Home /News /astrology /

LUNAR ECLIPSE 2021 TODAY BLOOD MOON DAY KNOW THE DATE AND TIMINGS AND WHAT PEOPLE SHOULD FOLLOW THIS DAY NK

Lunar Eclipse 2021: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. భారతీయులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

Lunar Eclipse 2021: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. భారతీయులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

Lunar Eclipse 2021: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. భారతీయులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

Lunar Eclipse 2021: ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం నేడు రాబోతోంది. మరి దాని ప్రత్యేకత ఏంటి... ఎందుకు దాని కోసం ఖగోళ శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు... తెలుసుకుందాం.

    Lunar Eclipse 2021: అంతరిక్షంలో నేడు జరగబోయే అద్భుతాన్ని చూడాలని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరపు మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ రాబోతోంది. ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ (ఎర్ర చందమామ) అంటున్నారు. ఎందుకంటే... చంద్రగ్రహణం సమయంలో... చందమామ... ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే... సూర్యుడికీ చందమామకూ... మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు... సూర్యకిరణాలు... చంద్రుడిపై పడవు. ఆ సమయంలో... గ్రహణం ఏర్పడుతుంది. ఐతే... సూర్యకిరణాల్లోని ఎరుపు, నారింజ రంగు కిరణాలు... భూమి నుంచి ముందుకు దూసుకెళ్తాయి. అవి చందమామపై ప్రసరిస్తాయి. అందువల్ల చందమామ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇలాంటిది 2019 జనవరి 21న వచ్చింది. మళ్లీ ఇప్పుడే వస్తోంది.

    ఎక్కడెక్కడ కనిపిస్తుంది?
    ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం.. తూర్పు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్ర దీవులు, ఉత్తర అమెరికాలో బాగా కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. హిందూ మహా సముద్ర దీవుల్లోనూ కనిపిస్తుంది. భారతీయులకు ఇది పాక్షికంగా (కొద్దిగా) కనిపిస్తుంది.

    ఏ టైమ్‌లో వస్తుంది?
    ఇండియా టైమ్ ప్రకారం నేడు
    మధ్యాహ్నం 3.15కి చంద్రగ్రహణం మొదలవుతుంది. క్రమంగా చందమామ తగ్గిపోతుంది.
    సాయంత్రం 4.39కి సంపూర్ణం అవుతుంది. అప్పుడు చందమామ పూర్తిగా కనిపించదు.
    సాయంత్రం 4.58కి చంద్రగ్రహణం వదిలేసే ప్రక్రియ మొదలవుతుంది. మెల్లగా చందమామ రింగులా కనిపిస్తుంది.
    సాయంత్రం 6.23కి చంద్రగ్రహణం పూర్తిగా తొలగిపోయి... సంపూర్ణ చందమామ కనిపిస్తుంది.

    2021లో నాలుగు గ్రహణాలు:
    ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలతో ఇండియాకి సంబంధం ఉంటుంది. అవి
    మే 26 – సంపూర్ణ చంద్ర గ్రహణం.
    జూన్ 10 - వార్షిక సూర్య గ్రహణం
    నవంబర్ 19 - పాక్షిక చంద్రగ్రహణం
    డిసెంబర్ 4 - సంపూర్ణ సూర్య గ్రహణం

    రాశులపై చంద్రగ్రహణ ప్రభావం:
    12 రాశులపై చంద్రగ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. సాధారణంగా... చందమామ వల్ల వివిధ రాశుల వారికి మానసిక ఆనందం కలుగుతుంది. అదే చందమామకు గ్రహణం పడితే... ఆ రాశుల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఐతే... ఇండియాలో ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపించదు కాబట్టి... అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.

    ఇది కూడా చదవండి:Black Fungus: బ్లాక్ ఫంగస్ నుంచి కళ్లను కాపాడుకోండి... ఇవి ఎక్కువగా తినండి

    చంద్రగ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
    - పండితుల ప్రకారం చంద్రగ్రహణం సమయంలో బయటకు వెళ్లకండి. ముఖ్యంగా విశాలమైన, ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్లకండి. ఎందుకంటే చంద్రగ్రహణం సమయంలో నెగెటివ్ ఎనర్జీ, చెడు శక్తులు అత్యంత బలంగా, ప్రభావవంతంగా ఉంటాయి. అవి ఒంటరిగా ఉన్న వారిని ఆవహిస్తాయి.
    - చంద్రగ్రహణం ప్రారంభానికి ముందే... మీరు తినే ఆహారం, తాగే ద్రవాలకు తులసి ఆకులను జత చేయండి.
    - మీ ఇంట్లో పిల్లలు చాలా చిన్నవాళ్లైతే... ఎట్టి పరిస్థితుల్లో వారిని చంద్రగ్రహణం సమయంలో ఒంటరిగా వదలకండి.
    - మీరు ప్రెగ్నెంట్ (గర్భిణి) అయితే, చంద్రగ్రహణం సమయంలో ఇంట్లోంచీ బయటకు రావద్దు. చంద్రగ్రహణ నీడ ఎట్టి పరిస్థితుల్లో మీ గర్భంపై పడకుండా చూసుకోండి అని పండితులు చెబుతున్నారు.
    - మీ ఇంట్లో పూజ గది ఉంటే... దానిపై చంద్రగ్రహణం నీడ పడకుండా ఇంటి డోర్లు, కిటికీలూ మూసివేయండి లేదంటే కర్టెన్లైనా వేసేయండి.
    - చంద్రగ్రహణం ప్రారంభమయ్యాయక... తులసి ఆకులు తెంపకూడదు. కావాలనుకుంటే గ్రహణానికి ముందే వాటిని తెంపుకోవాలి.
    - చంద్రగ్రహణం సమయంలో దేవతలు, దేవుళ్ల విగ్రహాలు, పటాలను ముట్టుకోకూడదు.
    - చంద్రగ్రహణం సమయంలో మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు. అలా చేస్తే... అనేక సమస్యలు తప్పవు.
    - గ్రహణం సమయంలో ఉపవాసం చేయడం మంచిదే అంటున్నారు పండితులు. అనారోగ్యం ఉన్నవారు అలాంటివి చెయ్యవద్దని చెబుతున్నారు.
    - గ్రహణం సమయంలో కత్తులు ఇతర పదునైన వస్తువులను వాడవద్దని సూచిస్తున్నారు.
    - గ్రహణం సమయంలో... కొత్త కార్యక్రమాలు ఏవీ ప్రారంభించవద్దని చెబుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Lunar Eclipse

    తదుపరి వార్తలు