Home /News /astrology /

MONEY ASTROLOGY CAREER AND BUSINESS WILL COME TOGETHER FOR THESE ZODIAC SIGNS ALL THEY NEED IS VERY WELL IN CAREER GH BMK TA

Money Astrology: ధన జ్యోతిష్యం.. ఈ రాశుల వారికీ వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి.. పట్టిందల్లా బంగారమే..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

Money Astrology: నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* మేషం
అదృష్టం బలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. లాభాలతో పాటు మీ ప్రభావం కూడా పెరుగుతుంది. బెస్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. మెరుగైన లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మీ సొంతం. సహోద్యోగులు మిత్రులుగా ఉంటారు. రిస్క్ తీసుకోవడం పెరుగుతుంది. పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తారు.

అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: లేత ఎరుపు
పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

* వృషభం
కృషి, అంకితభావంతో ఆఫీస్‌లో మీ స్థానాన్ని నిలుపుకుంటారు. జాగ్రత్తగా ఉండండి లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: నీలం
పరిహారం: హనుమంతుడికి కొబ్బరికాయను అంకితం చేయండి.

* మిథునం
ఏదైనా ముఖ్యమైన పని చేసే ముందు దయచేసి మీకు ఇష్టమైన, ప్రియమైన వారిని సంప్రదించండి. తొందరగా ఎవరినీ నమ్మవద్దు, లేదంటే నష్టపోతారు. ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉంటే భవిష్యత్తుకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం విషయంలో రాజీ పడకండి.

అదృష్ట సంఖ్య: 1
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: దుర్గామాతకు ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి.

* కర్కాటకం
పెద్ద ప్రయత్నాలు పరిశ్రమ, వ్యాపారాన్ని బలోపేతం చేస్తాయి. ప్రియమైన వారితో, ఉన్నతాధికారులతో సమావేశం కావచ్చు. ఇంట్లో కుటుంబం మద్దతు ఉంటుంది. భూమి నిర్మాణ విషయాల నుంచి ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి.

అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: చిన్న అమ్మాయిలకు ఖీర్ తినిపించండి.

* సింహం
మ్యూచువల్ రిలేషన్స్ బలపడతాయి. ఆఫీస్‌లో నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, ఇది ఆర్థిక పురోగతికి దారి తీస్తుంది. రోజువారీ జీవితంలో క్రమశిక్షణ పాటించండి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి అవసరమైన ప్రయత్నం చేయండి.

అదృష్ట సంఖ్య: 0
అదృష్ట రంగు: నారింజ
పరిహారం: అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.

* కన్య
వివరంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా విజయం పొందుతారు. ఖర్చులను నియంత్రించండి, లేకపోతే అప్పు తీసుకునే అవకాశం ఉండవచ్చు. మీరు పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటారు. ఆలోచనలు పెద్దగా ఉండాలి.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: బంగారు రంగు
పరిహారం: పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి.

* తులా రాశి
భౌతిక విషయాలపై శ్రద్ధ ఉంటుంది. అయితే ఆత్రుత మిమ్మల్ని అప్పులపాలు చేయగలదని గుర్తుంచుకోండి. ఏ పనైనా పూర్తి నమ్మకంతో చేయండి. కుటుంబ విషయాలలో గౌరవం నిలబడుతుంది.

అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: ఊదా
పరిహారం: లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి.

* వృశ్చికం
అందరితో సఖ్యత పెంచుకోవడం వల్ల వృత్తి, వ్యాపారాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది, ఇది డబ్బు పొందడానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. అన్నదమ్ములతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: నల్ల కుక్కకు నూనెతో చేసిన ఇమర్తిని తినిపించండి.

* ధనుస్సు
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అన్ని వైపుల నుంచి శుభవార్తలు వస్తాయి. జీవితంలో గొప్పతనం ఉంటుంది. ఆస్తి పనులతో సంపద ముడిపడి ఉంటుంది. సమానత్వ భావాన్ని కలిగి ఉండండి.

అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: నలుపు
పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి.

* మకరం
కొన్ని విషయాలను కొత్త మార్గంలో చూసే అవగాహన పెరుగుతుంది. జీవనశైలి మెరుగుపడుతుంది, దీని కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కెరీర్‌లో మంచి ఆఫర్‌లను పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ప్రియమైన వారితో మరపురాని క్షణాలను పంచుకుంటారు.

అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: నీలం
పరిహారం: చీమలకు పంచదార, పిండి మిశ్రమాన్ని అందించండి

* కుంభం
ఎవరి ప్రలోభాలకు లోనుకావద్దు, లేదంటే నష్టాలు రావచ్చు. పాలసీ రూల్స్ ఫాలో అవ్వండి. బంధువుల గౌరవం లభిస్తుంది. సంస్కృతిని ప్రోత్సహిస్తారు. సంప్రదాయ పనిలో నిమగ్నమై ఉంటారు. ఆత్మీయుల సలహాలు తీసుకుంటారు.

అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: పింక్
నివారణ: చేపలకు ఆహారం ఇవ్వండి.

* మీనం
మీరు గౌరవించే వ్యక్తి మార్గదర్శకత్వంతో ఈరోజు మంచి జరుగుతుంది. మీ మార్గం సులభం అవుతుంది. కొత్త లాభదాయక మార్గాలు కనిపిస్తాయి. చిన్న ప్రలోభాలకు దూరంగా ఉండండి, లేదంటే గందరగోళంలో చిక్కుకోవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

తదుపరి వార్తలు