Home /News /astrology /

MONEY ASTROLOGY TODAY MONEY MANTRA FOR 2ND AUGUST ACCORDING TO YOUR RASHI ZODIAC SIGN GH BMK MKS

Money Astrology Today: ధన జ్యోతిష్యం : ఊహించని పరిస్థితులతో డబ్బు పొందుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆగస్టు 2వ తేదీ మంగళవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)
Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 2వ తేదీ మంగళవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

* మేషం : ఈరోజు వ్యాపారాలు నష్టాలను చవిచూడవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలపై ఖర్చు చేయడం మానుకోండి. అలాగే, ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి.

* వృషభం : ఈరోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారంలో పొదుపు, ఆదాయం పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తులను దుర్వినియోగం చేయడం వల్ల నష్టాలు తప్పవు. ఇంటి ఖర్చులు తక్కువగా ఉంటాయి.

* మిథునం : మీరు వ్యాపారంలో ఆర్థిక వృద్ధిని చూస్తారు. అయితే, భాగస్వామ్యాలు ప్రతికూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులకు అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు తిరిగి వస్తుంది.

* కర్కాటకం : చాలా విలువైన ఆస్తి మీకు వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. ఆఫీస్‌లో పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ వ్యాపారాలు చాలా బాగా సాగుతాయి.

* సింహం : రోజువారీ ఆదాయం తగ్గుతుంది. ఆదాయ వనరులకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఆఫీసు ఉద్యోగాలకు జీతం పెరగవచ్చు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో సన్నిహిత వ్యక్తి మీకు హాని చేయవచ్చు.

* కన్య : మీరు ఆఫీస్‌లో అదనపు ఆదాయానికి అవకాశాలను పొందవచ్చు. వ్యాపారాలు ఆర్థికంగా లాభిస్తాయి. మీరు సన్నిహిత వ్యక్తికి డబ్బు అప్పుగా ఇవ్వాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన పనులు మీకు సంపదను తెస్తాయి.

* తుల : ఈరోజు ఆర్థిక పరంగా చాలా శుభప్రదమైనది. మీరు ఆఫీస్‌లో మానసిక, ఆర్థిక సహాయాన్ని పొందుతారు. పూర్వీకుల ఆస్తి మీకు ఊహించని లాభాలను తెస్తుంది.

* వృశ్చికం : మీరు స్వల్ప ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారం మంచి ఆదాయాన్ని తెస్తుంది. భాగస్వామ్యాలు హానికరం. మీ కుటుంబం మీకు ఆర్థికంగా సహకరిస్తుంది.

* ధనుస్సు : ఊహించని పరిస్థితులు ఈరోజు మీకు మంచి డబ్బు సంపాదించడానికి సహాయపడతాయి. ప్రభుత్వ పథకం మీకు ప్రయోజనకరంగా మారుతుంది. తప్పుడు పెట్టుబడులతో నష్టాన్ని చవిచూడవచ్చు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

* మకరం : మీ నిధులను భూమి లేదా రియల్ ఎస్టేట్‌పై ఉపయోగించాల్సి ఉంటుంది. పొదుపు చేసిన డబ్బు అనవసరమైన పనులకు ఖర్చు అవుతుంది. మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

* కుంభం : తల్లి కుటుంబం మీకు ఆర్థికంగా మార్గదర్శకంగా ఉంటుంది. మీరు ఈ రోజు చిన్న రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఉంటారు. అంతకుముందు వ్యాపారంలో వచ్చిన నష్టాలను కూడా మీరు అధిగమిస్తారు.

* మీనం : కుటుంబ ఖర్చులు పెరగవచ్చు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అప్పు తీర్చవచ్చు. వ్యాపారంలో రోజువారీ ఆదాయం తగ్గుతుంది. అనవసర ఖర్చుల వల్ల డబ్బు వృథా అవుతుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Money, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు