హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Money Astrology: జులై 29 ధన జ్యోతిష్యం: ఖర్చులను నియంత్రించుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు..!

Money Astrology: జులై 29 ధన జ్యోతిష్యం: ఖర్చులను నియంత్రించుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 29వ తేదీ శుక్రవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 29వ తేదీ శుక్రవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం

మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసరంగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఆఫీస్‌లో ప్రత్యర్థులు మీ పనిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

* వృషభం

ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడంలో స్నేహితుడు మీకు సహాయం చేస్తాడు. ఈరోజు ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది.

* మిథునం

రోజువారీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ పర్యటన అవకాశం కూడా పొందవచ్చు. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలకు ఈరోజు అనుకూలం.

* కర్కాటకం

మీరు వ్యాపారంలో నిమగ్నమైతే ఈరోజు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటాయి. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మీకు అదృష్టంగా ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి.

* సింహం

పనిచేసే ఉద్యోగులకు ఈరోజు బహుమానం లభిస్తుంది. ఆఫీస్‌లో మీ ఆలోచన విధానానికి గౌరవం లభిస్తుంది. మీరు ఈరోజు ఆర్థికంగా సంతృప్తి చెందుతారు.

* కన్య

ఈరోజు మీకు ఆర్థికపరంగా అదృష్టాన్ని తెస్తుంది. వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుకు సాగండి. ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.

* తుల

మీరు ఈరోజు ఉద్యోగంలో ఇంక్రిమెంటేషన్ పొందే అవకాశం ఉంది. మీకు మంచి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. కానీ మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జాగ్రత్తగా ఆలోచించండి. మీరు వేసే పిటిషన్ తో చట్టపరమైన సమస్యలు పరిష్కారమవుతాయి.

* వృశ్చికం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల ద్వారా ఈరోజు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. చాలా బలమైన కోరిక నెరవేరుతుంది. మీ కలల గమ్యస్థానాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

* ధనుస్సు

లావాదేవీలు, డబ్బు సంబంధిత విషయాలకు ఈరోజు మంచిది కాదు. మీ విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండండి. ఇందుకు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి.

* మకరం

మీరు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆఫీస్‌లో మీరు సక్సెస్ అవుతారు. గౌరవాన్ని కూడా పొందుతారు.

* కుంభం

ఈరోజు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందం చేసుకోవచ్చు. మీ ముందున్న అవకాశాలను చేజిక్కించుకోండి. ఆఫీస్‌లో యజమానులు మీ కృషిని మెచ్చుకుంటారు. మీ సంకల్పానికి బహుమతి లభిస్తుంది.

* మీనం

అధిక వ్యయం కారణంగా బడ్జెట్‌కు ఆటంకం కలగవచ్చు. ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించండి. ఆఫీస్‌లో వ్యక్తులు మీకు మద్దతుగా ఉంటారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Astrology, Zodiac Sings

ఉత్తమ కథలు