Leo Horoscope 2023: నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు. జులై 23 నుంచి ఆగస్ట్ 22వ తేదీల మధ్య జన్మించిన వారికి సింహ రాశి వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 సింహ రాశి వారికి ఎలా ఉంటుంది? రిలేషన్, కెరీర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారు? అనే విషయాలు తెలుసుకోండి.
* జనవరి
ఎదుటివారి దురుద్దేశాలు తెలిసిన తర్వాత కూడా మీరు వారితో సన్నిహితంగా ఉంటే ప్రమాదంలో పడతారు. ఇతరులను గుడ్డిగా నమ్మేస్తారు. త్వరలో ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది. మీరు ఇగ్నోర్ చేస్తున్న వ్యక్తి చెప్పా పెట్టకుండా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి.
రిలేషన్: మీరు అవతలి వారి పట్ల చాలా ఉదారంగా ఉన్న అది మీ వైపు నుండి మాత్రమే ఉంటుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టు ఉండకపోవచ్చు. వారికి వేరే ఉద్దేశం ఉంటే వారి పట్ల మీ అంచనాలను తగ్గించుకోండి.
కెరీర్: మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి మీ దగ్గర తగిన సహకారం ఉండేలా చూసుకోండి. మీ ఐడియాలను సహ ఉద్యోగి దొంగిలించవచ్చు. మీ వల్ల మీతో పాటు పనిచేసే వారికి ఉపయోగం కలుగుతుంది.
లక్కీ కలర్: రూబీ పింక్(Ruby Pink)
* ఫిబ్రవరి
మీరు సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినప్పటికీ ఇతరులకు మీ పట్ల వేరే భావన ఉంటుంది. సమయానుకూలంగా మీ ప్రాజెక్టులను పూర్తిచేసే అవకాశం ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలిసి వారి ద్వారా కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశాన్ని పొందుతారు.
మీ దగ్గర తగినంత ధైర్యం కూడా ఉంది. దూరప్రాంతాల నుంచి మీకు కావాల్సిన వారు వచ్చి మీకు శుభవార్త అందిస్తారు.
రిలేషన్: ప్రస్తుతం మీ బంధం నిలకడగా ఉంటుంది. మీకు వేరే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇతరుల వల్ల కొని చికాకులు కలుగుతాయి.
కెరీర్: ఒక కొత్త ఆలోచన మీకు ఉత్తేజాన్ని ఇస్తుంది. మీకు డబ్బు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులు నిరంతరంగా శ్రమించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: హనీ ఆరెంజ్(Honey Orange)
* మార్చి
ప్రస్తుతం మీ మనసుకి ప్రశాంతత అవసరం కాబట్టి దానికి తగినట్లుగా ఉండండి. ఏ విధంగా సేదతీరిన అది మీ ముందస్తు జీవితాన్ని బాగా మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది . ఎప్పుడూ లేని విధంగా ఒక వ్యక్తి ఆసక్తిగా కనపడతాడు. ఒంటరిగా కొంత సమయాన్ని గడపండి,కుటుంబం లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రస్తుతం రుణాలు తీసుకోవడం మానండి.
రిలేషన్: ప్రస్తుతం మీరు ఒంటరిగా గడపడం కీలకం. ప్రశాంతత కోసం మనశ్శాంతి కోసం దూరంగా గడపాలని కోరుకుంటారు. ఎవరి సహాయం అడిగినా మీకు లభిస్తుంది.
కెరీర్: మీ నుంచి కొత్త ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో వేగం పెంచాలి. మీపై అధికారి నియమాలు మారుస్తారు. జంతువుల వ్యాపారంలో ఉన్న వారికి డిమాండ్ పెరుగుతుంది.
లక్కీ కలర్: లైమ్ గ్రీన్(Lime Green)
* ఏప్రిల్
మీపై అధికారుల వద్ద మంచి గుర్తింపు పొందుతారు. మిమ్మల్ని చాలాకాలంగా గమనిస్తున్న వారు మీకు పని అప్ప చెబుతారు. మీపై మీకున్న నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యం గురించి గత వైభవం గురించి ఇతరులను ప్రశంసిస్తారు.
రిలేషన్: మీ ప్రస్తుత బంధంలో కొత్తదనానికి చోటు ఇవ్వండి. మీకు దగ్గరి వారు ఒకరు మీ స్నేహితుల సమూహంలోకి రావాలని ప్రయత్నిస్తారు కానీ అది మీకు ఇష్టం ఉండదు. ఇతరులను కలిసినప్పుడు మీ గురించి మీరు చాలా తక్కువగా బయట పెడతారు.
కెరీర్: మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే అవి వృద్ధిని సాధిస్తాయి. ఇతరులకు వచ్చిన అవకాశం పై మీ దృష్టి పడుతుంది. ప్రస్తుతానికి గమనిస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ శక్తిని బయట పెట్టండి.
లక్కీ కలర్: పెరల్ గ్రే(Pearl Grey)
* మే
మీకు ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడం కష్టం. చిన్న చిన్న పనులతోనే మీకు టైమ్ సరిపోతుంది. మీకు అనువైన సమయం నడుస్తుంది. గతంలో మీరు చేసిన పనులకు రివార్డులు పొందుతారు. ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఒకేసారి రకరకాల విషయాల గురించి ఆలోచిస్తూ చికాకు పొందుతారు. మీలో ఉత్తేజం కోసం చిన్న విరామం అవసరం.
రిలేషన్: మీ భార్య ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పాత విషయాలన్నీ గుర్తుకొస్తాయి. మీరు తెలియజేసే భావాలు ఆదర్శవంతంగా ఉంటాయి.
కెరీర్: పనిచేయడానికి ఇబ్బంది పడేవారు మీకు లేనిపోని ఒత్తిడిని కలిగిస్తారు. ఆ విషపూరిత వాతావరణ నుండి బయటపడండి. కొత్త జాబ్ ను చూసుకోండి.
లక్కీ కలర్: లావెండర్(Lavender)
మీ రాశికి 2023లో ఏ తేదీ అత్యంత అనుకూలమైనది? తెలుసుకోండి
* జూన్
చాలామంది స్నేహితులు వద్ద మీ ఉద్దేశాలను పూర్తిగా చెప్పవద్దు. మీకు తెలియకుండా కొన్ని విషయాల్లో దూరి పోతుంటారు. రకరకాల భావాలు ఆలోచనలు కలుగుతాయి. సడన్ డెసిషన్ తీసుకోవద్దు. మీరు గందరగోళానికి గురి అయితే ఆ పనిని వాయిదా వేయండి. ధ్యానం చేయడం ప్రారంభించండి.
రిలేషన్: మిమ్మల్ని ఆకర్షించే వారు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తారు. ఆన్ లైన్ డేటింగ్ యాప్ లకు అలవాటు పడితే, సాధారణంగా కంటే తీరిక లేకుండా ఉంటారు. హాట్ బ్రేక్ అయితే సింపతి కోసం ప్రయత్నించ వద్దు.
కెరీర్: మీ పని సామర్ధ్యాన్ని తెలియజేసేలా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రస్తుతం పని చేస్తున్న చోటులోనే అనుకోకుండా కొత్త అవకాశం వస్తుంది. ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
లక్కీ కలర్: మస్టర్డ్(Mustard)
* జులై
మీకు ప్రముఖ వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంటే వారి సమయానికి విలువ ఇవ్వండి. మీరు చేయలేని పనుల గురించి మాట్లాడవద్దు. కొంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. సీనియర్లు మీ పనితీరు పట్ల ఇంప్రెస్ అవుతారు. దానిని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు.
రిలేషన్: మీ ప్రస్తుత బంధంలో మీకు విసుకు కలుగుతుంది. దాన్ని సరి చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. దూర ప్రాంతంలో ఉండే వారితో మీ సంబంధాలు కోల్పోతారు.
కెరీర్: మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంటుంది. మీ ఎదుగుదలను చూసి చాలామంది జీర్ణించుకోలేరు.
ఎవరైనా మీ సూచనలకు విలువివ్వకపోతే అది విలువైనది కాదని అర్థం.
లక్కీ కలర్: ఈజిప్టియన్ బ్లూ(Egyptian blue)
* ఆగస్ట్
కొందరు మీతో ఉద్దేశం పూర్వకంగా గొడవపడాలనుకుంటారు. మీరు ఉన్నంతలో దాన్ని తిప్పి కొట్టడానికి ప్రయత్నించండి. మీ కోపం ఒక సమస్యగా మారొచ్చు గాని దాన్ని తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. మీపై పని భారం పెంచి ఒత్తిడి కలిగించి ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు. మీ మైండ్ లో చాలా తిరుగుతున్న కానీ ప్రతిదాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
రిలేషన్: మీ భాగస్వామితో విలువైన సమయాన్ని గడపాలనుకుంటారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటికీ అది అనుకున్నంతగా పనిచేయదు. మీరు గతంలో ఇష్టపడిన వారు మీ పట్ల స్పందించవచ్చు.
కెరీర్: మీరు అనుకున్నట్టుగానే మీ పని జరుగుతుంది కానీ చేసే విధానంలో మార్పు ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు చాలా కఠినంగా అనిపిస్తుంది. మీ పనికి తగిన గుర్తింపు లభించలేదని మీరు బాధపడితే దాన్ని ఇతరుల వద్ద ప్రస్తావించ వద్దు.
లక్కీ కలర్: పీనట్ బ్రౌన్(Peanut Brown)
మీరు ధనవంతులు కావాలంటే.. ఈ వాస్తు మార్పులు చేసి చూడండి..
