హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology : ధన జ్యోతిష్యం: ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు.. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.. డబ్బు విషయంలో తిరుగుం

Money Astrology : ధన జ్యోతిష్యం: ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు.. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి.. డబ్బు విషయంలో తిరుగుం

ధన జ్యోతిష్యం  ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology : ధన జ్యోతిష్యం | నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 14వ తేదీ ఆదివారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology | ధన జ్యోతిష్యం: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 14వ తేదీ ఆదివారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేష రాశి

ధనలాభం కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీకు గౌరవం లభిస్తుంది. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. విద్యా రంగంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో భాగస్వామి మద్దతు లభిస్తుంది.

అదృష్ట సంఖ్య : 1

అదృష్ట రంగు - పింక్

పరిహారం- పేదవాడికి అన్నదానం చేయండి.

* వృషభ రాశి

కుటుంబ సంబంధిత పనులు పూర్తి చేస్తారు. మాటల్లో అహం చూపడం మానుకోండి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ట్రావెలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీని వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

అదృష్ట సంఖ్య : 1

అదృష్ట రంగు - ఓచర్

పరిహారం- శివునికి నీటితో అభిషేకం చేయండి.

* మిథున రాశి

నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. డబ్బు సంపాదించాలంటే శ్రమ పెరగాలి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఫ్యామిలీ లైఫ్‌లో పోరాటం తప్పదు.

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట రంగు - నారింజ

పరిహారం- ఆంజనేయుడికి హారతి ఇవ్వండి.

* కర్కాటక రాశి

ఆకస్మిక ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి చికాకు కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్త అందుకుంటారు. బంధువులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. లవ్ లైఫ్‌లో కొత్త ఆనందాన్ని పొందవచ్చు.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు- ఎరుపు

పరిహారం- హనుమాన్ చాలీసా పఠించండి.

* సింహ రాశి

చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. పూర్తి ఉత్సాహంతో పని చేయండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి, అప్పుడు మాత్రమే లాభం సాధ్యమవుతుంది లేదా మీరు నష్టపోవాల్సి రావచ్చు. మీరు కుటుంబం నుంచి మద్దతు పొందుతారు.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: బాదామి

నివారణ- ఆవుకు రొట్టె తినిపించండి.

* కన్య రాశి

సౌకర్యాలపై ఖర్చులు పెరుగుతాయి, దీని కారణంగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియని వ్యక్తులను కలుస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి లాభాలు ఉంటాయి. లవ్ రిలేషన్‌షిప్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట రంగు: తెలుపు

పరిహారం- పేదవాడికి అన్నదానం చేయండి.

* తులా రాశి

ధన లాభాలకు అవకాశం బలంగా ఉంది. కష్టపడిన డబ్బు చేతికి అంది వస్తుంది.  మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఫీల్డ్‌లో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రవర్తనలో కోపాన్ని ప్రదర్శించడం నష్టానికి దారి తీస్తుంది. కుటుంబంతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 10

అదృష్ట రంగు: లేత ఎరుపు

పరిహారం- పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.

* వృశ్చిక రాశి

కెరీర్‌ గ్రోత్‌కు అవకాశాలు ఉంటాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సమయం ఇది. మీరు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. లవర్ విషయంలో మనసులో కొంత సందేహం రావచ్చు.

అదృష్ట సంఖ్య : 3

అదృష్ట రంగు: నారింజ

పరిహారం- సుందరకాండ పఠించండి.

* ధనుస్సు రాశి

అదృష్టం మీకు సపోర్ట్‌గా ఉంటుంది, డబ్బు కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థానచలనం (రీలొకేషన్) లాభిస్తుంది. బంధువులతో సంబంధాలు బలంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట రంగు: కుంకుమపువ్వు

పరిహారం- పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.

* మకర రాశి

విద్యకు సంబంధించిన పనులు లాభిస్తాయి. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ ప్రసంగంలో మర్యాదగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు డబ్బు కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట రంగు: సిందూరం

రంగు నివారణ- ఆంజనేయుడికి హారతి ఇవ్వండి.

* కుంభ రాశి

పూర్తి ఉత్సాహంతో పని చేయండి. ఆఫీస్‌లో సక్సెస్ ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ఆలస్యం చేయడం వల్ల లాభాలు పొందే అవకాశాన్ని కోల్పోతారు.

అదృష్ట సంఖ్య: 10

అదృష్ట రంగు: మెరూన్

పరిహారం- సుందరకాండ పఠించండి.

* మీన రాశి

ఈ రోజు కెరీర్ పరంగా ప్రత్యేకమైన రోజు అవుతుంది, ఏదైనా ప్రత్యేక ఒప్పందం ఖరారు అవుతుంది. ఇది డబ్బు పరంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రేమికుడు, ప్రియురాలి మధ్య ఎమోషనల్ రిలేషన్‌షిప్ బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట రంగు: క్రీమ్

నివారణ- ఆవుకు పచ్చి గడ్డి లేదా పాలకూర తినిపించండి.

First published:

Tags: Astrology, Horoscope, Money, Rasi phalalu

ఉత్తమ కథలు