Makar Sankranti 2021: మకర సంక్రాంతి ప్రాశస్థ్యం, ముహూర్తాలు, పుణ్య కాలాలు

మకర సంక్రాంతి ప్రాశస్థ్యం, ముహూర్తాలు, పుణ్య కాలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Makar Sankranti 2021: నాలుగు రోజులు జరుపుకునే మకర సంక్రాంతి నాడు ఏయే ఆచారాలు పాటించాలో తెలుసుకుందాం.

 • Share this:
  2021 Sankranti Calendar: ఈ సృష్టికి మూలాధారం సూర్య భగవానుడు. ఆ సూర్యుడే లేకపోతే... ఈ ప్రపంచం స్తంభించిపోతుంది. పండే పంటలకు ఆధారం సూర్యుడే. అందుకే... పాడిపంటలు చేతికి రాగానే... తమను చల్లగా చూసుకుంటున్న సూర్యుడికి నివేదనగా జరిపే పండుగే సంక్రాంతి. అలాగే పాడి పంటల్లో, కష్టనష్టాల్లో తమకు తోడుగా ఉంటూ... సేవలందించే మూగ జీవాలైన గోమాతలు, ఆవులను పూజించే సందర్భమే ఈ పండుగ. తెలుగు లోగిళ్లలో కళా కాంతులు, సంతోషాలు నింపే పండుగను నాలుగు రోజులు జరుపుకోవడం మన ఆనవాయితీ. మొదటి రోజు భోగి, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ జరుపుకుంటారు. దేశమంతా జరుపుకునే పండుగ ఇది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పేరుతో దీన్ని పిలుస్తారు. నార్త్ ఇండియా ప్రజలు సంక్రాంతి రోజుల్లో గంగానదిలో స్నానం చేసి... సూర్యుడికి పూజలు చేస్తారు. వేల మంది హరిద్వార్, బెనారస్, అలహాదాబాద్ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి... చలిగంగ స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ పాపాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.

  సంక్రాంతి నాడు కోల్‌కతాలో గంగా సాగర్ మేళా జరుగుతుంది. అదే సమయంలో... తమిళనాడులో పొంగల్ నాలుగు రోజులు జరుగుతుంది. సంక్రాంతి రోజును థాయ్ పొంగల్ అని పిలుస్తారు. పంజాబ్ హర్యానాలో భోగి నాడు లోహ్రీ జరుపుకుంటారు. గుజరాత్ ప్రజలు ఉత్తరాయణ్ పేరుతో సంక్రాంతిని 2 రోజులు జరుపుకుంటారు. కేరళలో మకర విళక్కు పేరుతో జరుపుకుంటారు. అదే రోజున శబరిమల అయ్యప్పస్వామి చెంత ఆకాశంలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది.

  ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంక్రాంతి పండుగ నాలుగు రోజులు జరుగుతుంది. సంక్రాంతి రోజున జరిగే పండుగను పెద్ద పండుగ అని పిలుస్తారు. ఈ సంవత్సరం జనవరి 13న భోగి పండుగ వస్తోంది. మర్నాడు సంక్రాంతి.

  మకర సంక్రాంతి పుణ్యకాలం:
  ఈ సంవత్సరం జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.54 గంటల వరకూ మకర సంక్రాంతి పుణ్య కాలం ఉంది. అంటే మొత్తం 9గంటల 24 నిమిషాలు ఉంటుంది.

  మకర సంక్రాంతి మహా పుణ్యకాలం:
  ఈ సంవత్సరం జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.22 గంటల వరకూ మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉంది. అంటే మొత్తం 1గంట 52 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు అత్యంత ఎక్కువ సత్ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

  శుభ సంకేతాలు:
  ఈ సంవత్సరం పంటలు బాగా పండి... దిగుబడి బాగా వస్తుందని జ్యోతిషులు అంచనా వేశారు. ఐతే... వస్తువుల ధరలు పెరుగుతాయని తెలిపారు. ప్రజల్లో భయాలు, ఆందోళనలూ ఉంటాయని వివరించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనీ, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని చెప్పారు.

  ఇది కూడా చదవండి:Makar Sankranti 2021: సంక్రాంతి నాడు ఈ పనులు తప్పక చేయండి... అదృష్టం మీదే

  పండుగ 4 రోజులూ ఇలా చెయ్యండి:
  రోజూ ఉదయాన్నే లేచి... తల స్నానం చేసి... సూర్యుడికి నివేదన చెయ్యండి. దీపం వెలిగించి... హారతి ఇవ్వండి. అలాగే మహా శివుడికి పూజలు చెయ్యండి. బయటకు వెళ్లినప్పుడు దానాలు చెయ్యండి. ఆలయాలకు వెళ్తే దక్షిణ ఇవ్వండి. ఉపవాస దీక్షలు కూడా చేపట్టవచ్చు. సూర్యాస్తమయం లోపే మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి. ఏవైనా మిగిలిపోతే... వాటిని కంటిన్యూ చేయవద్దు. మర్నాడు మళ్లీ సూర్యోదయం అయ్యాకే కంటిన్యూ చెయ్యాలి.
  Published by:Krishna Kumar N
  First published: