Zodiac Signs: ఇతరులను ఆకట్టుకోవడానికి చాలా మంది గిఫ్ట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా లవర్స్ సీజన్‌ను బట్టి, అందుకు తగ్గట్టు బహుమతులు ఇచ్చుపుచ్చుకుని ఒకరిపై ఒకరు తమ ప్రేమను చాటుకుంటారు. ఏదైనా పనికి థ్యాంక్స్ చెప్పడంతో పాటు గిఫ్ట్స్ కూడా ఇవ్వడం కొందరికి అలవాటు. అలా చేయడం వల్ల వారు ఎంతో సంతోషపడతారని చాలా మంది నమ్మకం. కమ్యూనికేట్ చేయడం కష్టంగా భావించే కొన్ని రకాల ఎమోషన్స్‌ను తెలపడానికి గిఫ్ట్‌ను ఒక సాధనంగా కూడా ఉపయోగిస్తుంటారు. పార్ట్నర్తో క్లోజ్‌గా కనెక్ట్ కావడానికి గిఫ్ట్ కీలకపాత్ర పోషిస్తాయని చాలా మంది గట్టిగా నమ్ముతారు. తమ పార్ట్నర్ను సంతోష పెట్టేందుకు, తద్వారా వారి ప్రేమ పొందేందుకు తరచూ బహుమతులు ఇచ్చే రాశులు ఇవే..
తులసితో ఈ మొక్కలను ఎప్పుడూ నాటవద్దు.. లేదంటే ఇంట్లో ఎప్పుడూ సమస్యలే
ధనుస్సు (Sagittarius):
ఈ రాశివారికి గివింగ్ నేచర్ సహజంగా ఉంటుంది. తమ పార్ట్నర్కు గిఫ్ట్స్ ఇస్తూ వారిని బాగా ఆరాధిస్తారు. వారిని సంతోషపెట్టడానికి చాలా మందుచూపుతో వ్యవహరిస్తుంటారు. పండుగల సీజన్ ఈ రాశి వారికి బాగా ఇష్టం. ఎందుకుంటే సందర్భాన్ని బట్టి గిఫ్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. తమ ఇష్టమైన వారికి ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.
సింహం (Leo):
ఈ రాశివారు ప్రేమలో ఉంటే, లవర్‌తో తన ప్రేమ గురించి ఎప్పుడెప్పుడు చెబుదామని చూస్తుంటారు. ఇందుకు గిఫ్ట్స్‌ను సాధనంగా ఉపయోగించుకుంటారు. సింహరాశి వారు తమ లవర్స్‌కు లగ్జరీ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తద్వారా వారి కళ్లలో ఆనందాన్ని చూడాలనుకుంటారు. బహుమతి కొనుగోలు ప్రక్రియలోని ప్రతి దశను ఈ రాశివారు తెగ ఇష్టపడతారు. మంచి గిఫ్ట్ ఎంచుకోవడం నుంచి తమ ప్రియమైన వ్యక్తి కళ్ళు మెరిసేలా చూడటం వరకు ప్రతి సెకన్ను ఆస్వాధిస్తారు. పార్ట్‌నర్‌పై ప్రేమను చాటుకోవడానికి గిఫ్ట్ సరైన మార్గమని ఈ రాశివారు బలంగా నమ్ముతారు.
డిసెంబరులో భారీ గ్రహాల మార్పు.. ఈ ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు..
మీనం (Pisces):
ఈ రాశివారు తమ పార్ట్నర్ పట్ల ఎంతో ప్రేమగా వ్యవహరిస్తుంటారు. ఇందుకు తరచూ గిఫ్ట్ ఇస్తుంటారు. దీంతో వారిలో నిరంతరం మంచి అనుభూతిని కలిగించేలా, తమపై ఆప్యాయతను చూపించడానికి పార్ట్నర్ను ప్రేరేపించేలా చేస్తారు. అంతేకాకుండా పార్ట్నర్ను మరింత సంతోషపెట్టేందుకు అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన పనులు చేస్తుంటారు.
తుల (Libra):
ఈ రాశివారు షాపింగ్‌ను బాగా ఇష్టపడతారు. తరచూ గిఫ్ట్ కొనుగోలు చేస్తుంటారు. తమ పార్ట్‌నర్‌పై ప్రేమను చూపించడానికి వాటిని ప్రజెంట్ చేస్తుంటారు. తులారాశి వారు ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే, వారితో ప్రేమలో పడిపోతారు. వారిపై ప్రేమను చూపించడానికి గిఫ్ట్స్, రుచికరమైన వంటకాలను రుచిచూపిస్తూ ఆశ్చర్యపరుస్తారు. అయితే తమ పార్ట్నర్ నుంచి అదే స్థాయిలో ట్రీట్‌ను డిమాండ్ చేయరు.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Zodiac signs