హోమ్ /వార్తలు /astrology /

Makar Sankranti 2022: మకర సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఖచ్చితంగా తెలుసుకోండి

Makar Sankranti 2022: మకర సంక్రాంతి రోజున ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఖచ్చితంగా తెలుసుకోండి

Sankranti 2022: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందేలు, గాలి పటాలు, ఎడ్ల బండ్ల పోటీలతో... అంతటా సందడి కనిపిస్తోంది. మకర సంక్రాంతి పర్వదినాన ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

  దేశమంతటా పండగ వాతావరణం నెలకొంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, కోళ్ల పందేలు, గాలి పటాలు, ఎడ్ల బండ్ల పోటీలతో... అంతటా సందడి కనిపిస్తోంది. ఐతే సంక్రాంతిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఉత్తరాయణం, లోహ్రి, బిహు, పొంగల్, మకర సంక్రాంతి పేరుతో పండగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఇది జనవరి 14న జరుగుతుంది. కానీ మకర సంక్రాంతి స్నానాలు, దానాలు మాత్రం జనవరి 15న జరుగుతాయి. మకర సంక్రాంతి రోజున పుణ్యస్నానం చేసి సూర్యభగవానుని పూజిస్తే పుణ్యం లభిస్తుంది. మంచి జరుగుతుంది. ఈ రోజు కిచ్డీ తినడం, నువ్వుల లడ్డూలు తినడం ఆనవాయితీ. నువ్వులు శరీరానికి వేడి చేస్తాయి. అందుకే చలికాలంలో నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మకర సంక్రాంతి పర్వదినాన ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

  Worship: దేవుడిని పూజించేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. కష్టాలే!

  మకర సంక్రాంతి నాడు ఏం చేయాలి?

  1. మకర సంక్రాంతి రోజున నదులలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. ఉత్తరాదిన చాలా మంది గంగానదిలో స్నానం ఆచరిస్తారు. ఐతే నది పరీవాహక ప్రాంతాలకు దూరంగా ఉండే వారు ఇంట్లోనే ఈ స్నానాలు చేస్తారు. నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు.

  2. మకర సంక్రాంతి రోజున దానాలు చేస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు ఏవైనా శని దోషాలు ఉంటే తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

  3. మకర సంక్రాంతి రోజు నువ్వుల నీళ్లు తాగడం, నువ్వుల లడ్డూలు తినడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాల్లో భోగి రోజున నువ్వుల రొట్టెలు తింటుంటారు.

  4. మకర సంక్రాంతి సందర్భంగా చాలా ప్రాంతాల్లో కిచ్డీ తింటుంటారు. ఇందులో కాలానుగుణంగా లభించే అన్ని రకాల కూరగాయలను వేస్తారు. అందుకే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

  సంక్రాంతి సందర్భంగా మీ రాశిచక్రం ప్రకారం.. ఈ వస్తువులు దానం చేయండి.

  మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు ఇవే

  1. మకర సంక్రాంతి రోజు ఉదయాన్నే స్నానం చేసి.. నువ్వుల దానం చేయాలి. సూర్య, శని దేవుళ్లకు దండం పెట్టుకోవాలి. అంతేగానీ మద్యం సేవించకూడదు.

  2. మకర సంక్రాంతి రోజున స్నానానికి, దానానికి ముందు ఆహారం తీసుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.

  3. సంక్రాంతి రోజులు ఇంటికి యాచకుడు వచ్చినట్లయితే, వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఈ రోజు తప్పకుండా మీకు తోచిన దానం చేయాలి.

  మన పూర్వీకులు కలలో  కనిపించి.. ఏడిస్తే ఏమవుతుందో తెలుసా?

  మకర సంక్రాంతి సందర్భంగా గ్రహాల శాంతి కోసం దాన ధర్మాలు చేస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు పరిహారం చేయాల్సిన గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. ఇలా చేస్తే ఆ గ్రహ దోషం తొలగిపోతుందని చాలా మంది విశ్వసిస్తారు. ప్రాంతాన్ని బట్టి సంక్రాంతి పండగను ఒక్కోచోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. కానీ ఏ ప్రాంతం వారైనా పైన చెప్పిన పనులను చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

  First published:

  ఉత్తమ కథలు