Home /News /astrology /

MONEY ASTROLOGY DHANA JYOTHISHYAM THE LIFE OF THESE ZODIAC SIGNS IS GOLDEN THIS IS A GOOD TIME FOR NEW BUSINESS FOR THESE ZODIAC SIGNS GH BMK TA

Money Astrology: ధన జ్యోతిష్యం: ఈ రాశుల వారి జీవితం అంతా బంగారు మయం.. కొత్త వ్యాపారానికీ ఇదే అనుకూల సమయం..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 15వ తేదీ సోమవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology:  నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 15వ తేదీ సోమవారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేష రాశి
కొత్త స్కీమ్స్‌పై ఈరోజు శ్రద్ధ వహిస్తారు, భవిష్యత్తులో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఏదైనా చట్టపరమైన వివాదంలో విజయం సాధించవచ్చు. వైవాహిక సంబంధాలు సంతోషంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: వయొలెట్
పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి.

* వృషభ రాశి
ఈరోజు కుటుంబ జీవితంలో అస్థిరత ఉండవచ్చు. మీ తల్లిదండ్రులతో మీకు కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన సమయం. జీతభత్యాలు పొందేవారు హార్డ్ వర్క్‌తో అధికారులను సంతృప్తి పరచగలరు.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: పేదవాడికి తెల్లని వస్తువులను దానం చేయండి.

* మిధున రాశి
ఈ రోజు మీకు మంచి రోజు కానుంది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ పట్ల పెద్దల ప్రేమ అలాగే ఉంటుంది. పిల్లలు కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు.

అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 3
పరిహారం: పక్షికి ధాన్యం ఆహారంగా పెట్టండి.

* కర్కాటక రాశి 
కొత్త ఉద్యోగాలు, కొత్త వ్యాపార ఒప్పందాలు రావచ్చు. సమస్యలను ఎదుర్కోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఆఫర్‌ను కూడా పొందవచ్చు. తెలివిగా పని ప్రారంభించండి. త్వరలో మీ పని పూర్తవుతుంది. రోజు వారీ పనులు పూర్తి చేయడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.

అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 8
పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం పెట్టండి.

* సింహ రాశి
కొనసాగుతున్న ప్రాజెక్టులు, పనులలో అడ్డంకులు ఉండవచ్చు. వాదన లేదా సంఘర్షణను నివారించండి. పెట్టుబడిని వాయిదా వేయడం మంచిది. ఏదైనా ఆస్తి ఒప్పందాన్ని ఖరారు చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ సరిగా జాగ్రత్తగా చదవండి. లేకపోతే నష్టం జరగవచ్చు.

అదృష్ట రంగు: గ్రే కలర్
అదృష్ట సంఖ్య: 8
పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.

* కన్య రాశి 
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు, ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి. ఈరోజు వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. హోల్‌సేల్‌ వ్యాపారం ఉన్న వారికి పనులు సాధారణంగా సాగుతాయి.

అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 3
నివారణ - చీమలకు పంచదార, పిండి మిశ్రమాన్ని అందించండి.

* తులా రాశి
వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలపై పనులు ప్రారంభించవచ్చు. భాగస్వామి నుంచి సహకారం, ఆనందం పొందుతారు. లవ్ లైఫ్‌కు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీరు అనుకున్న పని పూర్తవుతుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు.

అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 2
పరిహారం: సాయంత్రం పూట ఒక రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించండి.

* వృశ్చిక రాశి
మీరు విద్యాపరంగా చాలా విజయవంతమవుతారు. మీ పేరు, కీర్తి(ఫేమ్) విస్తృతంగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మీ విశ్వాస స్థాయి కూడా గణనీయంగా పెరుగుతుంది. వృత్తిపరమైన రంగంలో ఉన్నతాధికారులు, సహోద్యోగుల దృష్టిని ఆకర్షిస్తారు.

అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 10
పరిహారం: ఎర్రటి ఆవుకి బెల్లం తినిపించండి.

* ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ ప్రసంగాన్ని నియంత్రించాలి. మీ నోటి నుంచి వచ్చే ఒక తప్పు పదం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఈరోజు బంధువులు ఇంటికి రావచ్చు. మీరు వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.

అదృష్ట రంగు: బంగారు రంగు
అదృష్ట సంఖ్య: 10
పరిహారం- సరస్వతీ దేవికి తెల్లటి పూల మాల సమర్పించండి.

* మకర రాశి
ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజీ పడటంతో పాటు వినయంతో సంక్లిష్ట విషయాలను పరిష్కరించవచ్చు. సాధారణ పని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. రుణం తీసుకోవడానికి మనసును మార్చుకోవచ్చు. మీ పెద్ద కష్టాలు కూడా ముగియవచ్చు.

అదృష్ట రంగు: స్కై బ్లూ
అదృష్ట సంఖ్య: 3
పరిహారం: రామ మందిరానికి జెండా సమర్పించండి.

* కుంభ రాశి
వ్యాపార భాగస్వామి లేదా సన్నిహిత సహచరుడితో సమస్య ఉండవచ్చు. వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కొత్త ఆఫీస్‌లో చేరడానికి లేదా కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్‌లను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉండదు.

అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 1
పరిహారం: హనుమాన్ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి.

* మీన రాశి
ఈ రోజు మీరు ఇష్టపడే వారితో ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేసుకోకండి, ఇలా చేస్తే డబ్బుకు నష్టం వాటిల్లడంతో పాటు వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి, ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.

అదృష్ట సంఖ్య- 6
అదృష్ట రంగు: నలుపు
పరిహారం: శివునికి నీటితో అభిషేకం చేయండి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు