హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology Today: ధన జ్యోతిష్యం : జీవిత భాగస్వాముల వల్ల ఖర్చులు పెరుగుతాయి..

Money Astrology Today: ధన జ్యోతిష్యం : జీవిత భాగస్వాముల వల్ల ఖర్చులు పెరుగుతాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా జులై 27వ తేదీ బుధవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 27వ తేదీ బుధవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం : రోజువారీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ పిల్లల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా గొప్ప ప్రారంభం అవుతుంది. వ్యాపారాలు ఈరోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి.

వృషభం : కుటుంబ సభ్యుడు మీకు ఆర్థికంగా అదృష్టాన్ని తెస్తారు. భాగస్వామ్య లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని మీరు భావించవచ్చు. బీమా మీకు ఆర్థికంగా సహాయ పడవచ్చు.

మిథునం : కుటుంబ విహారయాత్రలు ఎజెండాలో ఉంటాయి. అది ఖర్చులకు దారి తీస్తుంది. ఈరోజు పొదుపు కోసం మంచి అవకాశాలను పొందుతారు. ఈరోజు హౌస్ రెన్నొవేషన్‌కు డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.

కర్కాటకం : పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. మీ ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. వ్యాపారాలు ఆదాయంలో స్థిరత్వాన్ని పొందుతాయి. గృహ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

సింహం : భాగస్వామ్య వ్యాపారాలు మంచి ఆదాయానికి దారి తీస్తాయి. కష్టపడి పనిచేసే ఉద్యోగులకు ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు.

కన్య : ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. ప్రయాణాల్లో డబ్బును వృథా చేసే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం ఖర్చులకు దారి తీస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు అవసరం కావచ్చు. అది లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చెదిరిన కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు.

తుల : వ్యాపారాల్లో ఆదాయ వనరులు పెరుగుతాయి. ఫీల్డ్ వర్క్ లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కాలక్రమేణా ఆఫీసుల్లో పని చేయడం వల్ల మీకు మంచి ప్రతిఫలం లభిస్తుంది.

వృశ్చికం : జీతంలో పెరుగుదల మీకు సాధ్యమే. అయితే కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు వ్యాపారంలో నష్టాలను చవి చూడాల్సి రావచ్చు. ఊహించని పరిస్థితులు మీకు మంచి డబ్బు సంపాదించేలా చేస్తాయి. పెట్టుబడిగా పెట్టిన డబ్బు లాభాలను తెస్తుంది.

ధనుస్సు : కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. పరిచయస్తుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. వ్యాపారాభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలమైనది. వాహనాల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు.

మకరం : విద్యార్థులకు వారి తండ్రుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. కుటుంబాలు ఆర్థికంగా మెరుగవుతాయి. రోజువారీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులకు ఖర్చులు పెరుగుతాయి.

కుంభం : పని కోసం చేసే ప్రయాణం మీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. అయితే, ఆర్థిక పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వాహన మరమ్మతులకు డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది.

మీనం : ఈరోజే భవిష్యత్తు కోసం పెట్టుబడి, పొదుపు ప్రణాళికలను రూపొందించడానికి ప్రయత్నించండి. వ్యాపారాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వాముల వల్ల ఖర్చులు పెరుగుతాయి. మీరు ఈరోజు పాత అప్పులను తిరిగి చెల్లించే స్థితిలో ఉంటారు.

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Money, Zodiac signs

ఉత్తమ కథలు