హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ డబ్బు సంపాదనకు లోటు ఉండదు.. శుభవార్తలు వింటారు..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ డబ్బు సంపాదనకు లోటు ఉండదు.. శుభవార్తలు వింటారు..

ధన జ్యోతిష్యం ( ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం ( ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 31వ తేదీ బుధవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్‌డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 31వ తేదీ బుధవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేష రాశి

మ్యూచువల్ రిలేషన్స్ బలపడతాయి. ఆఫీస్‌లో నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ఇది ఆర్థిక పురోగతికి దారి తీస్తుంది. రోజువారీ జీవితంలో నియమాలు, క్రమశిక్షణ పాటించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి అవసరమైన ప్రయత్నం చేయండి.

అదృష్ట సంఖ్య: 0

అదృష్ట రంగు: నారింజ

పరిహారం: అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.

* వృషభ రాశి 

వివరంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి, మీరు కచ్చితంగా విజయం పొందుతారు. ఖర్చులను నియంత్రించండి, లేకపోతే రుణం తీసుకునే అవకాశం ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. ఈ రోజు శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. వివిధ విషయాలపై బాగా ఆలోచించండి.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: బంగారు రంగు

పరిహారం: పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి.

* మిథున రాశి

భౌతిక విషయాలపై శ్రద్ధ ఉంటుంది, అధిక ఆత్రుత మిమ్మల్ని అప్పులపాలు చేయగలదని గుర్తుంచుకోండి. ఏ పనైనా పూర్తి నమ్మకంతో చేయండి. కుటుంబ విషయాలలో గౌరవం నిలబడుతుంది.

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట రంగు: ఊదా

పరిహారం: లక్ష్మీదేవికి తామర పువ్వు సమర్పించండి.

* కర్కాటక రాశి

అందరితో సఖ్యత పెంచుకోవడం వృత్తి, వ్యాపారాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది, ఇది డబ్బు పొందడానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అన్నదమ్ములతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట రంగు: తెలుపు

పరిహారం: నల్ల కుక్కకు నూనెతో చేసిన ఇమర్తి తినిపించండి.

* సింహ రాశి 

ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అన్ని వైపుల నుంచి శుభవార్తలు వస్తాయి. జీవితంలో గొప్పతనం ఉంటుంది. ఆస్తి పనులతో సంపద ముడిపడి ఉంటుంది. అందరితో సమానత్వ భావాన్ని కలిగి ఉండండి.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: నలుపు

పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.

* కన్య రాశి 

విషయాలను కొత్త మార్గంలో చూసే అవగాహన పెరుగుతుంది. జీవన శైలి మెరుగుపడుతుంది, దీని కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు కెరీర్‌లో మంచి ఆఫర్‌లను పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రియమైన వారితో మరపురాని క్షణాలను పంచుకుంటారు.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: నీలం

నివారణ: చీమలకు పంచదార, పిండి కలిపిన మిశ్రమాన్ని అందించండి.

* తుల రాశి

ఇతరుల ప్రలోభాలకు లోనుకావద్దు, నష్టాలు రావచ్చు. విధాన నియమాలను అనుసరించండి. బంధువులతో గౌరవం ఉంటుంది. సంస్కృతిని ప్రోత్సహిస్తారు. సంప్రదాయ పనిలో నిమగ్నమై ఉంటారు. ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు.

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట రంగు: పింక్

నివారణ: చేపలకు ఆహారం ఇవ్వండి.

* వృశ్చిక రాశి

ఈ రోజు మంచి రోజు; గౌరవనీయమైన వ్యక్తి మార్గదర్శకత్వంతో మీ మార్గం సులభతరం అవుతుంది. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండండి; లేకుంటే ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 4

అదృష్ట రంగు: ఆకుపచ్చ

పరిహారం: తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.

* ధనుస్సు రాశి 

ఇంట్లో ప్రేమ, అవగాహన కనిపిస్తుంది. మీరు పని చేస్తున్న ప్రాజెక్ట్, పరిశోధనలో విజయం పొందుతారు. అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు ధనలాభాన్ని పొందుతారు. ఈ రోజు మీరు మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించగలరు.

అదృష్ట సంఖ్య: 2

అదృష్ట రంగు: నీలం

పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి.

* మకర రాశి 

రోజు అనుకూలంగా ఉంటుంది; పెండింగ్‌లో ఉన్న అత్యవసర పనులు ఈ రోజు సులభంగా పూర్తవుతాయి. పరస్పర విశ్వాసంతో కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది; డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం చెడు విషయాలపై శ్రద్ధ చూపవద్దు.

అదృష్ట సంఖ్య: 8

అదృష్ట రంగు: బ్రౌన్

పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి.

* కుంభ రాశి

ఈ రోజు మీకు అద్భుతమైనది. కుటుంబ సభ్యుడు మీ ప్రతిష్టను పెంచుతారు, మీరు గౌరవం పొందుతారు. పురోగతి కోసం కొత్త మార్గాలు, ఆప్షన్లను కనుగొనడం అవసరం. ఆస్తి వ్యాపారులకు ఈ రోజు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: లేత పసుపు

పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

* మీన రాశి

అధికారుల నుంచి విశేష గుర్తింపు పొందుతారు. ఈ రోజు ఇతరులకు ఇచ్చిన డబ్బు అందుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. ఆఫీస్‌లో మీకు అనుకూలంగా మార్పులు ఉండవచ్చు. ఏదైనా పెద్ద కార్యక్రమంలో మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.

అదృష్ట సంఖ్య: 0

అదృష్ట రంగు: ఆకాశ నీలం

పరిహారం: గురువులు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోండి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Money Astrology, Zodiac signs

ఉత్తమ కథలు