Home /News /astrology /

LUNAR ECLIPSE CHANDRA GRAHAN 2022 LUNAR ECLIPSE IS HAPPENING THIS MONTH KNOW THE TIME PLACE AND OTHER DETAILS HERE SK

Lunar Eclipse: సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకే చందగ్రహణం.. తేదీ, సమయం, సూతక్ కాల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lunar Eclipse 2022: భారత కాలమానం ప్రకారం.. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 16, 2022 సోమవారం ఉదయం 08:59 గంటలకు ఏర్పడుతుంది. అది ఉదయం 10:23కి ముగుస్తుంది.

    ఏప్రిల్ 30న ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. మనదేశంలో మాత్రం కనిపించలేదు. ఐతే సూర్య గ్రహణం ఏర్పడిన 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు ఉంటాయి. మొదటి చంద్రగ్రహణం (First Lunar Eclipse in 2022) 16 మే 2022న జరుగుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... 2022లో వచ్చే రెండు చంద్రగ్రహణాలు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలు. భారతదేశంలోని మత విశ్వాసాల ప్రకారం.. గ్రహణం ప్రభావం కొందరికి శుభంగా ఉంటే..మరికొందరిపై అశుభ ప్రబావం ఉంటుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో తొలి చంద్రగ్రహణం కనిపించనుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం భారతదేశ ప్రజలపై తక్కువగా ఉంటుంది.

    మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు?
    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ ఏడాది మొదటి చంద్రగ్రహణం మే 16, 2022న ఏర్పడుతుంది. రెండోది నవంబర్ 8న 2022న జరుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మన దేశంలో సూర్యచంద్రగ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహణం సమయంలో అనేక కార్యకలాపాలను నిషేధిస్తారు. ముఖ్యంగా గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

    Astrology: శని దేవుడి ఆశీస్సులు..ఈ రెండు రాశుల వారికి ఎంతో అదృష్టం.. కష్టాల నుంచి విముక్తి

    చంద్రగ్రహణ సమయం:
    భారత కాలమానం ప్రకారం.. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 16, 2022 సోమవారం ఉదయం 08:59 గంటలకు ఏర్పడుతుంది. అది ఉదయం 10:23కి ముగుస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఐతే మన దేశంలో మాత్రం కనిపించదు. అందువల్ల దీని ప్రభావం మనపై ఉండదు. అందువల్ల సూతక్ కాల్ భారతదేశంలో సూతక్ కాలం వర్తించదు. భారత్‌తో చంద్రగ్రహణం కనిపించకపోయినప్పటికీ.. ఎవరైనా చూడాలనుకుంటే.. ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. పలు యూట్యూబ్ ఛానెళ్లు లైవ్ ప్రసారం చేస్తాయి.

    చంద్రగ్రహణం అంటే ఏమిటి?

    చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యకాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు. దీనినే సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది.

    Chanakya niti: ఈ ఒక్క ఉపాయంతో ఎంతటివారినై మీ చెప్పుచేతల్లో పెట్టుకోవచ్చు ఆ లాజిక్ ఎంటంటే?

    ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
    నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికాలో 2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి.. దాని సూతక్ కాలం ఇక్కడ చెల్లదు. ఐతే రెండో సూర్య గ్రహణం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. దాని సూతక్ కాలం చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణ ప్రభావం ప్రజలపై ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Lunar Eclipse, Moon

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు