హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology Today: ధన జ్యోతిష్యం : ఆదాయం, జీవన ప్రమాణం పెరుగుతాయి..

Money Astrology Today: ధన జ్యోతిష్యం : ఆదాయం, జీవన ప్రమాణం పెరుగుతాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా జులై 31వ తేదీ ఆదివారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 31వ తేదీ ఆదివారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం : మీరు ఖర్చులను నియంత్రించాలి. అవసరమైన వాటిపై మాత్రమే ఖర్చు చేయాలి. విలువైన వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యాలు లాభిస్తాయి.

వృషభం : కొత్త పనులు ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలం. ఆఫీస్ విషయాలతో కొంచెం కలవరపడవచ్చు. బాస్‌తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటలు, కోపాన్ని నియంత్రించుకోకపోవడం వల్ల మీరు కష్టాలు పడాల్సి వస్తుంది.

మిథునం : ఇంట్లో పాడైపోయిన వస్తువుల కారణంగా గృహ ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన పరిశీలన లేకుండా డబ్బును ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెట్టకండి.

కర్కాకటం : మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సి రావచ్చు. కానీ అన్ని ప్రయాణాలు ఫలవంతం కావు. పనిచేసే ప్రదేశంలో నిపుణులతో సవాళ్లు ఎదురవుతాయి. దీంతో మీరు సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.

సింహం : రోజువారీ ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక వృద్ధిని అనుభవిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది.

కన్య : న్యాయపరమైన కేసులు, వ్యాజ్యాలు పరిష్కారమవుతాయి. ఖర్చులు తగ్గుతాయి. మీరు పొదుపు - పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. మైనర్ లోన్‌లు ఏవైనా ఉంటే, మీరు వాటిని తిరిగి చెల్లించడంతో ఇబ్బందులు తొలగుతాయి.

తుల : వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఇతర రోజులతో పోలిస్తే ఆదాయం మెరుగ్గా ఉంటుంది. తద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం : సన్నిహితులతో కలిసి కొత్త వెంచర్‌ను ప్రారంభించవచ్చు. కార్యాలయంలో మీ కీర్తి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. ఆర్థిక స్థిరత్వం ఆశించవచ్చు.

ధనుస్సు : ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. జీవిత భాగస్వాములకు కూడా మంచి ఆదాయం ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల వల్ల ఖర్చు చేయాల్సి రావచ్చు.

మకరం : మీరు ఈరోజు నిరుపేదలకు తప్పకుండా సహాయం చేయాలి. అది మీకు తిరిగి వస్తుంది. మీకు సహాయం చేస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మీరు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.

కుంభం : మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే, ఈ రోజు గొప్ప అవకాశం పొందవచ్చు. కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో ఆటంకాలు సృష్టించే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.

మీనం : సామాజిక సేవ మీకు తెలిసిన వ్యక్తుల్లో మీపట్ల గౌరవాన్ని పెంచుతుంది. కార్యాలయంలో మార్పు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. జీవన ప్రమాణం పెరుగుతుంది.

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Money, Zodiac signs

ఉత్తమ కథలు