హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology Today: ధన జ్యోతిష్యం : అత్తమామల నుంచి లాభాలు పొందుతారు..

Money Astrology Today: ధన జ్యోతిష్యం : అత్తమామల నుంచి లాభాలు పొందుతారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించి జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 18వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Money Astrology (ధన జ్యోతిష్యం) : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించి జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. జులై 18వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

మేషం: ఈ రోజు శుభదినం. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి సపోర్ట్, సాంగత్యాన్ని పొందుతారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. టూర్స్‌, ట్రావెల్‌ బిజినెస్‌కు కలిసి వస్తుంది. రివార్డ్‌లు అందుతాయి. అత్తమామల నుంచి లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

వృషభం: ఈరోజు మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు కుటుంబం, వ్యాపారం నుంచి లాభాలను పొందుతారు. పాలక యంత్రాంగం నుంచి సహాయం అందుతుంది. మీరు ఇతరుల నుంచి సహకారం పొందుతారు. మీరు ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యతను కలిగి ఉంటే, అదృష్టం మీకు సపోర్ట్‌ చేస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.

మిథునం: అదృష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. హౌస్‌ హోల్డ్‌ ఐటమ్స్‌ సంఖ్య పెరుగుతుంది. సంపద, హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. వృథా ఖర్చులను నియంత్రించండి. ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. అన్‌ప్లెజంట్‌ వార్తలు వినాల్సి వస్తుంది.

కర్కాటకం: ఈ రోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎంప్లాయ్‌మెంట్‌ దిశలో విజయం సాధిస్తారు. సోదరులు, పొరుగువారితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. డైట్ విషయంలో ఓపికగా ఉండండి. ప్రయాణించేటప్పుడు మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి. దొంగతనం లేదా నష్టపోయే ప్రమాదం ఉంది.

సింహం: రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రణాళిక ఊపందుకుంటుంది. బహుమతులు, గౌరవం ప్రయోజనకరంగా ఉంటుంది. సందర్శిస్తున్న దేశం పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. రొమాంటిక్‌ రిలేషన్స్‌ బలంగా ఉంటాయి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్య: మీకు ఆనందం, శ్రేయస్సుతో నిండిన రోజు. విద్యకు సంబంధించిన పోటీలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువును పొందాలనే కోరిక నెరవేరుతుంది. ఆదాయం, వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడుకోండి. ధనం లాభదాయకంగా ఉంటుంది.

తుల: ఆర్థిక, వ్యాపార దిశలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఐశ్వర్యం, గౌరవం, కీర్తి పెరుగుతాయి. ఆరోగ్యంలో మందగమనం ఉంటుంది. రాయల్‌ ఎక్స్‌పెండిచర్‌ నియంత్రించండి. మతపరమైన ధోరణులు పెరుగుతాయి.

వృశ్చికం: ఈరోజు మీకు మంచి రోజు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. రాజకీయ ఆశయం నెరవేరుతుంది. మీరు కొత్త ఒప్పందాలు పొందుతారు. సందర్శిస్తున్న దేశం పరిస్థితి ఆహ్లాదకరంగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు: అదృష్టం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ దిశలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల సహకారం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. ఆరోగ్యంలో అలసత్వం ఉంటుంది. డబ్బు ఉంటుంది, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది.

మకరం: ఈరోజు ఆహ్లాదకరమైన రోజు. వృత్తిరీత్యా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. శృంగార సంబంధాలు బలంగా ఉంటాయి. జాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయాలి.

కుంభం: జీవిత భాగస్వామి ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం. వృథా ఖర్చులను నియంత్రించండి. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. అనేక అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రత్యర్థులు ఓడిపోతారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది.

మీనం: విద్యా సంబంధ పోటీలలో విశేష విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కంటికి సంబంధించిన రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. మృదువుగా మాట్లాడటం వల్ల మీకు గౌరవం లభిస్తుంది. హడావిడి ఉంటుంది, ఈ రోజు మీకు అదృష్టం సపోర్ట్‌ చేస్తుంది.

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Money

ఉత్తమ కథలు