* సెప్టెంబర్
మీరు అనుకున్న విధంగా అన్నీ జరగడానికి సహకారం లభిస్తుంది. కృతజ్ఞత భావంతో నిండి ఉంటారు. ఒక చిన్న సమస్యపై గొడవ జరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామికి మీతో సమన్వయం లేక మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. మీరు కొంత సమయాన్ని ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. దైవ దర్శనం సహకరిస్తుంది.
రిలేషన్: మీరు అనవసరమైన చిక్కుల్లో పడతారు దానివల్ల అశాంతి లభిస్తుంది. మీరు నమ్మిన స్నేహితుడితో దీన్ని పంచుకోవడం వల్ల కొంత స్వాంతన అందుతుంది. ఇతరులను అంచనా వేయటంలో తప్పటడుగు వేస్తారు.
కెరీర్: మీరు ప్రస్తుతం మెరుగైన వృద్ధిని సాధిస్తారు. మీరు అనుకున్న విధంగా మీ బకాయిలు తిరిగి వస్తాయి. కొత్త జాబ్ కి దరఖాస్తు చేసుకుంటే, అవకాశం కలిసి వస్తుంది.
లక్కీ కలర్: ఎమరాల్డ్ గ్రీన్(Emerald green)
* అక్టోబర్
మీరు ఏదో జరుగుతుందని భయపడితే, మీ భయాలు నిజమయ్యే అవకాశం ఉంది. రోజులు సమాంతరంగా నడుస్తాయి. మీ దినచర్య మీరు అనుకున్నట్టుగా నడుస్తుంది. కొందరు స్నేహితులు మిమ్మల్ని కలవడానికి రావచ్చు, వారిని కలవడానికి కూడా మీరు ఆసక్తి చూపిస్తారు.
రిలేషన్: మీకు గతంలో పరిచయం ఉన్న వ్యక్తి తాలూకా ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీరు వారి గురించి ఆలోచిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. మీ మనసులోని ఆలోచనలు నిరుత్సాహపరిచిన, దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రొమాంటిక్ ట్రిప్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కెరీర్: మీకు కొత్త ఆలోచనలు ఉంటే అవి పని చేయడానికి ఇది సరైన సమయం. మీ ఉద్యోగం కోసం సరైన వ్యక్తిని కలుస్తారు. మీ పట్ల మీకు సందేహం వద్దు. మీరు వెళ్లే దారి సరైనదే.
లక్కీ కలర్: షాడో గ్రే(Shadow Grey)
* నవంబర్
మీరు వినయంగా ఎటువంటి కంగారు లేకుండా మీ దినచర్యను పాటిస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా మీ పనులు పూర్తి అవ్వడం మీరు గమనిస్తారు. మీ పిల్లల ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంతో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. ధన ప్రవాహం ఉంది. ఒత్తిడి దరిచేరదు.
రిలేషన్: వివాదాలకి వెళ్లకుండా ఉండండి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే మీరు ఇబ్బందులు పడతారు. మీరు ప్రేమించేవారు ఈ విషయం గురించి మిమ్మల్ని పక్కన పెట్టవచ్చు.
కెరీర్: ప్రస్తుతం ఉన్న స్థితికి ఆచితూచి అడుగులు వేయడం మంచిది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే ఇది సరైన సమయం. రాబోయే ఇంటర్వ్యూల కోసం మీరు సన్నద్ధం ఇవ్వండి.
లక్కీ కలర్ : అంబర్(Amber)
* డిసెంబర్
మద్యస్థం గా ఉండే జీవితం మీకు ఒత్తిడిని కలిగిస్తుంది దాన్ని మెరుగుపరుచుకోవాలని మీరు ప్రయత్నిస్తారు. మీ పాత సహచర ఉద్యోగులు మిమ్మల్ని కలుస్తారు. చాలా అవకాశాలు ఉన్నాయి కానీ మీకు సరైన దాన్ని ఎన్నుకోండి. ఇన్నాళ్ళ నుంచి దాచుకున్న భావోద్వేగం ఒకసారిగా బయటపడుతుంది. ఆర్థిక పురోగతిని చూస్తారు.
రిలేషన్: నీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు ఇష్టపడే వ్యక్తిలో కొత్త కోణాన్ని చూస్తారు. థ్రిల్ కోసం తెలియని విషయాలకు వెళ్ళవద్దు విషయాల జోలికి వెళ్ళవద్దు.
కెరీర్: పనిలో విరామం మీకు కాస్త ఊరట కలిగిస్తుంది. మీకు వచ్చిన అవకాశం ద్వార మీరు రివార్డులను పొందుతారు. మీరు స్థాయిని మెరుగుపరుచుకోవడం కోసం చూస్తే త్వరలో అది లభిస్తుంది.
లక్కీ కలర్: స్కార్లెట్ రెడ్(Scarlet Red)
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Leo, Zodiac signs