హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ డబ్బు పరంగా లక్ కలిసి వస్తుంది.. కెరీర్‌లో ఉన్నతి..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ డబ్బు పరంగా లక్ కలిసి వస్తుంది.. కెరీర్‌లో ఉన్నతి..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 27వ తేదీ శనివారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్‌డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 27వ తేదీ శనివారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం

చాలా కాలంగా ఉన్న మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. పూర్తి ఉత్సాహంతో పని చేస్తారు. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోండి, అప్పుడు మాత్రమే లాభం సాధ్యమవుతుంది లేదా మీరు నష్టపోవాల్సి రావచ్చు. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: బాదామి (బాదం)

పరిహారం: ఆవుకి చపాతీలు తినిపించండి.

* వృషభం

సౌకర్యాల కోసం చేసే ఖర్చులు పెరుగుతాయి, దీని కారణంగా అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియని వ్యక్తులను కలుస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి లాభాలు ఉంటాయి. లవ్ రిలేషన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట రంగు: తెలుపు

పరిహారం: పేదవారికి అన్నదానం చేయండి.

* మిథునం

డబ్బు లాభాలకు అవకాశం బలంగా ఉంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ రంగంలో చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ప్రవర్తనలో కోపాన్ని ప్రదర్శించడం నష్టానికి దారి తీస్తుంది. కుటుంబంతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 10

అదృష్ట రంగు: లేత ఎరుపు

పరిహారం: పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.

* కర్కాటకం

కెరీర్‌ గ్రోత్‌కు అవకాశాలు ఉంటాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సమయం ఇది. మీరు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమికుడి విషయంలో మనసులో కొంత సందేహం రావచ్చు.

అదృష్ట సంఖ్య : 3

అదృష్ట రంగు: నారింజ

పరిహారం: సుందరకాండ పారాయణం చేయండి.

* సింహం

అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, డబ్బు కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్థాన చలనం లాభిస్తుంది. బంధువులతో సంబంధాలు బలంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట రంగు: కుంకుమపువ్వు

పరిహారం: పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.

* కన్య

విద్యకు సంబంధించిన పనులు లాభిస్తాయి. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు రావచ్చు. ప్రసంగంలో మర్యాదగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. డబ్బు కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట రంగు: సింధూరం

రంగు నివారణ: ఆంజనేయుడికి హారతి ఇవ్వండి.

* తుల

ఈరోజు పూర్తి ఉత్సాహంతో పని చేస్తారు. ఆఫీస్ విషయాల్లో విజయం ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించడం మానుకోండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయవద్దు. ఇలా చేయడం వల్ల లాభాలు పొందే అవకాశాన్ని కోల్పోవచ్చు.

అదృష్ట సంఖ్య: 10

అదృష్ట రంగు: మెరూన్

పరిహారం: సుందరకాండ పారాయణం చేయండి.

* వృశ్చికం

కెరీర్ పరంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు అవుతుంది; ఏదైనా ప్రత్యేక ఒప్పందం ఖరారవుతుంది. ఇది డబ్బు పరంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రేమికుడు, ప్రియురాలి మధ్య ఎమోషనల్ బాండ్ బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

అదృష్ట సంఖ్య: 5

అదృష్ట రంగు: క్రీమ్

నివారణ: ఆవుకు పచ్చి గడ్డి లేదా పాలకూర తినిపించండి.

* ధనుస్సు

కొత్త పథకాలపై ఈరోజు శ్రద్ధ వహిస్తారు. భవిష్యత్తులో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు ఏదైనా చట్టపరమైన వివాదంలో విజయం సాధించవచ్చు. వైవాహిక సంబంధాలు సంతోషంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: వయొలెట్

పరిహారం: దుర్గమ్మ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి.

* మకరం

ఈరోజు కుటుంబ జీవితంలో అస్థిరత ఉండవచ్చు. తల్లిదండ్రులతో మీకు కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. ఉద్యోగులు కష్టపడి పనిచేసి పై అధికారులను సంతృప్తి పరచగలరు.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి.

* కుంభం

ఈ రోజు మీకు మంచి రోజు కానుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ పట్ల పెద్దల ప్రేమ అలాగే ఉంటుంది. పిల్లలు కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు.

అదృష్ట రంగు: తెలుపు

అదృష్ట సంఖ్య: 3

పరిహారం: పక్షికి ధాన్యం ఆహారంగా పెట్టండి.

* మీనం

కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపార ఒప్పందాలు తెరపైకి రావచ్చు. సమస్యలను ఎదుర్కోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఒక కొత్త ఆఫర్‌ను కూడా పొందవచ్చు. పనిని తెలివిగా ప్రారంభించండి. త్వరలో మీ పని పూర్తవుతుంది. రోజువారీ పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఉండవు.

అదృష్ట రంగు: నీలం రంగు

అదృష్ట సంఖ్య: 8

పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం పెట్టండి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Money Astrology, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు