హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology Today: ధన జ్యోతిష్యం: ఆస్తుల విషయంలో జాగ్రత్త.. కుటుంబ సభ్యులతో వివాదాలు రావొచ్చు..

Money Astrology Today: ధన జ్యోతిష్యం: ఆస్తుల విషయంలో జాగ్రత్త.. కుటుంబ సభ్యులతో వివాదాలు రావొచ్చు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 28వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 28వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం : రోజువారీ ఆదాయం ఈరోజు ప్రభావితం అవుతుంది. మీరు అనవసరమైన ఖర్చులలో మునిగిపోతారు. వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు చాలా కష్టపడాలి. కుటుంబ ఖర్చులు స్థిరంగా ఉంటాయి.

* వృషభం : ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు పొదుపు కోసం పెట్టుబడి పెట్టడాన్ని పరిగణలోకి తీసుకోండి. ప్రైవేట్ వ్యాపారాలు మీకు లాభాలను తీసుకురావచ్చు. మీ ప్రమోషన్ గురించి ఆఫీస్‌లో ఉన్నతాధికారులతో చర్చించవచ్చు.

* మిథునం : వ్యాపారం న్యాయ వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. అయితే, కేసు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మీ తోబుట్టువులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

* కర్కాటకం : బిల్లు చెల్లింపులు కొంత నష్టానికి దారి తీస్తాయి. అనవసర ప్రయాణాల వల్ల డబ్బు వృథా అవుతుంది. బ్యాంకు సంబంధిత పనులు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు స్థిరంగా ఉంటాయి.

* సింహం : లాభాలు పొందడానికి కుటుంబ కట్టుబాట్లు సహాయపడవచ్చు. తల్లి కుటుంబం కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తుంది. ఆర్థిక బడ్జెట్ క్షీణిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉండదు.

* కన్య : వ్యాపారంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి. అనవసర ప్రయాణం వల్ల డబ్బు వృథా అవుతుంది. ఆర్థిక అస్థిరత కారణంగా కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రమేయం లాభదాయకంగా ఉంటుంది.

* తుల : ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేసినందుకు మీరు చింతించవచ్చు. వైవాహిక జీవితంలో ఖర్చులు పెరగవచ్చు. వ్యాపారంలో అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది.

* వృశ్చికం : వ్యాపార ప్రయాణాలు ఆర్థిక నష్టాలకు దారి తీస్తాయి. రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది. గృహ ఖర్చులు చాలా స్థిరంగా ఉంటాయి. పూర్వీకుల ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

* ధనుస్సు : ఆర్థిక సంబంధ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ వ్యాపార ఉద్యోగులకు వేతనాల పెంపు ఉంటుంది. రోజువారీ ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు. ఇది వివాదాలకు దారితీయవచ్చు.

* కుంభం : మీరు వ్యాపారంలో ఈరోజు ఆర్థిక స్థిరత్వాన్ని అనుభవిస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు ఫైనాన్స్ విషయంలో కీలక నిర్ణయానికి దూరంగా ఉండండి. ఈరోజు అనవసరమైన ఇంటి ఖర్చులు ఉండవచ్చు.

* మీనం : ఈ రోజు డబ్బు ఆదా చేయడం చాలా కష్టం. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాల కారణంగా రోజువారీ ఆదాయం దెబ్బతింటుంది. మీరు ఆస్తి కొనుగోలులో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు