(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ఓ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరికొందరికి ఆఫీసు పని గురించి అనవసర ఆందోళన ఉంటుంది. కొందరికి డబ్బు సమస్యలు అలాగే కొనసాగుతాయి. నక్షత్రాల గమనం ఆధారంగా ఈ ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. అక్టోబర్ 23వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి,కృత్తిక -1) : నిలిచిపోయిన పనులపై ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ లభిస్తుందని భావిస్తున్నారు. పరిహారం: శ్రీ సూక్త పారాయణం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఆఫీసు పనుల గురించి అనవసర ఆందోళన ఉంటుంది. మనసులో కలవరం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు నిరుత్సాహంగా ఉంటుంది. పరిహారం: భైరవుడి దేవాలయానికి జెండా సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) :డబ్బుకు సంబంధించిన సమస్యలు అలాగే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గురించి మనసులో ఆందోళన ఉంటుంది. మీరు అనవసరమైన ఖర్చుల కోసం రుణం తీసుకోవలసి రావచ్చు. భూమిపై పెట్టుబడి లాభాలను ఇస్తుంది. పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మెరుగైన పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ప్రియమైనవారి అవసరాలను తీర్చడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. వ్యాపారులు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. పరిహారం: సరస్వతిని పూజించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ సమస్యలు పెరగవచ్చు, ఇది ఆఫీస్ పనిని ప్రభావితం చేస్తుంది. రెండింటినీ విడివిడిగా ఉంచడం మంచిది. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. పరిహారం: జంతువులకు సేవ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) :నానాటికీ పెరుగుతున్న అవసరాలు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి, మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. మీ ఉద్దేశాలను సరైన మార్గంలో ప్రదర్శించండి. పరిహారం: చీమలు తినేందుకు పిండి వేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆఫీసులో జవాబుదారీతనం పెరుగుతుంది. కొత్త వ్యక్తులను విశ్వసించే ముందు, పూర్తి విచారణ చేయండి లేదా మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకోవచ్చు. పెట్టుబడికి మంచి రోజు, అయితే నిపుణుల సలహాలు తప్పకుండా తీసుకోండి. పరిహారం: బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : మీరు ఆర్థిక ఇబ్బందులను నివారించాలనుకుంటే, ఒకరితో ఒకరు ఎలాంటి ఒప్పందం చేసుకోకండి, లేదంటే నష్టం ఉండవచ్చు. నిరంతర సమస్య కారణంగా మీ మనోబలం బలహీనంగా ఉంటుంది. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. పరిహారం: గోశాలకు దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భావోద్వేగానికి లోనై ఎవ్వరికీ కమిట్మెంట్స్ ఇవ్వవద్దు. భవిష్యత్తులో మీరు పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. పరిహారం: గణేశుడికి సింధూరం సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఆఫీసులో పగతో ఏ పనీ చేయకండి. ప్రియమైన వారితో వివాదాలు పెరగవచ్చు. ప్రదర్శనల కోసం ఖర్చు చేయడం వల్ల అప్పులు వస్తాయి. పరిహారం: సూర్య భగవానుడిని ఆరాధించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఆఫీస్‌లో ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అవసరాన్ని అదుపులో ఉంచుకోండి, లేకుంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకే సమయంలో రెండు ప్రాజెక్ట్‌లలో పని చేయవద్దు. పరిహారం: హనుమాన్ ఆలయంలో బజరంగ్ బాన్ పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆఫీస్‌లో అధికారులతో సంబంధాలు పెరిగే అవకాశం ఉంది. మార్పును సులభంగా అంగీకరించండి. డబ్బు లాభం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిహారం: వినాయకుడిని పూజించండి. (ప్రతీకాత్మక చిత్రం)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్ 18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.