Home /News /astrology /

MONEY ASTROLOGY AUGUST 11 LUCK WILL COME TOGETHER PENDING MONEY WILL RETURN TO THESE ZODIAC SIGNS GH BMK TA

Money Astrology : ధన జ్యోతిష్యం.. అదృష్టం కలిసి వస్తుంది..పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది..

మనీ అస్ట్రాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

మనీ అస్ట్రాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Money Astrology : నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 11వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత)

నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 11వ తేదీ గురువారం నాడు, ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

* మేషం
మీతో మీరు ఇంటరాక్షన్ పెంచుకోవచ్చు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేసుకోకండి. ఇలా చేస్తే ధన నష్టం వాటిల్లడంతోపాటు వచ్చిన అవకాశాలను కూడా పోగొట్టుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది

లక్కీ నంబర్: 6
లక్కీ కలర్: నలుపు
పరిహారం: శివునికి నీటిని సమర్పించండి.

* వృషభం
శారీరక సమస్యలు పెరగవచ్చు. అప్పుల గురించి ఆందోళన ఉంటుంది. రోజువారీ అవసరాలను తీర్చడానికి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక సమస్య కారణంగా పని ప్రభావితం కావచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

లక్కీ నంబర్: 3
లక్కీ కలర్: పింక్
పరిహారం: భైరవ దేవాలయానికి కొబ్బరికాయ సమర్పించండి.

* మిథునం
రోజువారీ అవసరాలను తీర్చడానికి ఎక్కువ ఖర్చు కావచ్చు. సమయానికి అనుగుణంగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి లేదా భవిష్యత్తులో ఇబ్బంది పెరుగుతుంది. పగ తీర్చుకోవాలనే భావాన్ని కలిగించవద్దు.

లక్కీ నంబర్: 1
లక్కీ కలర్: ఎరుపు
పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి.

* కర్కాటకం
భార్యాభర్తల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉంది. దీని కారణంగా ఇంటి వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ కాలక్రమేణా పని ప్రారంభమవుతుంది.

లక్కీ నంబర్: 7
లక్కీ కలర్: బంగారు రంగు
పరిహారం: ఆవులకు పచ్చి మేత తినిపించండి.

* సింహ రాశి
అదృష్టం కొద్దీ అవకాశాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. పనికిరాని విషయాలకు సమయాన్ని వృథా చేయకండి. మీతో ఏదో కారణంగా కొందరికి వివాదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి లేదంటే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.

లక్కీ నంబర్: 9
లక్కీ కలర్: వయొలెట్
పరిహారం: పసుపుతో చేసే తినదగిన పదార్థాలను దానం చేయండి.

* కన్య
శారీరక సమస్యల వల్ల పని దెబ్బతింటుంది. పెద్దల మాటలు తూట్లు పొడుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది.

లక్కీ నంబర్: 7
లక్కీ కలర్: స్కై బ్లూ
పరిహారం: కృష్ణుని ఆలయంలో వేణువు సమర్పించండి.

* తుల
ఆఫీస్‌లో చేసే హార్డ్ వర్క్ ఫలితాలు భవిష్యత్తులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఏదైనా విషయంలో మీతో కొందరికి ఉండే వివాదాలు తీవ్రమవుతాయి.

లక్కీ నంబర్: 5
లక్కీ కలర్: పసుపు
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.

* వృశ్చికం
పనిలో విజయం సాధించడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఎనర్జీ, సంతృప్తి ఉంటుంది.

లక్కీ నంబర్: 4
లక్కీ కలర్: బాదామి (బాదం)
పరిహారం: పంచామృతంతో శివునికి అభిషేకం చేయండి.

* ధనుస్సు
వ్యాపార ఒప్పందాలలో లాభాలు గడిస్తారు. ఆగిపోయిన ధనాన్ని పొంది సంతోషిస్తారు. పనికిరాని విషయాల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది.

లక్కీ కలర్: ఫిరౌజీ (turquoise-blue)
లక్కీ నంబర్: 2
పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లండి.

* మకరం
ఆత్మీయుల మాటలు మనసును కుదిపేస్తాయి. శారీరక సమస్యలు పెరగవచ్చు. నిలిచిపోయిన పనుల గురించి ఆందోళన చెందడం సహజం, ఓపిక పట్టండి. ధన నష్టం కలగవచ్చు, జాగ్రత్తగా ఉండండి.

లక్కీ నంబర్: 8
లక్కీ కలర్: తెలుపు
పరిహారం: 'ఓం నమః శివాయ' అని 108 సార్లు జపించండి.

* కుంభం
ఒకదాని తర్వాత ఒక సమస్య తీవ్రమవుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. తెలివిగా ఖర్చు చేయండి, ఊహించని విధంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మంచి విషయం ఏమిటంటే.. కుటుంబానికి మద్దతు లభిస్తుంది.

లక్కీ నంబర్: 5
లక్కీ కలర్: ఆకుపచ్చ
పరిహారం: రామమందిరంలో కూర్చుని రామరక్ష స్తోత్రాన్ని పఠించండి.

* మీనం
అందరినీ వెంట తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. అన్నదమ్ముల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరగవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు.

లక్కీ నంబర్: 2
లక్కీ కలర్: బ్లూ
పరిహారం: హనుమాన్ గుడిలో నెయ్యి దీపం వెలిగించి, హనుమాన్ చాలీసా పఠించండి.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Money, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు