఈరోజు సన్నిహితుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. పెట్టుబడుల నుంచి నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. రోజువారీ ఆదాయం దెబ్బతింటుంది. ప్రైవేట్ వ్యాపారాలు కూడా ఈరోజు స్వల్ప నష్టాలను చవిచూడవచ్చు.

* మకరం : మీరు బట్టల వ్యాపారి అయితే ఈఈ రోజు చాలా లాభదాయకంగా ఉండకపోవచ్చు. ఈరోజు మైనర్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. తల్లి కుటుంబం వైపు నుంచి ఆర్థిక సహాయం పొందుతారు. మీ ఆదాయ వనరుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. ఈ రోజు సన్నిహితుల సహాయం నుంచి డబ్బును పొందవచ్చు.

* కుంభం : ఈ రోజు మీ జీవితంలోని ప్రేమ కోసం చాలా ఖర్చు చేస్తారు. కుటుంబ ఖర్చులు చాలా పెరుగుతాయి. సరైన జీవనోపాధి పొందడం కష్టమవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు బాగా సాగుతాయి. సన్నిహితులతో ఊహించని ప్రయాణం మీ బడ్జెట్‌కు అంతరాయం కలిగించవచ్చు.

* మీనం : ఈరోజు ఆదాయం చాలా సంతృప్తికరంగా ఉండదు. మీరు సన్నిహిత స్నేహితుడి నుంచి కూడా రుణం తీసుకోవలసి రావచ్చు. ప్రయాణం నష్టాలకు దారి తీస్తుంది, మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాపారంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Money, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు