హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ మూడు రాశుల వారికీ వ్యాపారాల్లో డబ్బే డబ్బు.. ఆర్ధికంగా బలోపేతం అవుతారు..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ మూడు రాశుల వారికీ వ్యాపారాల్లో డబ్బే డబ్బు.. ఆర్ధికంగా బలోపేతం అవుతారు..

మనీ అస్ట్రాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

మనీ అస్ట్రాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology (ధన జ్యోతిష్యం): నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల (Zodiac Signs) వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 25వ తేదీ గురువారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్‌డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology (ధన జ్యోతిష్యం): నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల (Zodiac Signs) వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 25వ తేదీ గురువారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం

కృషి, అంకితభావంతో ఆఫీస్‌లో మీ స్థానాన్ని కాపాడుకుంటారు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: బ్లూ కలర్

పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయ సమర్పించండి.

* వృషభం

ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు దయచేసి మీ ప్రియమైన వారిని సంప్రదించండి. ఎవరినీ తొందరగా నమ్మవద్దు లేదంటే నష్టపోతారు. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి.

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: దుర్గాదేవికి ఎరుపు రంగు వస్త్రాన్ని నైవేద్యంగా పెట్టండి.

* మిథునం

మీరు చేసే పెద్ద ప్రయత్నాలు పరిశ్రమ, వ్యాపారాన్ని బలోపేతం చేస్తాయి. ప్రియమైన వారితో, ఉన్నతాధికారులతో సమావేశం కావచ్చు. ఇంట్లో కుటుంబం మద్దతు ఉంటుంది. భూమి, నిర్మాణ విషయాల నుంచి ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: ఎరుపు

పరిహారం: చిన్న అమ్మాయిలకు ఖీర్ తినిపించండి.

* కర్కాటకం

మ్యూచువల్ రిలేషన్స్ బలపడతాయి. ఆఫీస్‌లో లీడర్‌షిప్ స్కిల్స్ పెరుగుతాయి, ఇది ఆర్థిక పురోగతికి దారి తీస్తుంది. రోజువారీ జీవితంలో క్రమశిక్షణ పాటించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి అవసరమైన ప్రయత్నం చేయండి.

అదృష్ట సంఖ్య: 0

అదృష్ట రంగు: నారింజ

పరిహారం: అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.

* సింహం

వివరంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఖర్చులను నియంత్రించండి, లేకపోతే అప్పు తీసుకునే అవకాశం ఉండవచ్చు. మీరు పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఈ రోజు శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. కొన్ని విషయాల్లో పెద్దగా ఆలోచించండి.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: బంగారు రంగు

పరిహారం: పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి.

* కన్య

భౌతిక విషయాలపై శ్రద్ధ ఉంటుంది. ఆత్రుత మిమ్మల్ని అప్పులపాలు చేయగలదని గుర్తుంచుకోండి. ఏ పనైనా పూర్తి నమ్మకంతో చేయండి. కుటుంబ విషయాలలో గౌరవం నిలబడుతుంది.

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట రంగు: ఊదా

పరిహారం: లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి.

* తుల

అందరితో సఖ్యత పెంచుకోవడం వృత్తి, వ్యాపారాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది, ఇది డబ్బు పొందడానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అన్నదమ్ములతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట రంగు: తెలుపు

పరిహారం: నల్ల కుక్కకు నూనెతో చేసిన ఇమర్తిని తినిపించండి.

* వృశ్చికం

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అన్ని వైపుల నుంచి శుభవార్తలు వస్తాయి. జీవితంలో గొప్పతనం ఉంటుంది. ఆస్తి పనులతో సంపద ముడిపడి ఉంటుంది. సమానత్వ భావాన్ని కలిగి ఉండండి.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: నలుపు

పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.

* ధనుస్సు

విషయాలను కొత్త మార్గంలో చూసే అవగాహన పెరుగుతుంది. జీవనశైలి మెరుగుపడుతుంది, దీని కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కెరీర్‌లో మంచి ఆఫర్‌లను పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రియమైన వారితో మరపురాని క్షణాలను పంచుకుంటారు.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: బ్లూ కలర్

పరిహారం: చీమలకు పంచదార, పిండి మిశ్రమాన్ని అందించండి

* మకరం

ఇతరుల ప్రలోభాలకు లోనుకావద్దు నష్టాలు రావచ్చు. పాలసీ రూల్స్ అనుసరించండి. బంధువుల గౌరవం ఉంటుంది. సంస్కృతిని ప్రోత్సహిస్తారు. సంప్రదాయ పనిలో నిమగ్నమై ఉంటారు. ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు.

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట రంగు: పింక్

నివారణ: చేపలకు ఆహారం ఇవ్వండి.

* కుంభం

ఈ రోజు మీకు మంచి రోజు. గౌరవనీయమైన వ్యక్తి మార్గదర్శకత్వంతో మీ మార్గం సులభతరం అవుతుంది. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండండి; లేదంటే ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.

* మీనం

ఇంట్లో ప్రేమ, అవగాహన కనిపిస్తుంది. మీరు పని చేస్తున్న ప్రాజెక్ట్, పరిశోధనలో విజయం సాధిస్తారు. ఈ విషయాల్లో అదృష్టం మద్దతు ఇస్తుంది. వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు ధనలాభాన్ని పొందుతారు. ఈరోజు మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించగలరు.

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట రంగు: నీలం రంగు

పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Money Astrology, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు