హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు..

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 28వ తేదీ ఆదివారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్‌డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology:నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 28వ తేదీ ఆదివారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం

కొనసాగుతున్న ప్రాజెక్టులు, పనులలో అడ్డంకులు ఉండవచ్చు. వాదన లేదా గొడవలకు దూరంగా ఉండండి. పెట్టుబడిని వాయిదా వేయడం మంచిది. ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్‌ను జాగ్రత్తగా చదవండి. లేకపోతే నష్టం జరగవచ్చు.

అదృష్ట రంగు: గ్రే

అదృష్ట సంఖ్య: 8

పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.

* వృషభం

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు, ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాన్ని కచ్చితంగా తీసుకోండి. ఈరోజు వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. హోల్‌సేల్‌ సేల్స్‌ వ్యాపారం ఉన్న వారికి పనులు సాధారణంగా సాగుతాయి.

అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ

అదృష్ట సంఖ్య: 3

పరిహారం: చీమలకు పిండి, చక్కెర మిశ్రమాన్ని అందించండి.

* మిథునం

వ్యాపారంలో కొన్ని కొత్త ప్లాన్లతో పనులు ప్రారంభించవచ్చు. భాగస్వామి నుంచి సహకారం సంతోషకరంగా ఉంటుంది. లవ్ లైఫ్‌కు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీరు అనుకున్న పని పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు.

అదృష్ట రంగు: నీలం

అదృష్ట సంఖ్య: 2

పరిహారం: సాయంత్రం పూట మర్రిచెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి.

* కర్కాటకం

విద్యాపరంగా చాలా విజయవంతమవుతారు. మీ పేరు, కీర్తి విస్తృతంగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీ విశ్వాస స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుంది. వృత్తిపరమైన రంగంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల దృష్టిని ఆకర్షిస్తారు.

అదృష్ట రంగు: తెలుపు

అదృష్ట సంఖ్య: 10

పరిహారం: ఎర్రటి ఆవుకి బెల్లం తినిపించండి.

* సింహం

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ప్రసంగాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. మీ నోటి నుంచి వచ్చే ఒక తప్పు పదం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈరోజు బంధువు ఇంటికి రావచ్చు. మీరు వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

అదృష్ట రంగు: గోల్డెన్ కలర్

అదృష్ట సంఖ్య: 10

పరిహారం: సరస్వతీ దేవికి తెల్లటి పూల మాల సమర్పించండి.

* కన్య

ఆర్థిక సమస్యలు, వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజీ ధోరణి, వినయంతో సంక్లిష్ట విషయాలను పరిష్కరించవచ్చు. సాధారణ పని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అప్పు తీసుకోవడానికి మీ ఆలోచనలు మార్చుకోవచ్చు. పెద్ద కష్టాలు కూడా ముగియవచ్చు.

అదృష్ట రంగు: స్కై బ్లూ

అదృష్ట సంఖ్య: 3

పరిహారం: రాముడి గుడికి జెండా సమర్పించండి.

* తుల

వ్యాపార భాగస్వామి లేదా సన్నిహిత సహచరుడితో సమస్య ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కొత్త ఆఫీస్‌లో చేరడానికి లేదా కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్లను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉండదు.

అదృష్ట రంగు: పసుపు

అదృష్ట సంఖ్య: 1

పరిహారం: ఆంజనేయుడి గుడిలో నెయ్యి దీపం వెలిగించండి.

* వృశ్చికం

మీ ప్రియమైనవారితో ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు. పనికిరాని పనులతో కాలక్షేపం చేయకండి, ఇలా చేస్తే డబ్బు పోతుంది, వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.

అదృష్ట సంఖ్య: 6

అదృష్ట రంగు: నలుపు

పరిహారం: శివునికి నీటితో అభిషేకం చేయండి.

* ధనుస్సు

శారీరక సమస్యలు పెరగవచ్చు. అప్పు గురించి ఆందోళన ఉంటుంది; రోజువారీ జీవిత అవసరాలను తీర్చడానికి డబ్బును అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. సమస్య కారణంగా పని ప్రభావితం కావచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

అదృష్ట సంఖ్య: 3

అదృష్ట రంగు: పింక్

పరిహారం: భైరవ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టండి.

* మకరం

రోజువారీ అవసరాలను తీర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు కావచ్చు, సమయానికి అనుగుణంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి లేదా భవిష్యత్తులో ఇబ్బంది పెరుగుతుంది. పగ తీర్చుకోవాలనే భావనకు దూరంగా ఉండండి.

అదృష్ట సంఖ్య: 1

అదృష్ట రంగు: ఎరుపు

పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి.

* కుంభం

భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది, దీని కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా, పని ప్రారంభమవుతుంది.

అదృష్ట సంఖ్య: 7

అదృష్ట రంగు: బంగారు రంగు

పరిహారం: ఆవులకు పచ్చి మేత తినిపించండి.

* మీనం

అదృష్టం కారణంగా అవకాశాలు పొందవచ్చు; ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. మీతో కొందరికి ఏదో కారణంగా వివాదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి లేదంటే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.

అదృష్ట సంఖ్య: 9

అదృష్ట రంగు: వయొలెట్

పరిహారం: పసుపు రంగులో ఉండే తినుబండారాలను దానం చేయండి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Money Astrology, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు