Dhanteras2022: ఇప్పటి వరకు కేవలం ధన్‌తేరాస్ (dhanteras) రోజు బంగారం, వెండి లేదా ఇతర పాత్రలను కొనుగోలు చేయాలి అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ధన్వంతరి, కుబేరుడి (Kuber) కి ఇష్టమైన రోజు వారికి ప్రత్యేక పూజలు జరుపుకోవాలని అంటారు. కానీ, ఈ ధన్‌తేరాస్ (dhanteras) వెనుక చాలా మందికి తెలియని ఒక కథ కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఒకప్పుడు హిమ అనే రాజు ఉండేవాడు. అతినికి యుక్తవయస్సులో ఉండే ఒక కుమారుడు ఉన్నాడు. కానీ, అతని జాతకం ప్రకారం అతడి 16వ ఏటనే పాము కరవడం ద్వారా మరణిస్తాడని జోతిషులు చెబుతారు.
దీంతో కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో రాజు ఉంటాడు. ఈ నేపథ్యంలో రాజకుమారుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ అమ్మాయితో కూడా అతడి మరణం గురించి చెప్తాడు.
దీంతో ఆమె తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో ఉంటుంది. ఆ రోజు రాజకుమారుడిని పడుకోకుండా ఉండమని చెబుతుంది. దీంతో పాముకాటును నుంచి తప్పించుకోవచ్చని ఆమె ఆలోచన. అంతేకాదు, రాజకుమారుడు నిద్రించే గది ద్వారం వద్ద ఎక్కువ బంగారు, వెండి ఆభరణాలను కుప్పలుగా పోస్తుంది. ఆ ప్రదేశం మొత్తం దీపాలతో అలంకరిస్తుంది. చూడటానికి ఆ ప్రదేశం దేదీప్యమానం ఉంటుంది. ఆ వెలుగులకు బంగారం, వెండి నాణాలు జిగేలుమనిపిస్తాయి. వాటితో ఆ గది మొత్తం ధగధగలాడిపోతుంది.
రాత్రంతా రాజకుమారుడు నిద్ర పోకుండా ఉండటానికి అతడి భార్య దేవుడు శ్లోకాలను చదివి వినిపిస్తుంది. ఇంతలో అతడి మరణఘడియలు దగ్గర పడ్డాయి. యమధర్మరాజు పాములవాడి రూపంలో రాత్రి సమయంలో రాకుమారుడి ఆత్మను తీసుకెళ్లడానికి వస్తాడు.
కానీ, అతడి కళ్లలో ఏదో మెరుపు పడుతూ ఏమీ కనిపించదు. ఇదంతా ఆ బంగారు, వెండి ఆభరణాలు, దీపం మహత్యం. దీంతో యముడు రాజకుమారుడి గది పైభాగానికి వెళ్లి చూస్తాడు. అప్పడు రాజకుమారుడి భార్య ప్రవచనాలు వింటూ అక్కడే ఉంటాడు.
దీంతో ఉదయం అయింది. రాజకుమారుడు మరణ గడియలు దాటిపోయాయి. ఇక యమధర్మ రాజు చేసేదేం లేక తిరిగి వెళ్లిపోతాడు. ఎందుకంటే రాజకుమారుడు కేవలం ఆరోజు రాత్రి మాత్రమే పాము కరిచి చనిపోతాడని జోతిషులు చెబుతారు.
అప్పటి నుంచి రాజకుమారుడు అతడి భార్య ఆనందంగా జీవిస్తారు. అప్పటి నుంచి ప్రతిఏడాది ధన్‌తేరాస్ చేసుకోవడం మొదలైందని మరో కథనం. ప్రజలు బంగారం వెండి ఆభరణాలు కొనడం మొదలు పెట్టారు.
ధన్‌తేరాస్ రోజు యమదీపం కూడా వెలిగిస్తారు. దీన్ని రాత్రంతా వెలిగిస్తారు. దీంతో ఆ ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించవని నమ్ముతారు.దీపాలను గోధుమ పిండితో చేసిన దీపాలను సాయంత్రం వేళ ఇంటి బయట దక్షిణం వైపు యమ దిశ ఉంచుతారు (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras 2022